Pooja Family Vacation: 13ఏళ్ల తర్వాత మమ్మీ కోసం అంత పనిచేసిన బన్నీ హీరోయిన్.. ఏమైందంటే..?
Pooja Family Vacation: వెకేషన్ ఎంజాయ్ చేయాలనుకుంటున్న ఫిలిం స్టార్లకు మాల్దీవులు మంచి డెస్టినేషన్ గా మారాయి. సమయం చిక్కినప్పుడల్లా చాలా మంది అక్కడికి చెక్కెస్తున్నారు. ఇటీవల బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దిశా పటానీ.. మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తూ.. బీచ్ లో బికినీ ఫోటోలను తన ఇన్స్టాగ్రామ్ లో పెట్టింది. ఈఫోటోలు చూసిన కుర్రాళ్ల మతులు పోయాయి. తాజాగా మరో హీరోయిన్ పూజా హెగ్డే కూడా మాల్దీవుల వెకేషన్ కు వెళ్లింది. గతేడాది నవంబర్ లో కూడా మాల్దీవులకు వెళ్లిన ఈ బన్నీ హీరోయిన్.. అప్పుడు తన బికినీ ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టింది. తన అందాలతో యూత్ ను కట్టిపడేసింది. అప్పట్లో ఈ ఫోటోలు తెగ వైరల్ అయ్యాయి.
ప్రస్తుతం మరోసారి ఈ అమ్మడు మాల్దీవులకు వెళ్లింది. అయితే ఈసారి మాత్రం ఒంటరిగా కాదు.. తన ఫ్యామిలీతో ట్రిప్ కి చెక్కేసింది. వరసగా షూటింగ్ లకు విరామం దొరకడంతో.. వెకేషన్ ఎంజాయ్ చేస్తోంది. తల్లిదండ్రులతో పాటు తన సోదరుడితో మాల్దీవుల్లో తెగ హల్చల్ చేస్తోంది ఈ బ్యూటి.
దాదాపు 13 ఏళ్ల తరువాత ఫ్యామిలీతో వెకేషన్ వెళ్లినట్లు చెప్పింది పూజా హెగ్డే. అంటే హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న తరువాత మొదటి సారి అని అర్థం అవుతోంది. మాల్దీవుల్లో బోట్ వద్ద..తన తల్లిదండ్రులు, సోదరుడితో దిగిన ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి ఇప్పుడు.
అయితే ఓ ఆశక్తికర విషయాన్ని వెల్లడించింది పూజా. తన తల్లి బర్త్ డేని సెలబ్రేట్ చేయడానికే వెకేషన్ కి వెళ్లిందట. ఇన్స్టాగ్రామ్ లో వారి ఫోటోలను షేర్ చేస్తూ.. ఆశక్తికర విషయాలను వెల్లడించింది. తమ అమ్మ పుట్టిన రోజు మాల్దీవుల్లో సెలబ్రేట్ చేయాలని ప్లాన్ చేసింది పూజా. సింపుల్‌గానే బర్త్ డే కేక్ కూడా కట్ చేయించారు. మరోవైపు తన సోదరుడు రిషబ్ హెగ్డేతోనూ ఫోటోని షేర్ చేస్తూ లెస్ గో అంటూ.. కామెంట్ పెట్టింది.
నాజీవితంలో అత్యంత డ్రామాటిక్ పర్సన్ అంటూ కామెంట్ పెట్టింది. ప్రస్తుతం పూజా చేతిలో చేతి నిండా సినిమాాలు ఉన్నాయి. ప్రస్తుతం ‘రాధేశ్యాం’, ‘ఆచార్య సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. త్రివిక్రమ్- మహేష్ కాంబినేషన్ లో వచ్చే మరో సినిమా కూడా త్వరలో స్టార్ట్ అవ్వబోతోంది. మరోవైపు కోలీవుడ్ స్టార్ విజయ్ తో చేసిన ‘బీస్ట్’ విడుదలకు సిద్దంగా ఉంది. దీంతో పాటు రణ్వీర్ సింగ్ తో ‘సర్కస్’ అనే సినిమాలో నటిస్తోంది పూజా హెగ్డే.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…