Featured

Sr.NTR: సీనియర్ ఎన్టీఆర్ కారుకు పెద్దపులి ఎదురైతే… ఎన్టీఆర్ స్పందన ఎలా ఉందో తెలుసా?

Sr.NTR: తెలుగు సినిమా ఇండస్ట్రీలో విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు నందమూరి తారకరామారావు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈయన ఎన్నో సినిమాలలో అద్భుతంగా నటించి ఎంతో మంచి గుర్తింపు పొందిన నటుడిగా అందరికీ సుపరిచితమే. సీనియర్ ఎన్టీఆర్ సావిత్రి జంటగా నటించిన దేవత సినిమా అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమా షూటింగ్ జరిగే సమయంలో ఓ విచిత్ర సంఘటన చోటుచేసుకుందని ఆ సంఘటన గురించి తాజాగా బయటపడింది.

Sr.NTR: సీనియర్ ఎన్టీఆర్ కారుకు పెద్దపులి ఎదురైతే… ఎన్టీఆర్ స్పందన ఎలా ఉందో తెలుసా?

ఈ సినిమాలోని  “కన్నుల్లో మిసమిసలు”అనే పాటను చిత్రీకరించడం కోసం చిత్రబృందం సాతనూరుకి వెళ్లాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే తారక రామారావు పద్మనాభం ఒక కారులో రాత్రి 9 గంటలకు మద్రాసు నుంచి బయలుదేరారు. తిరువణ్ణామలై మీదుగా సాతనూరు బయల్దేరారు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ తనకు నిద్ర వస్తుందని తిరువణ్ణామలై రాగానే తన నిద్ర లేపమని చెప్పి వెనుక సీట్ లో పడుకున్నారు.

Sr.NTR: సీనియర్ ఎన్టీఆర్ కారుకు పెద్దపులి ఎదురైతే… ఎన్టీఆర్ స్పందన ఎలా ఉందో తెలుసా?

ఈ విధంగా తిరువణ్ణామలై రాగానే పద్మనాభం ఎన్టీఆర్ ను నిద్ర లేపితే ఎన్టీఆర్ కారు దిగి కాసేపలా తిరిగిన తర్వాత వెళ్దాం పదండి బ్రదర్ అంటూ సాతనూరుకి తిరిగి వెళ్లారని తెలిపారు.ఇలా కారులో వెళ్తున్న సమయంలో పద్మనాభం మాట్లాడుతూ అన్నగారు మీరు నిద్రపోతున్న సమయంలో ఒక సంఘటన చోటుచేసుకుంది ఆవిషయం నీకు చెప్పాలి అంటూ తెలియజేశారు.

వెనక సింహం పడుకొని ఉంది..

ఈ మాట విన్న ఎన్టీఆర్ ఏం జరిగింది బ్రదర్ అని అడగగా మీరు నిద్రపోతున్న సమయంలో చెంగల్పట్టు వద్దకు వెళ్లగానే ఒక పెద్ద పులి కారుకు ఎదురుగా వచ్చిందని తెలిపారు. ఈ మాట విన్న ఎన్టీఆర్ అరెరే… నన్ను నిద్ర లేపాల్సింది బ్రదర్ పులి ఎదురు రావడం శుభశకునం అని అన్నారు.మీరు నిద్ర లేపవద్దు అని చెప్పడంతో లేప లేదని ఆ పులి ఎదురుగా వస్తుంటే డ్రైవర్ గజగజ వణికి పోయారని నేను కూడా పైకి గంభీరంగా కనిపిస్తుంది లోపల వణుకు పుట్టిందని పద్మనాభం తెలిపారు. ఆయన ఎదురుగా పులి వస్తే మాకేం భయం లేదు మా వెనక సింహం నిద్రపోతుంది అనే ధైర్యం ఉంది అంటూ పద్మ నాభం చెప్పడంతో వెంటనే ఎన్టీఆర్ వెరీ గుడ్ బ్రదర్ అంటూ భుజం మీద చేయి వేసి తట్టారని ఓ ఇంటర్వ్యూ సందర్భంగా తెలియజేశారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago