Movie News

Kangana Ranaut: ఆ కపుల్స్ నా ఫోన్ డేటా మొత్తం లీక్ చేస్తున్నారు… సంచలన వ్యాఖ్యలు చేసిన కంగనా!

Kangana Ranaut:.కంగనా రౌనత్ పరిచయం అవసరం లేని పేరు నిత్యం ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యల ద్వారా వార్తల్లో నిలిచే ఈమె తాజాగా మరొక విషయం ద్వారా వార్తల్లో నిలిచారు.సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన విషయాలు మాత్రమే కాకుండా సినిమా ఇండస్ట్రీకి రాజకీయాలకు సంబంధించిన విషయాలు గురించి కూడా ముక్కుసూటిగా మాట్లాడుతూ ఎన్నో వివాదాలను సృష్టిస్తున్న కంగనా తాజాగా సోషల్ మీడియా వేదిక ఒక సుదీర్ఘమైన పోస్ట్ చేశారు.

ఈ క్రమంలోనే కంగనా ఒక బాలీవుడ్ సెలబ్రిటీల గురించి మాట్లాడుతూ బాలీవుడ్ కపుల్స్ నన్ను ఫాలో అవుతున్నారని నాకు తెలియకుండా నాపై నిగా ఉంచి నేనేం చేస్తున్నానో ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారని ఈమె ఆరోపణలు చేశారు.ఆ బాలీవుడ్ కపుల్స్ నన్ను ఎంతగా ఫాలో అవుతున్నారు అంటే చివరికి నేను కారు పార్కింగ్ చేసే సమయం నుంచి మెడ పై నేను ఏం చేస్తున్నాను అని ప్రతి ఒక్కటి తెలుసుకునేలా నన్ను ఫాలో అవుతున్నారని తెలిపారు.

ఆ బాలీవుడ్ హీరో నిర్మాతగా మారి తన భార్యను తన మాదిరిగా లేడీ ఓరియంటెడ్ సినిమాలలో నటించాలని ఒత్తిడి తీసుకువస్తున్నారని ఈమె తెలిపారు. అంతేకాకుండా నేను నా సోదరుడి పెళ్లిలో వేసుకున్న లెహంగా అచ్చం ఆమె పెళ్లిలో కూడా వేసుకుందని అంతగా వారు నన్ను ఫాలో అవుతున్నారని కంగనా ఆరోపణలు చేశారు.ఇలా నా వృత్తిపరమైన వ్యక్తిగత విషయాలను ఎప్పటికప్పుడు ఫాలో అవుతున్నారని అంతేకాకుండా నా ఫోన్ పర్సనల్ డేటా కూడా లీక్ చేస్తున్నారని అనుమానాలు తనకు కలుగుతున్నాయని ఆరోపించారు.

Kangana Ranaut: ఆ విషయం బయట పెడితే చిక్కుల్లో పడతారు…


ఇక నాకు సంబంధించిన డేటా అతను ఎలా పొందుతున్నాడో కనుక బయట పెడితే ఆయన చిక్కుల్లో పడతాడు అంటూ తనకు హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఈ విధంగా ఈమె బాలీవుడ్ నటుడి గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో ఆ సెలబ్రిటీ కపుల్స్ ఎవరు అని ఆరాతీస్తున్నారు అయితే గత కొంతకాలంగా ఈమె రణబీర్ కపూర్ అలియా భట్ ను టార్గెట్ చేయడంతో బహుశా వారి గురించి కంగనా ఇలాంటి పోస్ట్ చేసి ఉండవచ్చని భావిస్తున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago