PV Sindhu : తెలుగమ్మాయి పూసర్ల వేంకట సింధు తెలియని భారతీయుడు ఉండడు. బాడ్మింటన్ లో ఇండియా పేరుని ప్రపంచంలో సగర్వంగా నిలబెట్టిన సింధు అందరికీ సుపరిచితమే. హైదరాబాద్ కు చెందిన పీవీ సింధు బాడ్మింటన్ లో అప్పటి వరకు ఎవరూ సాధించని ఘనత సాధించింది. ఒలింపిక్స్ ఫైనల్స్ కు వెళ్లడమే రికార్డు అనుకుంటే వెళ్లి మొదటి సారి బ్రాంజ్ మెడల్ అందుకుంది. ఇక ఆ తరువాత సిల్వర్ మెడల్ అందుకుంది. ఇక అనేక ఛాంపియన్ షిప్ లలో గోల్డ్ మెడల్ సాధించిన పీవీ సింధు అతిచిన్న వయసులో ఈ ఘనతలు సాధించి యువతకు ఆదర్శంగా నిలిచింది.
పేరు తెచ్చిన అకాడమీని ఎందుకు వదిలేయాల్సి వచ్చింది…
పీవీ సింధు అటు బాడ్మింటన్ లోనే కాదు తనకు డాన్స్ అన్నా చాలా ఇష్టం. అందుకే అప్పుడప్పుడు డాన్స్ చేస్తూ ఆ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. బాడ్మింటన్ కోర్టులో పులిలా అడే సింధు నాజూకుగా డాన్సులు వేస్తూ కూడా అదరగోడుతోంది. ఇక తాజాగా పీవీ సింధు ఈటీవీలో ప్రసారమయ్యే ఆలీతో సరదాగా గా షోకి వచ్చి అభిమానులను అలరించింది. అయితే ప్రోమో విడుదల చేసింది ఈటీవీ ఛానెల్. ఇక ఆలీ అడిగిన సరదా ప్రశ్నలకు సింధు చిలిపి సమాధానలు ఆకట్టుకున్నాయి. చాలా సరదాగా నవ్వుతూ సింధు కనిపించడం అభిమానులను అలరించింది. ఇక నచ్చిన హీరో ఎవరు అని అడిగితే ప్రభాస్ అంటూ చెప్పింది సింధు.
ఇక నీ వయసులో ఉన్న యువత పార్టీస్ కి వెళ్తూ ఇష్టమైన ఫుడ్ తింటారు అవి చూసినపుడు బాధ అనిపించదా అని అడిగితే నేను ప్రపంచాన్నే చుట్టేస్తున్నా ఇంకెందుకు బాధ పడాలి అంటూ ఆన్సర్ చెప్పింది. ఇక పెళ్లి గురించిన ప్రశ్నకు నచ్చిన వాడు దొరికినపుడు చేసుకుంటా అంటూ నవ్వేసింది. ఇక శిక్షణ తీసుకున్న పుల్లెల గోపీచంద్ అకాడమీ నుండి ఎందుకు బయటికి రావాల్సి వచ్చిందనే ప్రశ్నకు ప్లేయర్ గా కొన్ని విషయాలు అకాడమీలో నచ్చలేదు అంటూ చెప్పడంతో అలీ తో సరదాగా ప్రోమో ఎండ్ అయింది. మొత్తం మ్యాటర్ తెలియాలంటే మాత్రం పూర్తి ఎపిసోడ్ వచ్చేవరకు వెయిట్ చేయాల్సిందే.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…