Tag Archives: Rare disease

Bhanu Priya: అరుదైన వ్యాధితో బాధపడుతున్న నటి భానుప్రియ… అసలు విషయం చెబుతూ ఎమోషనల్ అయిన నటి!

Bhanu Priya: వెండితెరపై నటిగా ఒకానొక సమయంలో ఓ వెలుగు వెలిగిన కలువ సుందరి భానుప్రియ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు అద్భుతమైన నటనతో డాన్సులతో ఎంతోమందిని ఆకట్టుకున్నటువంటి నటి భానుప్రియ ఇండస్ట్రీలో ఉన్నటువంటి అగ్ర హీరోలు అందరి సరసన ఎంతో అద్భుతమైన సినిమాలలో నటించారు. తెలుగులో మాత్రమే కాకుండా ఈమె తమిళం కన్నడ భాషలలో కూడా స్టార్ హీరోలు అందరి సరసన నటించారు.

ఇలా హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన భానుప్రియ అనంతరం తన సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా పలువురు యంగ్ హీరో హీరోయిన్లకు తల్లిగా కూడా నటించారు. అయితే గత కొంతకాలంగా భానుప్రియ ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి నటి భానుప్రియ తన గురించి మాట్లాడుతూ తను ఒక డిజాస్టర్ తో బాధపడుతున్నానని తెలిపారు.

2018లో తన భర్త ఆదర్శ కౌశల్ మరణించిన తర్వాత తన జ్ఞాపకశక్తి క్రమక్రమంగా తగ్గుతూ వచ్చిందని ఈమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా తాను మెమొరీ లాస్ డిసీస్ తో బాధపడుతూ అన్ని మర్చిపోతున్నానని తెలియజేశారు. ఈ క్రమంలోనే డాన్సులో హస్తముద్రికలు మర్చిపోయానని అదేవిధంగా ఒక తమిళ సినిమా షూటింగ్ జరుగుతుండగా చెప్పాల్సిన డైలాగులు అన్నిటిని కూడా మర్చిపోయానని తెలిపారు.

Bhanu Priya: మెమొరీ లాస్ కారణంగా ఇండస్ట్రీకి దూరమయ్యా…

ఈ విధంగా తనకు ఏ విషయాలు గుర్తు లేవని ఈమె తెలియజేశారు. ప్రస్తుతం తాను ఈ వ్యాధికి మందులు వాడుతున్నానని అందుకే తాను ఇండస్ట్రీకి దూరంగా ఉన్నానని తెలిపారు.ఇలాంటి వ్యాధితో బాధపడుతున్న తాను ఒక డాన్స్ స్కూల్ పెట్టాలని నిర్ణయాన్ని కూడా విరమించుకున్నానని తెలిపారు.ఇక ప్రస్తుతం తన కుమార్తె లండన్ లో ఉందని తనకు నటనపై ఏమాత్రం ఆసక్తి లేదంటూ ఈ సందర్భంగా భానుప్రియ వెల్లడించారు.

పుట్టిన మూడు నెలలకే రెండు ప్రాణాంతక వ్యాధులు.. ఎలా జరిగిందంటే..!

ప్రతీ మనిషికి వ్యాధులు సోకడం అనేది సహజం. ప్రస్తుతం జీవన విధానంలో.. తినే ఆహార అలవాట్లలో మార్పుల కారణంగా వ్యాధుల బారిన పడుతుంటారు. కానీ వాటిని మనం వైద్యులను సంప్రదించి వెంటనే నయం చేస్తుంటాం. కానీ అదే ప్రాణాంతక వ్యాధి బారిన పడితే మాత్రం చెప్పలేని పరిస్థితి ఉంటుంది. ఏ వ్యాధి అయినా 90 శాతం మానవుడి నిర్లక్ష్యం కారణంగానే వస్తుంటాయని వైద్యులు చెబుతుంటారు.

కానీ ఒక పసిబిడ్డ పుట్టి పుట్టగానే రెండు వ్యాధుల బారిన పడ్డాడు. పుట్టిన నెల రోజుల సమయంలోనే, అతడికి ఒక ప్రాణాంతక జన్యువ్యాధి వచ్చింది. దానిని నయం చేసేందుకు డాక్టర్లు ఒక మెడిసిన్ ఇచ్చారు. కానీ దాని దుష్ప్రభావాల వల్ల ఆ బిడ్డకు మరో అరుదైన వింత వ్యాధి సంక్రమించింది. దీంతో ఆ బాలుడి శరీరం అంతా పొడవాటి వెంట్రుకలు పుట్టుకొచ్చాయి. ఈ ఘటన అమెరికాలోని టెక్సాస్‌లో జరిగింది. ఆ బాలుడి పుట్టిన మూడు నెలలకే ఇలాంటి వ్యాధులతో పోరాడాల్సిన పరిస్థితి రావడంతో తల్లిదండ్రులు ఆవేదన వర్ణణాతీతంగా ఉంది.

ఆ బాలుడి పరిస్థితి గురించి తెలుసుకున్న ప్రతి ఒక్కరి గుండె తరుక్కుపోతోంది. అసలేం జరిగిందంటే.. ఆ బాలుడికి ఒక నెల వయసులో హైపర్‌ఇన్‌సులినిజం అనే అరుదైన జన్యువ్యాధి బారిన పడ్డాడు. ఈ వ్యాధి ప్యాంక్రియాస్.. అధిక మోతాదులో ఇన్సులిన్ ఉత్పత్తి చేస్తుంది. దీంతో బ్లడ్ షుగర్ లెవల్స్ పడిపోతాయి. ప్రతి 50 వేల మందిలో ఒకరు ఈ వ్యాధి బారిన పడుతుంటారు. వైద్యులను సంప్రదించి చికిత్స అందించారు.

ఆ వ్యాధి తగ్గుముఖం పడుతున్న క్రమంలో ఆ బాలుడికి మరో వ్యాధి సోకింది. హైపర్‌-ఇన్‌సులినిజం వ్యాధి చికిత్స కోసం డయాజోక్సైడ్ మందును చిన్నారికి ఇచ్చారు. కానీ ఆ మెడిసిన్ సైడ్ ఎఫెక్ట్స్ తో చిన్నారి శరీరమంతటా నల్లని వెంట్రుకలు పొడవుగా పెరిగాయి. ఇలా ప్రాణాంతక వ్యాధి తగ్గేలోపే ఇలా మరో వ్యాధి సోకడంతో తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు.

కరోనా సోకిన పిల్లల్లో అరుదైన వ్యాధి.. శాస్త్రవేత్తల్లో టెన్షన్..?

ప్రపంచ దేశాల్లో వేగంగా విజృంభిస్తున్న కరోనా మహమ్మారి గురించి మరో షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే ఈ మహమ్మారికి సంబంధించి ఎన్నో లక్షణాలు వెలుగులోకి రాగా తాజాగా ఈ వైరస్ బారిన పడి కోలుకున్న చిన్నారికి అరుదైన వ్యాధి సోకినట్టు వైద్యులు గుర్తించారు. ఎయిమ్స్ వైద్యులు కరోనా వల్ల ఒక చిన్నారి మెదడులోని నాడులు దెబ్బ తిన్నాయని.. ఫలితంగా ఆమె చూపు మందగించిందని తేల్చారు.

చైల్డ్ న్యూరాలజీ విభాగం శాస్త్రవేత్తలు ఈ కేసును పూర్తిస్థాయిలో స్టడీ చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా సోకిన చిన్నారుల్లో ఇలాంటి కేసు నమోదు కావడం ఇదే తొలిసారని అయితే భవిష్యత్తులో మరి కొంతమంది పిల్లల్లో సైతం ఈ సమస్య కనిపించే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. మెదడులో నాడులు దెబ్బ తినే ఈ సమస్యను ఎక్యూట్ డీమైలినేటింగ్ సిండ్రోమ్ అంటారని.. 11 సంవత్సరాల బాలికలో ఈ వ్యాధి లక్షణాలు కనిపించాయని తెలిపారు.

సాధారణంగా పెద్దలు మాత్రమే ఈ వ్యాధి బారిన పడతారని వైద్యులు వెల్లడించారు. మనిషి మెదడులో కణాలను రక్షించే మైలిన్ పొర ఉంటుందని.. శరీరంలో సమాచార మార్పిడికి ఈ పొర దోహదపడుతుందని.. ఈ వ్యాధి వల్ల బాలిక కంటిచూపు మందగించిందని తెలిపారు. డాక్టర్ గులాటీ పాపకు చికిత్స అందించి కంటిచూపు మెరుగుపడేలా చేశారు. అయితే 50 శాతం మాత్రమే కంటిచూపు మెరుగుపడిందని వైద్యులు తెలిపారు.

ఎక్యూట్ డీమైలినేటింగ్ సిండ్రోమ్ (ఏడీఎస్) అరుదైన వ్యాధి అని చెవులు, ముక్కు, నోరు, మూత్రాశయం, కండరాల కదలికలపై కూడా ఈ వ్యాధి ప్రభావం తీవ్రంగా ఉంటుందని వైద్యులు వెల్లడించారు. కరోనా మహమ్మారి గురించి వెలుగులోకి వస్తున్న వార్తలు ప్రజల్లో భయాన్ని మరింత పెంచేలా ఉండటం గమనార్హం. రోజురోజుకు వెలుగులోకి వస్తున్న కొత్త లక్షణాలు శాస్త్రవేత్తలను టెన్షన్ పెడుతున్నాయి.