Balakrishna: తనపై వచ్చే మీమ్స్ గురించి స్సందించిన బాలయ్య..! ఎవరైనా నన్ను అలా పిలవాల్సిందే… బాలయ్య కామెంట్స్ వైరల్!
Balakrishna: అఖండ భారీ విజయంతో సిల్వర్ స్క్రీన్ పై సత్తా చూపించాడు నందమూరి బాలకృష్ణ. ఇప్పుడు ఓటీటీలో సందడి చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు ఎన్నో భారీ రికార్టులు నమోదయ్యాయి. థియేటర్లకు జనాలు వస్తారా.. రారా.. అని సందిగ్థంలో ఉన్న క్రమంలో బాలయ్య మ్యాజిక్ చేశాడు. ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కట్టారు.
భారీ విజయాన్ని అఖండకు అందించారు. ఈ సినిమా విజయవంతంగా రన్ అవుతున్న సమయంలోనే బాలయ్య టాక్ షో ‘‘అన్ స్టాపబుల్ విత్ ఎన్ బీకే’’లో హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు. ఆహా ఓటీటీలో ప్రసారం అవుతున్న ఈ షో సీజన్ వన్ ముగింపు దశకు చేరుకుంది. సీజన్ వన్ లో వచ్చిన ప్రతీ ఎపిసోడ్ భారీగా వ్యూస్ సంపాదించాయి.
మంచు ఫ్యామిలీ గెస్ట్ గా వచ్చిన మొదటి షో నుంచి చివరకు ఎపిసోడ్ 11లో వచ్చిన మహేష్ బాబు వరకు బాలయ్య ఎనర్జీలో ఎక్కడా తగ్గేదేలే అన్నట్లు కనిపించాడు. మహేష్ బాబు గెస్ట్ ఎపిసోడ్ తో ఈ సీజన్ వన్ ముగిసింది. అత్యంత త్వరలోనే సీజన్ 2 కూడా మొదలు అవుతుందని చెప్పుకొచ్చాడు నిర్వాహకులు. దాదాపు జూలై నుంచి సెకండ్ సీజన్ మొదలయ్యే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.
ఇదిలా ఉండగా.. బాలయ్యతో యాజమాన్య ఓ రాపిడ్ ఫైర్ ఇంటర్వ్యూ లాంటిది నిర్వహించారు. అందులో బాలయ్యను కొన్ని ప్రశ్నలను అడిగారు. దానికి సంబంధించి వీడియో వైరల్ గా మారింది. ‘నెవర్ హావ్ ఐ ఎవర్’ అనే ట్యాగ్ తో ప్రశ్నలను అడిగారు. దీనిలో మొదటి ప్రశ్నగా ఎప్పుడైనా కాలేజీ బంక్ కొట్టారా అని అడగ్గా.. నెవర్ అని బోర్టు తగిలించి.. బంక్ కొట్టకుండా ఎవరైనా ఉంటారా అని సమాధానం ఇచ్చాడు. మరో ప్రశ్నకు మీ పైన వచ్చే మీమ్సీ గరించి ఏమంటారు అంటని అడగ్గా.. దానికి బాలయ్య కొంచెం నవ్వుకొని.. ఐ హావ్ అనే బోర్టును చూపించాడు. వాటిని చూసి నవ్వుకుంటానని.. పాపం చాలా కష్టపడుతుంటారని సమాధానం ఇచ్చాడు. లెజెండ్ సినిమాలో ఓ డైలాగ్ కు సంబంధించి మీమ్స్ చూసి నవ్వుకున్నానన్నాడు. మనవళ్లతో తాత అనిపిలిపించుకోవడం మీకు ఇష్టమా అని అడగ్గా.. నో నెవర్ అని చెబుతూ.. నన్ను ఎవరైనా బాల అని పిలవాల్సిందే అని చెప్పాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.
దేశవ్యాప్తంగా వేసవి ఉష్ణోగ్రతలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ఉదయం నుంచే ఎండ తీవ్రత కనిపిస్తున్న నేపథ్యంలో చాలా మంది తమ…
తెలంగాణలో నిరుద్యోగ యువతకు ఊరటనిచ్చే నిర్ణయం వెలువడింది. తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బ్యాంకింగ్ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు…
టాలీవుడ్‌లో తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు పొందిన రిచా గంగోపాధ్యాయ్ సినీ ప్రయాణం ఇప్పటికీ ఆసక్తికర చర్చగా నిలుస్తోంది.…
టాలీవుడ్‌లో క్లాసిక్‌గా నిలిచిన ‘శివ’ సినిమా గురించి మరో ఆసక్తికర విషయాన్ని నటుడు జేడీ చక్రవర్తి వెల్లడించారు. ప్రస్తుతం తన…
తెలంగాణలోని గద్వాల జిల్లాలో చోటుచేసుకున్న ఓ ఘటన అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర విమర్శలకు దారి తీసింది. బాల్య వివాహాన్ని అడ్డుకోవడానికి…
కన్నడ స్టార్ హీరో యశ్ నటిస్తున్న ‘టాక్సిక్’ సినిమా విడుదలకు ముందు నుంచే సినీ వర్గాల్లో భారీ చర్చకు దారి…