Chiranjeevi: హాలీవుడ్ చిత్రం హెవెన్ కెన్ వెయిట్.. చిత్రం ఆధారంగా తెరకెక్కిన చిరంజీవి యముడికి మొగుడు!
Chiranjeevi: రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి, రాధ, విజయశాంతి జంటగా నటించిన చిత్రం యముడికి మొగుడు.ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే.ఈ సినిమాలో కీలక పాత్రలో నటించిన నటుడు జి వి నారాయణ రావు ఒక ఇంటర్వ్యూలో పాల్గొని ఈ సినిమా గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.
ఈ సందర్భంగా జి.వి నారాయణ మాట్లాడుతూ ఈ సినిమా స్క్రిప్ట్ రచనలో భాగంగా తనకు భాగం ఉందని తెలియజేశారు. నిజానికి ఈ సినిమాని హాలీవుడ్ చిత్రం
‘హెవెన్ కెన్ వెయిట్’ఆధారంగా తెరకెక్కించామని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కథను సత్యానంద తాను కలిసి స్క్రిప్ట్ పనులు పూర్తిచేశామని ఆయన తెలియజేశారు.
నిజానికి ఈ హాలీవుడ్ చిత్రాన్ని సజెస్ట్ చేసింది నాగబాబు అని ఈ కథ నచ్చడంతో ఇలాంటి కథలను వ్రాయడంలో డి.వి.నరసరాజు బాగా అనుభవం ఉండటంతో ఆయన వద్దకు వెళ్ళాము. అయితే ఆయన ఇప్పటికే ఇలాంటివి ఆరు సినిమా కథలను రాసినట్లు తెలిపారు. అయితే ఈ చిత్రంలో వాటికి భిన్నంగా ఒక మనిషిలోకి మరొకరు రావడం అనే పాయింట్ ఆధారంగా తెరకెక్కించామని తెలిపారు.
ఈ ప్రపంచంలో మనుషులను పోలిన మనుషులు ఏడు మంది ఉంటారని అలా ఒకే పోలికలతో ఉన్న ఇద్దరిలో ఒకరు మరొకరి శరీరంలోకి ప్రవేశించే పాయింట్ ను తానే చెప్పినట్లు జీవి నారాయణ తెలియజేశారు.ఇలా ఈ సినిమా ఎంతో అద్భుతంగా వచ్చిందని ఈ సినిమా నిర్మాతలకు మంచి లాభాలను తీసుకువచ్చిందని జీవి నారాయణ తెలియజేశారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…