Categories: FeaturedMovie News

Thripuraneni Chittibabu : చిరంజీవి, మోహన్ బాబు గారికి మధ్య విభేదలకు కారణం నాగబాబు? : త్రిపురనేని చిట్టిబాబు

Thripuraneni Chittibabu : ఇండస్ట్రీ లో ప్రస్తుతం ఉన్న సీనియర్ హీరోల్లో ఇండస్ట్రీ పెద్ద అంటే చిరంజీవి అనే అంటారు. అయితే చిరంజీవి తో పాటు మోహన్ బాబు వంటి సీనియర్లు ఉన్నారు. ఇక ఇండస్ట్రీ గురించి కొంచెం తెలిసిన వారికి చిరంజీవి కి మోహన్ బాబు కి మధ్య పడదు అనే విషయం తెలిసిందే. అయితే ఎందుకు అన్నది ఎవరికీ తెలియదు. ఇద్దరూ దాసరి నారాయణ రావు గారి శిష్యులే. ఇద్దరూ జీరో నుండి మొదలైయి కష్టపడి పైకి వచ్చినవాళ్ళే. మొదట్లో ఇద్దరూ కలిసి సినిమాలు చేసారు. అయితే స్టార్ డమ్ అన్నీ వచ్చాక ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చిందని అందరూ అంటారు. అయితే ఈ మధ్యనే మోహన్ బాబు గారు తిరుపతి దగ్గర కట్టించిన సాయి బాబా గుడికి కూడా చిరంజీవి గారు, అయన భార్య వెళ్లి వచ్చారు.

మా ఎలక్షన్ లో కూడా ఇదే తీరు…

మొన్నా మధ్య మా ఎలక్షన్ సమయంలో కుడా మోహన్ బాబు కొడుకు మంచు విష్ణు మా ప్రెసిడెంట్ కి అభ్యర్థి గా నిలబడితే మెగా కుటుంబం ప్రకాష్ రాజ్ కు మద్దతు ఇచ్చింది. ఇక్కడ మాటల యుద్ధం జరిగింది ఇరు వర్గాలకు. ఇక వీటిపై నిర్మాత చిట్టిబాబు గారు మాట్లాడుతూ వారి మధ్య విబేధాలు ఏమి లేవు. కానీ మా ఎన్నికల సమయంలో ప్రకాష్ రాజ్ కి మద్దతుగా నిలబడినపుడు మోహన్ బాబు గారు చెప్పారు మీ కుటుంబం నుండి ఎవరైనా నిలబడండి మా అబ్బాయి ని విత్ డ్రా చేయిస్తాను అని.

కానీ ప్రకాష్ రాజ్ కి సపోర్ట్ ఇవ్వము అని చెప్పారు. క్రమశిక్షణ లేని వ్యక్తి ఎన్నికల్లో నిలబడకూడదు. ప్రకాష్ రాజ్ మీద ఫిల్మ్ ఛాంబర్ లో 23 కంప్లైంట్స్ ఉన్నాయి అంటూ వాదించారు. అయితే ఇక్కడ ఎన్నికలు విష్ణు కి ప్రకాష్ రాజ్ కి అయితే దాన్ని చిరంజీవి కి మోహన్ బాబు కి అన్నట్లు మార్చింది నాగబాబు నే. ఇద్దరి మధ్య అనవసరంగా మాట్లాడి ఇరుకున పెట్టాడు. ప్రకాష్ రాజ్ ఓడిపోతే చిరంజీవి ఓడిపోయినట్లు భావించేలా పరిస్థితి తీసుకువచ్చింది నాగబాబు నే అంటూ అభిప్రాయపడ్డాడు. మోహన్ బాబు, చిరంజీవి ఇద్దరి మధ్య బంధం ఇప్పటిది కాదు, వారి సినిమా జీవితం మొదలయినప్పటి నుండి ఉంది. ఇపుడు కొత్తగా వచ్చిన పరిస్థితులకు ఇద్దరూ విడిపోయారనడం మూర్కత్వం అవుతుంది అంటూ చిట్టిబాబు మాట్లాడారు.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

4 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago