Tag Archives: ranbir

Kangana Ranaut: ఆ కపుల్స్ నా ఫోన్ డేటా మొత్తం లీక్ చేస్తున్నారు… సంచలన వ్యాఖ్యలు చేసిన కంగనా!

Kangana Ranaut:.కంగనా రౌనత్ పరిచయం అవసరం లేని పేరు నిత్యం ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యల ద్వారా వార్తల్లో నిలిచే ఈమె తాజాగా మరొక విషయం ద్వారా వార్తల్లో నిలిచారు.సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన విషయాలు మాత్రమే కాకుండా సినిమా ఇండస్ట్రీకి రాజకీయాలకు సంబంధించిన విషయాలు గురించి కూడా ముక్కుసూటిగా మాట్లాడుతూ ఎన్నో వివాదాలను సృష్టిస్తున్న కంగనా తాజాగా సోషల్ మీడియా వేదిక ఒక సుదీర్ఘమైన పోస్ట్ చేశారు.

ఈ క్రమంలోనే కంగనా ఒక బాలీవుడ్ సెలబ్రిటీల గురించి మాట్లాడుతూ బాలీవుడ్ కపుల్స్ నన్ను ఫాలో అవుతున్నారని నాకు తెలియకుండా నాపై నిగా ఉంచి నేనేం చేస్తున్నానో ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారని ఈమె ఆరోపణలు చేశారు.ఆ బాలీవుడ్ కపుల్స్ నన్ను ఎంతగా ఫాలో అవుతున్నారు అంటే చివరికి నేను కారు పార్కింగ్ చేసే సమయం నుంచి మెడ పై నేను ఏం చేస్తున్నాను అని ప్రతి ఒక్కటి తెలుసుకునేలా నన్ను ఫాలో అవుతున్నారని తెలిపారు.

ఆ బాలీవుడ్ హీరో నిర్మాతగా మారి తన భార్యను తన మాదిరిగా లేడీ ఓరియంటెడ్ సినిమాలలో నటించాలని ఒత్తిడి తీసుకువస్తున్నారని ఈమె తెలిపారు. అంతేకాకుండా నేను నా సోదరుడి పెళ్లిలో వేసుకున్న లెహంగా అచ్చం ఆమె పెళ్లిలో కూడా వేసుకుందని అంతగా వారు నన్ను ఫాలో అవుతున్నారని కంగనా ఆరోపణలు చేశారు.ఇలా నా వృత్తిపరమైన వ్యక్తిగత విషయాలను ఎప్పటికప్పుడు ఫాలో అవుతున్నారని అంతేకాకుండా నా ఫోన్ పర్సనల్ డేటా కూడా లీక్ చేస్తున్నారని అనుమానాలు తనకు కలుగుతున్నాయని ఆరోపించారు.

Kangana Ranaut: ఆ విషయం బయట పెడితే చిక్కుల్లో పడతారు…


ఇక నాకు సంబంధించిన డేటా అతను ఎలా పొందుతున్నాడో కనుక బయట పెడితే ఆయన చిక్కుల్లో పడతాడు అంటూ తనకు హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఈ విధంగా ఈమె బాలీవుడ్ నటుడి గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో ఆ సెలబ్రిటీ కపుల్స్ ఎవరు అని ఆరాతీస్తున్నారు అయితే గత కొంతకాలంగా ఈమె రణబీర్ కపూర్ అలియా భట్ ను టార్గెట్ చేయడంతో బహుశా వారి గురించి కంగనా ఇలాంటి పోస్ట్ చేసి ఉండవచ్చని భావిస్తున్నారు.

Alia Bhatt: రణబీర్ తో నా పెళ్లి ఎప్పుడో జరిగింది… అసలు విషయం బయట పెట్టిన అలియా!

Alia Bhatt: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందరు స్టార్లకు ఆమె హీరోయిన్ గా కావాలనేంతగా గుర్తింపు తెచ్చుకుంది అలియా. ఏసినిమా అయినా అలవోకగా ఒడిగిపోవడం అలియా ప్రత్యేకత. ప్రస్తుతం ‘గంగూబాయి కతియావాడి’ సినిమా విడుదలకు సిద్ధ అయింది. ప్రస్తుతం ఆసినిమా ప్రమోషన్లలో బిజీగా ఉంటుంది అలియా. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ కు విశేష స్పందన వచ్చింది. 

Alia Bhatt: రణబీర్ తో నా పెళ్లి ఎప్పుడో జరిగింది… అసలు విషయం బయట పెట్టిన అలియా!

కాగా అలియా భట్- రణ్‌బీర్‌ కపూర్‌ ఎప్పటి నుంచో పీకల లోతు ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. వారి వివాహం 2020లో జరగాల్సి ఉన్నా.. కరోనా కారణంగా వాయిదా పడిందని అప్పట్లో ఓ ఇంటర్వ్యూలో రణ్‌బీర్‌ కపూర్‌ వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే గతేడాది డిసెంబర్ లో పెళ్లి జరగాల్సి ఉన్నా.. సినిమాలతో ఇద్దరూ బిజీగా ఉండటంతో అది కూడా వాయిదా పడింది.

Alia Bhatt: రణబీర్ తో నా పెళ్లి ఎప్పుడో జరిగింది… అసలు విషయం బయట పెట్టిన అలియా!

వీరి పెళ్లి కోసం బాలీవుడ్ జనాలతో పాటు వీరి ఫ్యాన్స్ కూడా వేయిట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే గంగూబాయ్ కతియావాడి సినిమా ప్రమోషన్లలో పాల్గొంటున్న అలియా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.

నా మైండ్‌లో ఎప్పుడో మా పెళ్లి జరిగిపోయింది…

రణ్‌బీర్‌తో నా పెళ్లి ఇప్పటికే జరిగిపోయింది. చాలా కాలం క్రితమే నా మైండ్‌లో అతన్ని పెళ్లి చేసేసుకున్నాను అంటూ అందర్ని ఆశ్చర్యపరిచింది. ఏం జరిగినా దానికి కారణాలుంటాయి. మా పెళ్లి అప్పుడు వాయిదా పడింది. కానీ ఎప్పుడు జరిగినా .. ఎంతో అందంగా జరుగుతుంది అని భావిస్తున్నా… అంటూ చెప్పింది. ప్రస్తుతం ‘గంగుబాయ్ కతియావాడి’ కాకుండా.. ట్రిపుల్ ఆర్ సినిమా రిలీజ్ కు సిద్ధంగా ఉంది. మరోవైపు రణబీర్ సింగ్ కూడా ‘ బ్రహ్మస్త్ర’ సినిమా చేస్తున్నాడు.