Tag Archives: ramgopal varma

Ramgopal Varma: గరికపాటిని వదిలేదే లేదు.. రెచ్చిపోయి ట్వీట్ చేసిన ఆర్జీవీ!

Ramgopal Varma: ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో మారుమోగుతున్న పేరు గరికపాటి నరసింహారావు. ఇటీవల అలయ్ బలయ్ కార్యక్రమంలో చిరంజీవిని హెచ్చరిస్తూ గరికపాటి చేసిన వాఖ్యలే ఆయన పాలిటి శాపం గా మారాయి. అయితే ఈ వివాదం ఇప్పట్లో సద్దుమణిగెలా కనిపించడం లేదు. గరికపాటి మాటలకు తన ప్రవర్తనతో బుద్ధి చెప్పిన చిరు ఆ వివాదానికి అంతటితో పులిస్టాప్ పెట్టేసాడు. కానీ అభిమానులు మాత్రం గరికపాటిని వదిలిపెట్టడం లేదు.

ప్రతి ఒక చిన్న విషయాన్ని పెద్దదిగా చేస్తూ అతని ఏకి పారేస్తున్నారు. అతని పై దారుణంగా ట్రోలింగ్స్ చేయడంతో పాటు మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు.
నాగబాబు సైతం మెగా ఫ్యాన్స్ ని సైలెంట్ గా ఉండమని చెప్పినా కూడా మెగా ఫాన్స్ మాత్రం ఈ విషయంలో తగ్గదలే అన్నట్టుగా గరికపాటికి గట్టిగా బుద్ధి చెప్పడానికి ఫుల్ గా ప్రిపేర్ అయినట్లు తెలుస్తోంది.

ఇక ఇది ఇలా ఉంటే ఈ వివాదం ఇప్పట్లో సద్దుమణియేలా కనిపించడం లేదు అనుకుంటు ఉండగా ఈ వివాదం పట్ల టాలీవుడ్ సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సైతం స్పందించారు. ఈ సందర్భంగా రాంగోపాల్ వర్మ స్పందిస్తూ సోషల్ మీడియాలో ఈ విధంగా రాసుకొచ్చారు..మిమ్మల్ని మెగా ఫ్యామిలీ క్షమించినా.. అభిమానులైన మేం వదిలే ప్రసక్తే లేదంటూ..ఆగ్రహం వ్యక్తం చేశారు.

Ramgopal Varma: గరికపోచతో సమానం..

రాంగోపాల్ వర్మ గరికపాటి నరసింహరావు పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ వరుసగా సోషల్ మీడియాలో ట్వీట్ లు చేసాడు. ఈ సందర్భంగా ట్వీట్ చేస్తూ..హే గరికపాటి..బుల్లి బుల్లి ప్రవచనాల్లో నక్కినక్కి దాక్కో, అంతేకానీ పబ్లిసిటీ కోసం ఫిలిం ఇండస్ట్రీ మీద మొరగొద్దు..మెగాస్టార్ ఏనుగు.. నువ్వు ఏంటి అనేది నీకు తెలుసు అనుకుంటున్నాను.. నువ్వు ఏంటో నువ్వు తెలుసుకో అంటూ ట్వీట్ చేశారు..ఆర్జివి.

Ramgopal Varma: ఆ సినిమాపై ప్రశంసలు కురిపిస్తూ బాలీవుడ్ హీరోల పరువు తీసిన వర్మ.. వైరల్ అవుతున్న కామెంట్స్!

Ramgopal Varma: రాంగోపాల్ వర్మ సంచలనాలకు కేంద్ర బిందువుగా ఉన్నటువంటి ఈయన ఎప్పుడు ఏం మాట్లాడినా పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. ఇలా రాంగోపాల్ వర్మ తాజాగా బాలీవుడ్ సినిమాల గురించి మాట్లాడుతూ పుండు పై కారం చల్లినట్లు ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న విషయం మనకు తెలిసిందే. భారీ బడ్జెట్ తో సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నప్పటికీ ఈ సినిమాలు మాత్రం తీవ్ర నిరాశకు గురి చేస్తున్నాయి.

సాధారణ హీరోల సినిమాలు మాత్రమే కాకుండా స్టార్ హీరోల సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ కావడంతో అందరిని కాస్త విస్మయానికి గురి చేస్తున్నాయి. ఒకవైపు బాలీవుడ్ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ ఎదుర్కోగా టాలీవుడ్ సినిమాలు మాత్రం హిందీలో డబ్ అవతూ థియేటర్ల వద్ద కాసుల వర్షం కురిపిస్తున్నాయి. ఇప్పటికే ఎన్నో సౌత్ ఇండస్ట్రీ నుంచి విడుదలైన సినిమాలు హిందీలో కూడా సత్తా చాటుకున్నాయి. ప్రస్తుతం కార్తికేయ2 సినిమా కూడా బాలీవుడ్లో కలెక్షన్స్ సునామి సృష్టిస్తుంది.

కేవలం నార్త్ ఇండస్ట్రీలో 50 థియేటర్లతో విడుదలైన ఈ సినిమా మంచి టాక్ సొంతం చేసుకోవడంతో ప్రస్తుతం వెయ్యికి పైగా థియేటర్లలో ఈ సినిమా రన్ అవుతుంది. విచిత్రం ఏమంటే బాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర హీరోలుగా ఉన్నటువంటి అమీర్ ఖాన్ లాల్ సింగ్ చద్దా, అక్షయ్ కుమార్ రక్షాబంధన్ వంటి సినిమాలను సైతం తొలగించి కార్తికేయ 2 సినిమా వేయడం గమనార్హం.

Ramgopal Varma: ఆ హీరోలను తీసి పారేసిన వర్మ..

ఈ క్రమంలోనే ఈ విషయంపై రాంగోపాల్ వర్మ స్పందిస్తూ అమీర్ ఖాన్ లాల్ సింగ్ చద్దా, అక్షయ్ రక్షాబంధన్, రాజమౌళి త్రిబుల్ ఆర్, ప్రశాంత్ నీల్ కేజిఎఫ్ సినిమాల కన్నా కార్తికేయ 2 సినిమా మంచి సక్సెస్ అందుకుందని ఈ సందర్భంగా ఈయన నిఖిల్ సినిమాపై ప్రశంసల కురిపిస్తూ బాలీవుడ్ హీరోల పరువు తీశారు. ఇలా రాంగోపాల్ వర్మ ఇప్పుడే హిట్లు లేక సతమతమవుతున్న బాలీవుడ్ హీరోల గురించి ఇలా కామెంట్ చేస్తూ పుండు మీద కారం చల్లారని తెలుస్తోంది. ప్రస్తుతం వర్మ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Ramgopal Varma: మొత్తానికి శివ సినిమా సీక్రెట్ బయటపెట్టిన వర్మ… శివ సినిమా కాఫీ అంటూ కామెంట్?

Ramgopal Varma: వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అయినటువంటి రాంగోపాల్ వర్మ ప్రస్తుతం విభిన్న చిత్రాలు తీస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. ఆయన ఏదైనా చెప్పాలనుకున్న సినిమా ద్వారా తెలియజేస్తారు. ప్రస్తుతం బయోపిక్ చిత్రాలు,రాజకీయ నాయకుల జీవిత కథ ఆధారంగా సినిమాలను తెరకెక్కిస్తున్నారు. అయితే ఒకప్పుడు వర్మ సినిమా అంటే అందులో ఏదో మ్యాజిక్ ఉండేది.

అప్పట్లో వర్మ సినిమాలకు ఎంతోమంది అభిమానులు ఉండడమే కాకుండా ఆయన సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకునేవి. ఇకపోతే వర్మ దర్శకత్వంలో అప్పట్లో ట్రెండ్ సెట్ చేసింది.ఇప్పటికీ శివ సినిమా అంటే ప్రేక్షకులకు తెలియని అనుభూతి కలుగుతుంది. అలా నాగార్జున హీరోగా నటించిన శివ సినిమా ఆల్ టైం హిట్ మూవీగా నిలిచింది.

ఇకపోతే ప్రస్తుతం వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన లడ్కీ (అమ్మాయి) అనే సినిమా తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాని పాన్ ఇండియా స్థాయిలో మాత్రమే కాకుండా, చైనాలో కూడా ఈ సినిమాని విడుదల చేయనున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న వర్మ శివ సినిమా గురించి ఆసక్తికరమైన విషయాన్ని బయట పెట్టారు.

రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ నుంచి కాపీ కొట్టినదే శివ…

బాక్సాఫీస్ ట్రెండ్ సెట్టర్ గా నిలిచిన శివ సినిమాను తాను రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ సినిమా నుంచి శివ సినిమాను కాపీ కొట్టాను అంటూ అసలు విషయం బయట పెట్టారు. ఆ సినిమాలో హీరో రెస్టారెంట్ కోసం పోరాటం చేయగా శివ సినిమాలో హీరో కాలేజ్ కోసం పోరాటం చేస్తారు. కేవలం ఈ సన్నివేశం ఒక్కటే మార్చానని మిగిలినది మొత్తం అలాగే చేయటం వల్ల ఈ సినిమా స్క్రిప్ట్ 20 నిమిషాలలో పూర్తి చేశానని ఈ సందర్భంగా వర్మ శివ సినిమా సీక్రెట్ బయటపెట్టారు. ఈ క్రమంలోని శివ సినిమా గురించి వర్మ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

RGV: ఇండస్ట్రీలో ప్రతి వాడికి స్వార్ధమే.. ‘పెద్ద దిక్కు’ అని టైటిల్ ఇచ్చినంత మాత్రాన వాడి మాట ఎవడూ వినడు : అర్జీవీ

Ram Gopal Varma: సినీ దిగ్గజం.. దాసరి నారణయణరావు చనిపోయిన తర్వాత సినీ పరిశ్రమకు పెద్ద దిక్కు ఎవరనే దానిపై పెద్ద చిక్కు వచ్చి పడింది. చాలామంది మెగస్టార్ చిరంజీవి అని భావిస్తుండగా.. పెద్దన్నగా మాత్రం తాను ఉండను అంటూ ఇటీవల అతడు వ్యాఖ్యలు చేసేశాడు. దీని తర్వాత ఇండస్ట్రీలో ఈ టాపిక్ పెద్ద సంచలనంగా మారింది. సినీ ప్రముఖులు దీనిపై వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ఎవరికీ తోచిన విధంగా వాళ్లు మాట్లాడేస్తున్నారు. చిరంజీవి అలా ప్రకటన చేసిన వెంటనే.. మోహన్ బాబు కూడా సినీ పరిశ్రమ విషయంలో మౌనంగా ఉంటున్నామని చేతకాని తనంగా అనుకోవద్దని ఘాటుగా మాట్లాడుతూ.. జగన్ ప్రభుత్వానికి లేఖ కూడా రాశాడు.

సినీ పరిశ్రమ అంటే కేవలం నలుగురు హీరోలు, నలుగురు ప్రొడ్యూసర్లు, నలుగురు డిస్ట్రిబ్యూటర్లు కాదన్నారు. అందరినీ సమానంగా చూడాలని.. అందరూ కలిసి.. పరిశ్రమ సమస్యలపై పోరాడాలన్నారు. ఒకరోజు కూర్చొని ప్రభుత్వంతో చర్చలు జరపాలన్నారు. ఎవరూ ఎక్కువ కాదు.. తక్కువ కాదు అంటూ స్పష్టం చేశాడు.

RGV : సామీ మీరు రావాలి సామీ.. మీరే దిక్కు..

టికెట్ల వ్యవహారంపైనే ప్రస్తుతం ఇదంతా తిరుగుతోంది. దీనిపై రామ్ గోపాల్ వర్మ కూడా స్పందించారు. టికెట్ల రేట్లను తగ్గించడానికి ప్రభుత్వం ఏదైనా ప్లాన్ చేసిందా.. ఆ ప్లాన్ వెనుకు సినిమాలో ఉన్న ఒకరిద్దరు హీరోల్ని తొక్కేయాల్నే కారణంగానే ఇలా చేస్తున్నారా..అనే డౌట్ ఎక్స్‌ప్రెస్ చేస్తున్నారు ఆర్జీవీ. ఆర్జీవీ ట్వీట్ పై అతడు శిష్యూడు ఆర్ఎక్స్ 100 దర్శకుడు ట్వీట్ చేశాడు. సినీ పరిశ్రమకు మీరే పెద్ద దిక్కు ‘సామీ మీరు రావాలి సామీ’ అంటూ రాసుకొచ్చాడు. ఈ ట్వీట్ వైరల్ గా మారింది. ఇందతా జరుగుతున్నా.. కొంతమంది మాత్రం ఇండస్ట్రీకి పెద్ద దిక్కు చిరంజేవే అని.. కొందరు అంటుంటు.. మరి కొందరు మోహన్ బాటు అంటూ.. ఎవరికీ వారు తమ అభిప్రాయాలను చెబుతున్నారు.

RGV : ఇండస్ట్రీ వాళ్ళకి పెద్ద దిక్కు ఉండాలనుకోవడం మూర్ఖత్వం :

Ram Gopal Varma: దానికి ఆర్జీవీ మాత్రమే అర్హుడు.. సంచలన వ్యాఖ్యలు చేసిన ప్రముఖ దర్శకుడు?

అజయ్ గారూ, ఇండస్ట్రీ వాళ్ళకి పెద్ద దిక్కు ఉండాలనుకోవడం మూర్ఖత్వం. ఎందుకంటే, ఇండస్ట్రీలో ఉన్న ప్రతి వాడికీ వేరే వేరే స్వార్ధాలు ఉంటాయి. దాని మూలాన వాడికి మాత్రమే పనికొచ్చే మాటే ప్రతివాడూ వింటాడు. కానీ, ఎవడికో పెద్దదిక్కు అని టైటిల్ ఇచ్చినంత మాత్రాన వాడికి మాట ఎవడూ వినడు.

తాలిబన్లనై ఆర్జీవీ ట్వీట్.. వాళ్లు అలాంటి వారే అంటూ..!

ఆఫ్గనిస్థాన్‌లో తాలిబన్ల ఆగడాలు తారాస్థాయికి చేరాయి. దాదాపు దేశం మొత్తం స్వాధీనం చేసుకున్నారు. కొన్ని దేశాల అండదండలతో వారు ప్రభుత్వాన్ని నడిపే స్థాయికి వెళ్లిపోయారు. దీంతో అక్కడ అరాచకపాలన మొదలైంది. సైనికుడు, పౌరుడు అనేది చూడకుండా ఇష్టం వచ్చినట్లు దాడులకు పాల్పడుతున్నారు. మహిళల విషయానికి వస్తే బలవంతపు పెళ్లిలు, లైంగిక దాడులు చోటుచేసుకుంటున్నాయి.

అయితే ప్రస్తుతం ఆఫ్గనిస్థాన్‌లో జరుగుతోన్న పరిమాణాలపై ప్రతీ ఒక్కరు చర్చించుకుంటున్నారు. అమెరికా సైన్యాలు ఆఫ్గన్‌ను వీడడంతో తాలిబన్లు రెచ్చిపోయారు. ఇక అక్కడ చిక్కుకున్న విదేశియలు వారితో పాటు స్వదేశీయులు కూడా దేశాన్ని విడిచి వెళ్లేందుకు ఏ చిన్న అకకాశం దొరికినా ఉపయోగించుకుంటున్నారు.

ఈ క్రమంలోనే కాబూల్‌ నగరంలోని ఇంటర్‌నేషనల్‌ ఎయిర్‌ పోర్ట్‌ నుంచి విదేశాలకు వెళుతోన్న విమానాల రెక్కలపై వేలాడుతూ వెళుతోన్న దృశ్యాలు యావత్ ప్రపంచాన్ని తనవైపు తిప్పుకుంటున్నాయి. ఇదిలా ఉంటే సుమారు 20 ఏళ్లపాటు అధికారానికి దూరంగా ఉన్న తాలిబన్లు మళ్లీ అధ్యక్ష పీఠాన్ని హస్తగతం చేసుకోవడంతో రచ్చ చేస్తున్నారు. అధ్యక్ష భవనంలో వారు చేస్తున్న హంగామా అంతాఇంతా కారు. అయితే టాలీవుడ్ లో కాట్రవర్సీటీలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే రామ్ గోపాల్ వర్మ తాలిబన్ల వ్యవహారంపై తనదైన శైలిలో స్పందించారు.

తాలిబన్లు అధ్యక్ష భవనంలో చేతిలో ఆయుధాలు పట్టుకొని జాల్సాలు చేస్తున్న తాలిబన్లకు సంబంధించిన వీడియోని షేర్‌ చేస్తూ.. ‘వాళ్లు ఎలాంటి జంతువులనేది ఇది చూస్తేనే అర్థమవుతుందని’ క్యాప్షన్‌ రాసుకొచ్చారు. అక్కడ ప్రతీ ప్రాంతాన్ని తమ హస్తగతం చేసుకున్న తాలిబన్లు కాబుల్ లోని ఓ ఎమ్యూజ్ మెంట్ పార్కులో ఎలక్ట్రిక్ కార్లలో కూర్చొని చిన్న పిల్లలులాగా ఆడారు. ఆ వీడియోను ఆర్జీవీ షేర్ చేస్తూ.. ఇది నిజమే.. తాలిబన్లు చిన్ని పిల్లలు అంటూ స్పందించారు. అయితే ఆర్జీవీ చేసిన ఈ ట్వీట్ ప్రస్తుతం వైరల్ గా మారింది. నెటిజన్లు కూడా పాజిటివ్ గా స్పందించారు.