Tag Archives: Ramya

Ramya Raghupathi: కొడుకు మెయింటెనెన్స్ కోసం నరేష్ డబ్బులు పంపిస్తున్నారు… రమ్య కామెంట్స్ వైరల్!

Ramya Raghupathi: సినీ నటుడు నరేష్ నటి పవిత్ర లోకేష్ ను పెళ్లి చేసుకోబోతున్నారని తెలియడంతో ఈయన మూడో భార్య రమ్య రఘుపతి పలు ఇంటర్వ్యూలకు హాజరవుతూ నరేష్ గురించి సంచలన వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. ఇప్పటికే నరేష్ గురించి ఎన్నో విషయాలను తెలియచేసిన రమ్య తాజాగా మరొక ఇంటర్వ్యూలో పాల్గొని తనుకు నరేష్ ఇచ్చే భరణం అవసరం లేదని తెలిపారు.

నరేష్ నుతాను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను అయితే ఈయన మాత్రం ఇతర మహిళలతో అక్రమ సంబంధాలు పెట్టుకొని తనని దూరం పెట్టారని తెలిపారు. అయితే నరేష్ కువిడాకులు ఇవ్వకూడదని తన కుమారుడు తనతో ఒట్టు వేయించుకున్నాడని అందుకే తాను నరేష్ కు విడాకులు ఇవ్వాలనుకోవడం లేదంటూ ఈమె తెలియజేశారు.

నేను నరేష్ కు విడాకులు ఇవ్వడం కోసం ఆయన మూడు కోట్ల రూపాయల నుంచి 20 కోట్ల వరకు నాకు భరణం ఆఫర్ ఇచ్చారు. అయితే ఆయన ఇచ్చే డబ్బు నాకు అవసరం లేదు నేను ఆయన భార్యగా ఉండాలి నా కొడుకుకు తను తండ్రిగా ఉండాలని, అందుకే తాను విడాకులు ఇవ్వడం లేదు అంటూ రమ్య తెలిపారు.

Ramya Raghupathi: ఆయన ఆస్తి డబ్బు నాకు అవసరం లేదు…

ఇక నరేష్ నా కుమారుడి మెయింటెన్ కోసం డబ్బులు పంపిస్తున్నారు. అయితే గత మూడు సంవత్సరాల నుంచి మాత్రమే నెలకు 50000 చొప్పున పంపించేవారని ప్రస్తుతం 70000 పంపిస్తున్నారని ఈ సందర్భంగా రమ్య తెలిపారు.నేను నరేష్ ఆస్తులపై ఆయన డబ్బుపై ఏమాత్రం ఆశపడలేదు. ఆయన నా కుమారుడికి తండ్రిగా ఉండాలని ఆయనకు నేను భార్యగా ఉండాలని మాత్రమే ఆశపడుతున్నాను. అందుకే ఆయనకు నేను విడాకులు ఇవ్వదలుచుకోలేదు అంటూ ఈమె చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి.

Ramya Raghupathi: విడాకులు ఇవ్వాలని నరేష్ రమ్యకు అన్ని కోట్లు ఆఫర్ చేశారా… అసలు విషయం చెప్పిన రమ్య!

Ramya Raghupathi: రమ్య రఘుపతి పరిచయం అవసరం లేని పేరు నరేష్ మూడవ భార్యగా ఈమె అందరికీ సుపరిచితమే.ఎప్పుడైతే నరేష్ నటి పవిత్ర లోకేష్ ను పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వచ్చాయో ఆ క్షణమే ఈమె మీడియా ముందుకు వచ్చి పెద్ద ఎత్తున నరేష్ పవిత్రల వ్యవహార శైలి పై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసి వార్తల్లో నిలిచారు.

ఇక కొత్త సంవత్సరం రాబోతున్న నేపథ్యంలో నరేష్ పవిత్ర ఇద్దరు కూడా లిప్ లాక్ చేసుకున్నటువంటి ఒక వీడియోని షేర్ చేయడంతో రమ్మే రఘుపతి మరోసారి నరేష్ వ్యవహార శైలి గురించి మాట్లాడుతూ తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. ఈ క్రమంలోనే రమ్య రఘుపతి మాట్లాడుతూ తనునరేష్ కు విడాకులు ఇచ్చేవరకు ఆయన పవిత్రను పెళ్లి చేసుకోలేరు. అయితే తనకు విడాకులు ఇవ్వడం ఏమాత్రం ఇష్టం లేదని కామెంట్ చేశారు.

ఇక నరేష్ తనకు విడాకులు ఇవ్వమని తనకు పెద్ద మొత్తంలో డబ్బు ఆఫర్ చేశారని రమ్య తెలియజేశారు.నరేష్ మూడు కోట్ల నుంచి దాదాపు 20 కోట్ల వరకు డబ్బును ఆఫర్ చేసినట్లు ఈ సందర్భంగా రమ్య వెల్లడించారు. అయితే తనకు డబ్బు ముఖ్యం కాదని తనకు విడాకులు ఇవ్వనని రమ్య తెగేసి చెప్పారు. రమ్య విడాకులు ఇస్తేనే నరేష్ పవిత్ర పెళ్లి చేసుకోవచ్చని లేకపోతే వారి పెళ్లి జరగదనే విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే రమ్య విడాకులు ఇవ్వకుండా నరేష్ పవిత్రల పెళ్లి జరగకుండా చేస్తాను అంటూ శపదాలు కూడా చేసింది.


Ramya Raghupathi: 20 కోట్ల రూపాయల డబ్బు ఆఫర్ చేశారు…

ఇక నరేష్ రమ్య విడాకులు తీసుకోకపోయినా దూరంగా ఉండడంతో నరేష్ పవిత్రకు దగ్గరయి ఆమెతో సహజీవనం చేస్తున్నారు. ఇక వీరిద్దరి విడాకులు అధికారకంగా మంజూరు అయితే త్వరలోనే నరేష్ పవిత్ర పెళ్లి చేసుకోబోతున్నారని ఇదే విషయాన్ని వీడియో ద్వారా నరేష్ తెలియజేశారు. అయితే వీరి వివాదం రోజురోజుకు ముదరడంతో కొందరు ఈ వ్యవహారాన్ని సెటిల్ చేసుకోవాలని అనవసరంగా కుటుంబ పరువు పోతుంది అంటూ సలహాలు కూడా ఇస్తూ కామెంట్లు చేస్తున్నారు.

ప్రేమను నిరాకరించడంతోనే రమ్య హత్య_ పోలీసులు

రమ్య హత్య కేసు నిందుతుడు శశి క్రిష్ణ ను పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టారు. నిందితుడు మెకానిక్ గా పనిచేస్తున్నాడని తెలిపారు. బిటెక్ చదువుతున్న రమ్యను ప్రేమకోసం వేధించేవాడని తెలిపారు. రమ్య పై దాడి జరుగుతుంటే పక్కన ఉన్నవాళ్లు చూస్తూ ఉండి పోయారని అన్నారు.

కాగా రమ్యకు నిందుతుడు సోషల్ మీడియాలో పరిచయమయ్యా డని పోలీసులు తెలిపారు. ప్రేమను నిరాకరించడంతోనే అతను రమ్యను హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. మహిళలు సోషల్ మీడియా పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నారు. పిల్లల కదలికల పట్ల తల్లి దండ్రులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.

రమ్య హత్య నిందితులను కఠినంగా శిక్షించాలి_ నారా లోకేష్

గుంటూరు జిల్లా దళిత యువతి రమ్య హత్య పై నారా లోకేష్ స్పందించారు. రమ్య హత్య నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.ఈ ఘటనతో సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. దిశ చట్టం వల్ల రాష్ట్రంలో ఒక్క ఆడపిల్లకు అయిన న్యాయం జరిగిందా అని లోకేష్ ప్రశ్నించారు.

సొంత చెల్లికే రక్షణ కల్పించలేని సీఎం జగన్.. మహిళలకు ఏం రక్షణ కల్పిస్తారని లోకేష్ మండిపడ్డారు. సీఎం ఇంటి పక్కన సొంత నియోజకవర్గంలో అత్యాచారాలు జరిగితే.. ఇంతవరకు నిందితుల్ని పట్టుకోలేక పోవడం జగన్ చేతకాని తనానికి నిదర్శనమని ఆగ్రహాం వ్యక్తం చేశారు.