Alia Bhatt: రణబీర్ తో నా పెళ్లి ఎప్పుడో జరిగింది… అసలు విషయం బయట పెట్టిన అలియా!
Alia Bhatt: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందరు స్టార్లకు ఆమె హీరోయిన్ గా కావాలనేంతగా గుర్తింపు తెచ్చుకుంది అలియా. ఏసినిమా అయినా అలవోకగా ఒడిగిపోవడం అలియా ప్రత్యేకత. ప్రస్తుతం ‘గంగూబాయి కతియావాడి’ సినిమా విడుదలకు సిద్ధ అయింది. ప్రస్తుతం ఆసినిమా ప్రమోషన్లలో బిజీగా ఉంటుంది అలియా. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ కు విశేష స్పందన వచ్చింది.
కాగా అలియా భట్- రణ్‌బీర్ కపూర్ ఎప్పటి నుంచో పీకల లోతు ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. వారి వివాహం 2020లో జరగాల్సి ఉన్నా.. కరోనా కారణంగా వాయిదా పడిందని అప్పట్లో ఓ ఇంటర్వ్యూలో రణ్‌బీర్ కపూర్ వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే గతేడాది డిసెంబర్ లో పెళ్లి జరగాల్సి ఉన్నా.. సినిమాలతో ఇద్దరూ బిజీగా ఉండటంతో అది కూడా వాయిదా పడింది.
వీరి పెళ్లి కోసం బాలీవుడ్ జనాలతో పాటు వీరి ఫ్యాన్స్ కూడా వేయిట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే గంగూబాయ్ కతియావాడి సినిమా ప్రమోషన్లలో పాల్గొంటున్న అలియా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.
రణ్‌బీర్‌తో నా పెళ్లి ఇప్పటికే జరిగిపోయింది. చాలా కాలం క్రితమే నా మైండ్‌లో అతన్ని పెళ్లి చేసేసుకున్నాను అంటూ అందర్ని ఆశ్చర్యపరిచింది. ఏం జరిగినా దానికి కారణాలుంటాయి. మా పెళ్లి అప్పుడు వాయిదా పడింది. కానీ ఎప్పుడు జరిగినా .. ఎంతో అందంగా జరుగుతుంది అని భావిస్తున్నా… అంటూ చెప్పింది. ప్రస్తుతం ‘గంగుబాయ్ కతియావాడి’ కాకుండా.. ట్రిపుల్ ఆర్ సినిమా రిలీజ్ కు సిద్ధంగా ఉంది. మరోవైపు రణబీర్ సింగ్ కూడా ‘ బ్రహ్మస్త్ర’ సినిమా చేస్తున్నాడు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…