Thyagaraju: సినిమా ఇండస్ట్రీలో హీరోలకు ఎలాంటి గుర్తింపు ఉంటుందో విలన్ పాత్రలో నటించే వారికి కూడా అలాంటి గుర్తింపు ఉంటుంది.ఇలా విలన్ పాత్రలో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటుడు త్యాగరాజు గురించి ఇప్పటి వారికి తెలియకపోయినా ఎన్టీరామారావు నాగేశ్వరరావు సినిమాలలో ద్వారా ఎంతో అద్భుతంగా నటించారు.
1964 లో మంచి మనిషి చిత్రం ద్వారా విలన్ పాత్రలో నటించి అందరి అభిమానాన్ని సంపాదించుకున్న త్యాగరాజు ఆ తర్వాత వరుస సినిమాలలో నటించి ఎంతో మంచి గుర్తింపు పొందారు. ఇక కృష్ణ నటించిన అల్లూరి సీతారామరాజు సినిమాలో బ్రిటిష్ పోలీసాఫీసర్ బాస్టన్ దొరగా త్యాగరాజు నటన అద్భుతం అని చెప్పవచ్చు.
త్యాగరాజు తన 27 సంవత్సరాల సినీ కెరీర్లో ఏడాదికి 10 సినిమాల చొప్పున నటిస్తూ ఎంతో బిజీగా గడపడమే కాకుండా మంచి నటుడిగా గుర్తింపు పొందారు.ఈ విధంగా వరుస సినిమాల్లో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటుడు త్యాగరాజు యాభై సంవత్సరాల వయసులోనే అర్థంతరంగా కన్నుమూయడం సినిమా ఇండస్ట్రీకి తీరని లోటని చెప్పవచ్చు.
ఇలా సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్న త్యాగరాజు 1991 ఫిబ్రవరి 24వ తేదీ హైదరాబాద్లోని అశోక్ నగర్ లో తన సోదరుడి ఇంటిలో ఉండగా అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో ఈయన మృతి చెందారు. ఇలా ఇండస్ట్రీలో 50 సంవత్సరాలకి మృతిచెందిన నటుడు త్యాగరాజు మరణం సినిమా ఇండస్ట్రీకి తీరని లోటని చెప్పవచ్చు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…