Tag Archives: raju suicide

సైదాబాద్ నిందితుడు రాజు చేతి పై ఉన్న మౌనిక పేరు వెనుక ఉన్న రహస్యం ఇదే..!

సాధారణంగా మనం మన చేతి పై లేదా మన శరీరంపై మనకు ఎంతో ప్రియమైన వారి పేర్లను టాటూలు వేయించుకోవడం చూస్తున్నాము. ఈ క్రమంలోనే సెప్టెంబర్ 9వ తేదీన సైదాబాద్ సింగరేణి కాలనీలో ఆరు సంవత్సరాల చిన్నారి చరిత్రపై రాజు అనే యువకుడు చిన్నారిపై అత్యాచారం చేసి ఆపై చంపిన ఘటన రెండు తెలుగు రాష్ట్రాలలో సంచలనంగా మారింది.ఈ క్రమంలోనే చనిపోయిన చిన్నారికి న్యాయం జరగాలంటే నిందితుడిని కఠినంగా శిక్షించాలంటూ పెద్ద ఎత్తున నిరసనలు, డిమాండ్లు వెల్లువెత్తాయి.

నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్న సమయంలో నిన్న ఉదయం రాజు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఆ మృతదేహం నిందితుడు రాజుదేనని పోలీసులు తన చేతి పై ఉన్న మౌనిక అనే టాటూ ఆధారంగా గుర్తించారు. మరి ఈ మౌనిక ఎవరు? ఇలా రెండు చేతులపై మౌనిక అనే పేరును ఎందుకు రాయించుకున్నారు అనే విషయానికి వస్తే..

నిందితుడు రాజు భార్య పేరు మౌనిక. పెళ్లి తర్వాత రాజు నిత్యం తాగొచ్చి తన భార్యను చిత్రహింసలకు గురి చేస్తుండడంతో మౌనిక నిందితుడు రాజునుంచి వెళ్ళిపోయి సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం జలాల్‌పురంలోని పుట్టింట్లోనే నివసిస్తోంది. ఈ విధంగా వీరు పెళ్లి అయిన సమయంలో తన భార్య పేరును రాజు చేతి పై టాటూ వేయించుకున్నారు. ఇలాతన భార్య తన తో గొడవపడి పుట్టింటికి వెళ్ళిపోయి రాకపోవడంతో ఆ రాజు తన మేనమామ కూతుర్ని పెళ్లి చేసుకున్నట్లు కొందరు వెల్లడించారు.

ఈ క్రమంలోనే తన పేరును కూడా మౌనిక గా మార్చి పెట్టుకున్నట్లు తెలుస్తోంది.అయితే ఈ విషయంపై తన భార్య మౌనిక మాట్లాడుతూ తన భర్త తాగుబోతు అన్న మాట నిజమే కానీ ఈ విధంగా హత్యాచారం చేసే అంత దుర్మార్గుడు కాదని, తన భర్త రెండోపెళ్లి చేసుకోలేదని,తన భర్తను పోలీసులు చంపి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని తన భార్య మౌనిక వెల్లడించారు.

పోలీసులే రాజును హత్య చేశారు.. అతడి కుటుంబ సభ్యుల ఆరోపణ..

సింగరేణి కాలనీలో చిన్నారిపై అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన నిందితుడు రాజు కోసం గత వారం రోజులుగా పోలీసులు గాలించగా.. రైలు పట్టాలపై అతడి శవం కనిపించిన విషయం తెలిసిందే. అతడి చెయ్యిపై మౌనిక అనే పచ్చబొట్టు ఉండటంతో అతడే రాజు అంటూ పోలీసులు నిర్ధారించారు. అయితే రాజును పోలీసులే హత్య చేశారని రాజు కుటుంసభ్యులు ఆరోపిస్తున్నారు.

వాళ్లే అతడిని చంపేసి.. ఎవరికీ అనుమానం రాకుండా ఘట్ కేసర్ వద్ద రైలు పట్టాలపై పడేసినట్లు చెబుతున్నారు. అయితే.. రాజు తప్పుచేసి ఉండొచ్చు. కానీ అతడిని అరెస్టుచేసి .. నిజాలు నిర్ధారణ అయిన తర్వాత శిక్షలు విధించాల్సింది. అలా కాకుండా గుట్టు చప్పుడు కాకుండా ఇలా చంపేసి.. ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు కథ అల్లడం సరైంది కాదంటూ అతడి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.

రాజు ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదంటూ వాళ్లు తెలిపారు. రాజు చిన్నారిని రేప్ చేశాడంటే తాము అస్సలు నమ్మే వాళ్లం కాదని.. కానీ ఇంట్లో ఆ చిన్నారి శవం కనిపించడంతో నమ్మాల్సి వచ్చిందని అన్నారు. ఇది ముమ్మాటికి పోలీసులే అతడిని హత్య చేసి ఉంటారని వాళ్లు ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉండగా.. సోషల్ మీడియా సైట్లు యూజ్ చేయకపోవడం వల్ల కనుక్కొవడం అతడి ఆచూకీ కనుక్కోవడం కష్టంగా మారింది. నిందితుడిని పట్టుకునేందుకు బృందాలుగా విడిపోయి రాజు కోసం గాలించాయి.

కేసు తీవ్రత దృష్ట్యా పోలీసులు కీలక ప్రకటన కూడా చేశారు. రాజును పట్టిస్తే రూ.10 లక్షలు ఇస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. మరోవైపు రాజును ఎన్‌కౌంటర్ చేయాలనే డిమాండ్ పెరిగింది. మంత్రి మల్లారెడ్డి కూడా రాజును ఎన్ కౌంటర్ చేస్తామని తెలిపారు. వీటిని అన్నింటిని దృష్టిలో ఉంచుకొని రాజును ఎన్ కౌంటర్ చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని అతడి బంధువులు వాదిస్తున్నారు.

సైదాబాద్ నిందితుడు రాజు ఆత్మహత్య.. మృతదేహాన్ని కనిపెట్టిన పోలీసులు..

తెలంగాణలోని సైదాబాద్ ఘటనలో చిన్నారిని అత్యాచారం చేసి హత్య చేసిన రాజును పట్టుకోవడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. అయితే దీనిపై తాజాగా ఓ వార్త వెలుగులోకి వచ్చింది. నిందితుడు రాజు ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం వినపడుతోంది. వివరాల్లోకి వెళ్తే.. గత కొన్ని రోజుల క్రితం హైదరాబాద్ లోని సైదాబాద్ ప్రాంతంలో ఓ ఆరేళ్ల చిన్నారి చిప్స్ ప్యాకెట్ కొనడానికి బయటకు వెళ్లగా.. ఆ చిన్నారిని బలవంతంగా తీసుకెళ్లి.. అత్యాచారం, హత్య చేశాడు రాజు అనే నిందితుడు.

అయితే ఈ ఘటనను ప్రతీ ఒక్కరూ సీరియస్ గా తీసుకున్నారు. సెలబ్రిటీల దగ్గర నుంచి రాజకీయ ప్రముఖుల వరకు తీవ్రంగా స్పందించారు. కుటుంబసభ్యులు, స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళన చెప్పట్టగా.. నిందుతుడిని పట్టుకొని న్యాయం చేస్తామంటూ పోలీసులు హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇంత వరకు అతడి ఆచూకీని మాత్రం పోలీసులు కనుక్కోలేకపోయారు.

పవణ్ కళ్యాణ్, రేవంత్ రెడ్డి , వైఎస్ షర్మిల, మంచు మనోజ్ తో పాటు ఎంతో మంది బాధిత కుటుంబసభ్యులను పరామర్శించారు. అతడిని పట్టిస్తే నజరానాలను కూడా అందజేస్తామని సీనీ ప్రముఖులు ప్రకటించారు. అయితే తాజాగా అతడు ఆత్మహత్య చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై పోలీసులు అధికారికంగా ప్రకటించలేదు.

త్వరలో ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎల్బీ నగర్ నుంచి బయలుదేరిన రాజు నాగోల్ లో మద్యం కొనుగోలు చేసినట్లు సీసీటీవీ ఫుటేజీల ద్వారా పోలీసులు గుర్తించారు. ఆ తర్వాత ఉప్పల్ వెళ్లాడు. అక్కడి వరకు సిసీటీవీ ఫుటేజీల ద్వారా అతని కదలికలను పోలీసులు గుర్తించారు. తర్వాత వారం రోజుల పాటు రాజు కోసం గాలించిన పోలీసులు చివరకు అతని మృతదేహాన్ని కనిపెట్టారు. ఘట్ కేసర్ రైలు పట్టాలపై పోలీసులకు అతడి మృతదేహం కనిపించింది.