Ramgopal Varma: రాంగోపాల్ వర్మ సంచలనాలకు కేంద్ర బిందువుగా ఉన్నటువంటి ఈయన ఎప్పుడు ఏం మాట్లాడినా పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. ఇలా రాంగోపాల్ వర్మ తాజాగా బాలీవుడ్ సినిమాల గురించి మాట్లాడుతూ పుండు పై కారం చల్లినట్లు ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న విషయం మనకు తెలిసిందే. భారీ బడ్జెట్ తో సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నప్పటికీ ఈ సినిమాలు మాత్రం తీవ్ర నిరాశకు గురి చేస్తున్నాయి.
సాధారణ హీరోల సినిమాలు మాత్రమే కాకుండా స్టార్ హీరోల సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ కావడంతో అందరిని కాస్త విస్మయానికి గురి చేస్తున్నాయి. ఒకవైపు బాలీవుడ్ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ ఎదుర్కోగా టాలీవుడ్ సినిమాలు మాత్రం హిందీలో డబ్ అవతూ థియేటర్ల వద్ద కాసుల వర్షం కురిపిస్తున్నాయి. ఇప్పటికే ఎన్నో సౌత్ ఇండస్ట్రీ నుంచి విడుదలైన సినిమాలు హిందీలో కూడా సత్తా చాటుకున్నాయి. ప్రస్తుతం కార్తికేయ2 సినిమా కూడా బాలీవుడ్లో కలెక్షన్స్ సునామి సృష్టిస్తుంది.
కేవలం నార్త్ ఇండస్ట్రీలో 50 థియేటర్లతో విడుదలైన ఈ సినిమా మంచి టాక్ సొంతం చేసుకోవడంతో ప్రస్తుతం వెయ్యికి పైగా థియేటర్లలో ఈ సినిమా రన్ అవుతుంది. విచిత్రం ఏమంటే బాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర హీరోలుగా ఉన్నటువంటి అమీర్ ఖాన్ లాల్ సింగ్ చద్దా, అక్షయ్ కుమార్ రక్షాబంధన్ వంటి సినిమాలను సైతం తొలగించి కార్తికేయ 2 సినిమా వేయడం గమనార్హం.
ఈ క్రమంలోనే ఈ విషయంపై రాంగోపాల్ వర్మ స్పందిస్తూ అమీర్ ఖాన్ లాల్ సింగ్ చద్దా, అక్షయ్ రక్షాబంధన్, రాజమౌళి త్రిబుల్ ఆర్, ప్రశాంత్ నీల్ కేజిఎఫ్ సినిమాల కన్నా కార్తికేయ 2 సినిమా మంచి సక్సెస్ అందుకుందని ఈ సందర్భంగా ఈయన నిఖిల్ సినిమాపై ప్రశంసల కురిపిస్తూ బాలీవుడ్ హీరోల పరువు తీశారు. ఇలా రాంగోపాల్ వర్మ ఇప్పుడే హిట్లు లేక సతమతమవుతున్న బాలీవుడ్ హీరోల గురించి ఇలా కామెంట్ చేస్తూ పుండు మీద కారం చల్లారని తెలుస్తోంది. ప్రస్తుతం వర్మ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…
తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…
భారత క్రికెట్‌లో కొత్త తరానికి చెందిన యువ ప్రతిభలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సూర్యవంశీ కుటుంబం పేరు…
నల్లగొండ జిల్లాలో స్నేహం అనే బంధాన్ని ప్రశ్నార్థకంగా మార్చే ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా స్నేహితులుగా కలిసి తిరుగుతున్న ఇద్దరు…
ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా గురించి చర్చ వచ్చినప్పుడల్లా ముందుగా వినిపించే పేరు ఎలాన్ మస్క్. సాంకేతిక రంగం, అంతరిక్ష…
హైదరాబాద్‌లో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి చర్యలతో తరచూ వార్తల్లో నిలిచే హైడ్రా…