Tag Archives: rrr

Rajamouli: రాజమౌళికి గ్రాండ్ గా వెల్కమ్ చెప్పిన జపాన్ వాసులు.. నెట్టింట పోస్ట్ వైరల్!

Rajamouli: టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ లు కలిసి నటించిన చిత్రం ఆర్ఆర్ఆర్. పాన్ ఇండియా లెవెల్లో భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించిన విషయం తెలిసిందే. వేల కోట్ల కలెక్షన్స్ ను సాధించింది. అంతేకాకుండా కలెక్షన్ ల మోత మోగించింది. దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో భాషల్లో విడుదల అయ్యి కోట్లలో కలెక్షన్స్ ను సాధించింది. కాగా సినిమా విడుదల అయ్యి రెండేళ్లు కావస్తోంది.

2022లో రిలీజయిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో మంచి హిట్ కొట్టి అనేక ఇంటర్నేషనల్ అవార్డులు అందుకొని ఏకంగా ఆస్కార్ వరకు వెళ్లి బెస్ట్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డు సాధించి ఇండియన్ సినీ పరిశ్రమలో సరికొత్త చరిత్ర సృష్టించింది. ఇక ఆర్ఆర్ఆర్ సినిమాని అనేక దేశాల్లో రిలీజ్ చేసారు. అందులో జపాన్ కూడా ఒకటి. మన ఇండియన్ సినిమాలకు అమెరికా తర్వాత జపాన్ అతిపెద్ద ఇంటర్నేషనల్ మార్కెట్. ముఖ్యంగా తెలుగు సినిమాలకు. దీంతో రాజమౌళి, రామ్ చరణ్, ఎన్టీఆర్ ఫ్యామిలీలతో కలిసి మరీ వెళ్లి ఆర్ఆర్ఆర్ సినిమాని జపాన్ లో ప్రమోట్ చేసారు. ఇప్పటివరకు ఏ సినిమా సాధించని రికార్డు కలెక్షన్స్ జపాన్ లో ఆర్ఆర్ఆర్ సాధించింది.

అంతే కాకుండా జపాన్ ప్రజల అభిమానాన్ని గెలుచుకున్నారు. జపాన్ ఫ్యాన్స్ ఆర్ఆర్ఆర్ సినిమా రిలీజయి రెండేళ్లు అవుతున్నా ఇంకా తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. చరణ్, ఎన్టీఆర్, రాజమౌళి పై అభిమానం చూపిస్తున్నారు. తాజాగా జపాన్ లో ఆర్ఆర్ఆర్ సినిమాని రీ రిలీజ్ చేశారు. దీంతో రాజమౌళి మరోసారి జపాన్ కి వెళ్లారు. ఇక రాజమౌళి జపాన్ కి వెళ్లడంతో అక్కడి అభిమానులు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ అయ్యాయి. రాజమౌళిని చూసి అభిమానులు సంతోషిస్తున్నారు.
రాజమౌళి కోసం స్పెషల్ గిఫ్ట్

అయితే ఒక బామ్మ రాజమౌళి కోసం స్పెషల్ గిఫ్ట్ చేసుకొచ్చింది. దీంతో రాజమౌళి ఆ గిఫ్ట్ తీసుకొని ఆ బామ్మతో ఫోటోలు దిగి వాటిని సోషల్ మీడియాలో షేర్ చేసి.. జపాన్ లో ఆర్గామి క్రేన్స్ అనే గిఫ్ట్ తమకి ఇష్టమైన వాళ్ళ కోసం, వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలని, బాగుండాలని తయారు చేస్తారు. ఒక 83 ఏళ్ళ మహిళ అలాంటివి 1000 తయారుచేసి తీసుకొచ్చి నన్ను ఆశీర్వదించింది. ఆర్ఆర్ఆర్ ఆమెకు సంతోషం ఇచ్చింది. నాకు గిఫ్ట్ పంపి బయట చలిలో ఎదురుచూస్తుంది. ఇలాంటి వాటికి ఋణం తీర్చుకోలేను అంటూ ఎమోషనల్ పోస్ట్ చేసారు. దీంతో రాజమౌళి ట్వీట్ వైరల్ గా మారింది.

JD Chakravarthy: దర్శకులకు కథపై నమ్మకం లేకపోతేనే అలాంటి సీన్స్ పెడతారు: జె.డి చక్రవర్తి

JD Chakravarthy: జెడి చక్రవర్తి పరిచయం అవసరం లేని పేరు ఒకప్పుడు హీరోగా ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నటువంటి ఈయన కొంత కాలం పాటు సినిమా ఇండస్ట్రీకి దూరమయ్యారు. అయితే ప్రస్తుతం వరుస సినిమాలలోను వెబ్ సిరీస్ లలో నటిస్తూ తన సెకండ్ ఇన్నింగ్స్ ఎంతో బిజీగా ఉన్నారు.

తాజాగా జెడి చక్రవర్తి దయ అనే వెబ్ సిరీస్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈయనకు ప్రస్తుతం ఉన్నటువంటి సినిమాలలో బూతు పదాల గురించి అడల్ట్ కంటెంట్ గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి.

ఈ ప్రశ్నకు జెడి చక్రవర్తి సమాధానం చెబుతూ బూతు పదాలు పెడితేను పొట్టి దుస్తులు వేసుకుంటేనే సినిమా హిట్ అవుతుందంటే తాను ఒప్పుకోనని తెలిపారు. ఆర్ఆర్ఆర్, పుష్ప, బాహుబలి ఈ సినిమాలలో ఎక్కడా కూడా పొట్టి దుస్తులు వేసుకుని ఎవరూ కనిపించలేదు. కానీ ఈ సినిమాలు పాన్ ఇండియా రేంజ్ లో మంచి సక్సెస్ అందుకున్నాయి. ఇక ఎప్పుడైతే దర్శకులకు వారి కథ పై నమ్మకం ఉండదో అలాంటి సమయంలోనే బూతు పదాలు అడల్ట్ కంటెంట్ పెడతారని ఈయన తెలిపారు.

JD Chakravarthy: దర్శకులు అనుకుంటే సెన్సార్ అవసరం లేదు…

ఇక వెబ్ సిరీస్ ల గురించి మాట్లాడితే అది వేరు ఇక్కడ రియాలిటీని చూపించాలని ప్రయత్నం చేస్తారు. అయితే కొన్నిసార్లు అనవసరంగా కూడా ఇలాంటి అడల్ట్ కంటెంట్ పెడితే అది తప్పేనని ఈయన తెలియజేశారు.ఇక దర్శకులు అనుకుంటే సినిమాలకు ఎలాంటి సెన్సార్ అవసరం లేదని కేవలం వారి బుర్రలకు సెన్సార్ పెడితే చాలు సినిమాలకు సెన్సార్ అవసరం ఉండదు అంటూ ఈ సందర్భంగా జెడి చక్రవర్తి చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Aliya Bhatt: ఆ విషయంలో రాజమౌళి గారి సలహా తీసుకున్నా… అలియా భట్ కామెంట్స్ వైరల్!

Aliya Bhatt: బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందిన ఆలియా భట్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బాలీవుడ్లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించిన ఆలియా భట్ ఆర్ఆర్ఆర్ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది. ఆర్ఆర్ఆర్ సినిమాలో సీత పాత్రలో నటించిన ఆలియా భట్ తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషలలో విడుదల కావడంతో ఆలియా భట్ కి కూడా మంచి గుర్తింపు లభించింది.

ఇక ఇటీవల ఈ సినిమాలోని నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు కూడా లభించింది. ఇదిలా ఉండగా తాజాగా రాజమౌళి ఒక అరుదైన ఘనత సాధించాడు. దీంతో రాజమౌళి మీద ఆలియా ప్రశంసల వర్షం కురిపించింది. ఇటీవల టైం మ్యాగజైన్ విడుదల చేసిన 100 మంది ప్రపంచవ్యాప్త ప్రభావశీలుర జాబితాలో జక్కన్న చోటు దక్కించుకున్నాడు. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో పాపులర్ అయిన జక్కన్న
ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయ్యాడు.

ఇక తాజాగా టైం మ్యాగజైన్ విడుదల చేసిన జాబితాలో చోటు దక్కించుకోవడంతో పలువురు సినీ ప్రముఖులు అభిమానులు రాజమౌళికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో ఆలియా భట్ కూడా రాజమౌళికి శుభాకాంక్షలు తెలియజేస్తూ రాజమౌళి గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.ఆలియా మాట్లాడుతూ మొదటిసారి రాజమౌళిని బాహుబలి ప్రీమియర్ షో లో కలిసాను. ఆ సినిమా చూడగానే రాజమౌళి దర్శకత్వంలో ఒక్కసారైనా నటించాలని అనుకున్నాను.


Aliya Bhatt: ప్రేమతో చేయాలి…


ఆర్ఆర్ఆర్ సినిమా వల్ల ఆ కోరిక తీరింది. రాజమౌళితో సినిమా అంటే ఒక స్కూల్ కి వెళ్తున్నట్లు ఉంటుంది. నటన పరంగా నాకు ఏదైనా సలహా ఇవ్వమని కోరితే.. ఏ క్యారక్టర్ చేసినా కూడా ప్రేమతో చేయాలి. సినిమా ప్లాప్ అయినా కూడా మన పాత్ర ప్రేక్షకుల మదిలో నిలిచిపోయేలా నటించాలి చెప్పారు అంటూ రాజమౌళి గొప్పతనాన్ని పొగుడుతూ ప్రశంసలు కురిపించింది.

Jr.NTR: ఆర్ఆర్ఆర్ సక్సెస్ తో భారీ రెమ్యూనరేషన్ పెంచిన తారక్.. తారక్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

Jr.NTR: నందమూరి వారసుడిగా, బాల నటుడుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఎన్టీఆర్ అనంతరం నిన్ను చూడాలని సినిమాతో ఏకంగా హీరోగా ఎంట్రీ ఇచ్చారు. అయితే ఈయన అతి చిన్న వయసులోనే హీరోగా రావడమే కాకుండా ఎన్నో అద్భుతమైన బ్లాక్ బాస్టర్ సినిమాలను అందుకొని ఇండస్ట్రీలో మంచి సక్సెస్ అయ్యారు. ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ హీరోగా కొనసాగుతున్న తారక్ ఆర్ఆర్ఆర్ సినిమాతో మరింత క్రేజ్ సొంతం చేసుకున్నారు.

ఈ సినిమాతో ఈయన ఏకంగా అంతర్జాతీయ స్థాయిలో ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్నారు. ఇక ఈ సినిమా మంచి సక్సెస్ అందుకోవడమే కాకుండా ఆస్కార్ అవార్డును కూడా గెలుచుకోవడంతో తారక్ క్రేజ్ కూడా అమాంతం పెరిగిపోయింది. ఈ సినిమా కోసం 45 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్న ఎన్టీఆర్ తదుపరి సినిమాలకు ఏకంగా 80 కోట్ల రెమ్యూనరేషన్ అందుకుంటున్నారు.

ఇలా సినిమాల ద్వారా భారీగా సంపాదించిన ఈయన ఆస్తులను కూడా భారీగా కూడపెట్టినట్లు తెలుస్తోంది. ఈయన మొత్తం ఆస్తులు విలువ 571 కోట్ల రూపాయల విలువ చేస్తుందని తెలుస్తోంది. ఇదే కాకుండా జూబ్లీహిల్స్ లో 25 కోట్ల విలువచేసే ఖరీదైన భవంతిలో ఎన్టీఆర్ నివసిస్తున్నారు. అలాగే ఈయన గ్యారేజ్ లో కోట్ల విలువ చేసే ఖరీదైన కార్లు ఉన్నాయి అలాగే ఒక ప్రైవేట్ జట్ కూడా ఉంది.


Jr.NTR: ఆరున్న ఎకరాల ఫామ్ హౌస్..

ఇవే కాకుండా హైదరాబాద్ సమీపంలో బృందావనం అనే పేరుతో ఆరున్నర ఎకరాల ఫామ్ హౌస్ కూడా ఉన్న విషయం మనకు తెలిసిందే. దీనిని తన భార్య ప్రణతి పుట్టినరోజు సందర్భంగా తనకు గిఫ్ట్ గా ఎన్టీఆర్ అందించారు.ఇలా నందమూరి వారసుడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన ఎన్టీఆర్ సినిమాల ద్వారానే భారీగా సంపాదించారని తెలుస్తుంది. ఇక ఈయన నెలకు దాదాపు మూడు కోట్ల వరకు ఆదాయం పొందుతున్నట్టు తెలుస్తుంది.

Ram Charan: నా బిడ్డ వల్లే ఈ అదృష్టం… పుట్టబోయే బిడ్డ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన చరణ్!

Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గత ఏడాది నటించిన త్రిబుల్ ఆర్ సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారిపోయారు.ఈ సినిమా తర్వాత ఈయన తదుపరి చిత్రాలన్నీ కూడా పాన్ ఇండియా స్థాయిలోనే ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ప్రస్తుతం రామ్ చరణ్ తదుపరి సినిమా షూటింగ్ పనులను జరుపుకుంటుంది.ఇకపోతే ఈయన ఎన్టీఆర్ కలిసి నటించిన త్రిబుల్ ఆర్ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుందో మనకు తెలిసిందే.

ఈ సినిమాలోని నాటు నాటు పాట ఆస్కార్ నామినేషన్స్ లో నిలవడమే కాకుండా ఏకంగా ఆస్కార్ అవార్డు అందుకోవడంతో భారతదేశం మొత్తం ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ సంబరాలు చేసుకుంటున్నారు. ఇక ఆస్కార్ వేడుకలలో భాగంగా గత 15 రోజులుగా అమెరికాలోనే రాంచరణ్ పర్యటిస్తూ పెద్ద ఎత్తున సందడి చేస్తున్నారు. ఇక రాంచరణ్ అమెరికా వెళ్లడంతో తన భార్య ఉపాసన కూడా అమెరికాకు వెళ్లారు..

ఇలా రామ్ చరణ్ తో పాటు ఉపాసన కూడా ఆస్కార్ వేడుకలలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమం అనంతరం ఈ సినిమాలోని పాటకు ఆస్కార్ అవార్డు రావడంతో రామ్ చరణ్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే అక్కడ మీడియాతో మాట్లాడుతూ తన సంతోషాన్ని తెలియజేయడమే కాకుండా తనకు పుట్టబోయే బిడ్డ గురించి కూడా ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు.

Ram Charan: ఉపాసన ఆరు నెలల ప్రెగ్నెంట్…

ప్రస్తుతం తాను ఇంత మంచి విజయాన్ని అందుకుంటున్నాను అంటే ఇదంతా తనకు పుట్టబోయే బిడ్డ అదృష్టమే కారణమని తెలియజేశారు. ప్రస్తుతం తన భార్య ఉపాసన ఆరు నెలల ప్రెగ్నెంట్ అని, తనకు పుట్టబోయే బిడ్డే ఈ అదృష్టాన్ని తీసుకువచ్చారు అంటూ ఈ సందర్భంగా తన బిడ్డ గురించి రాంచరణ్ చెబుతూ తన కష్టాన్ని తన బిడ్డ ఖాతాలో వేస్తూ సంతోషం వ్యక్తం చేశారు. ఇలా తన బిడ్డ గురించి రామ్ చరణ్ చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

S.S Karthikeya: ఆస్కార్ రావడానికి ప్రధాన కారణం కార్తికేయ అని మీకు తెలుసా… అసలేవరీ కార్తికేయ?

S.S Karthikeya: RRR సినిమాలోని నాటు నాటు పాట ఆస్కార్ అవార్డును గెలుచుకున్న విషయం మనకు తెలిసిందే అయితే ఈ పాట అవార్డు గెలుచుకుంది అంటే అందుకు కారణం ఎన్టీఆర్ రామ్ చరణ్ రాజమౌళి కీరవాణి ఈ నలుగురు మాత్రమే అందరికీ తెలిసిందే అయితే కాస్త సినీ పరిజ్ఞానం ఉన్న వాళ్ళయితే ఈ సినిమాకి కారణమైనటువంటి సింగర్స్ పాటల రచయిత గురించి కూడా మాట్లాడుతున్నారు.

ఇలా ఆస్కార్ అవార్డు రావడానికి రాజమౌళి కీరవాణి ప్రత్యేక కారణమని చెబుతున్నారు కానీ ఆస్కార్ అవార్డు గెలుచుకోవడం వెనక కార్తికేయ ప్రమేయం ఉందని చాలామందికి తెలియదు. అసలు ఈ కార్తికేయ ఎవరో కూడా చాలామందికి తెలియదు. కాస్త సినిమాలపై అవగాహన ఉన్నవారికి మాత్రమే ఆయన రాజమౌళి కొడుకు అని తెలుసు కానీ సినీ పరిజ్ఞానం లేని వారికి ఆయన ఎవరో కూడా తెలియదు కానీ ఆస్కార్ అవార్డు రావడానికి కారణమయ్యారు.

ఈ సినిమా ఆస్కార్ అవార్డు గెలుచుకోవడానికి కార్తికేయ ప్రమేయం ఎంత ఉంది ఈయన రాజమౌళి భార్య రమా గారి మొదటి భర్త కుమారుడు అయినప్పటికీ రాజమౌళి మాత్రం తన సొంత కుమారుడిగానే భావిస్తున్నారు. ఇక ఈయన ప్రస్తుతం లైన్ ప్రొడ్యూసర్ స్థాయికి వెళ్లిపోయాడు. ‘బాహుబలి’కి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు రావడానికి కారణం కార్తికేయ అని అంటుంటారు.  ఒక సినిమా మార్కెటింగ్ ప్రమోషన్ చేసే విషయంలో కార్తికేయ దిట్ట అని చెప్పాలి.

S.S Karthikeya: ఆస్కార్ కి కార్తికేయనే కారణమా…

ఆర్ఆర్ఆర్’ స్టోరీ దగ్గర నుంచి ఆస్కార్ గెలుచుకోవడం వరకు ప్రతిదీ దగ్గరుండి చాలా జాగ్రత్తగా చూసుకున్నాడు. మార్కెటింగ్, ఇతర దేశాల్లో సినిమా ప్రదర్శన, డబ్బు లెక్కలు, ఆస్కార్ వరకు వెళ్లడానికి ప్లానింగ్ అంతా ఆర్గనైజ్ చేసింది కార్తికేయనే. ఉత్తమ విదేశీ మూవీ విభాగంలో మన దేశం నుంచి ఈ సినిమాని ఆస్కార్ నామినేషన్ కి పంపించకపోవడంతో రంగంలోకి దిగిన కార్తికేయ వేరియన్స్ ఫిల్మ్స్ సహాయంతో ఆస్కార్ కు సినిమాని పంపడానికి కావాల్సిన అన్ని అర్హతలను  సాధించాడు ఇలా ఆస్కార్ విషయంలో కార్తికేయ హస్తం ఎంతో ఉండడం చేతనే ఆస్కార్ వేదికపై కీరవాణి కార్తికేయకో స్పెషల్ థాంక్స్ తెలియజేశారు.

Jr.NTR: ఆస్కార్ వేదికపై ఎన్టీఆర్ ఫోటోని మాత్రమే ఎందుకు స్క్రోల్ చేశారు…. కావాలనే చరణ్ ను పక్కన పెట్టారా?

Jr.NTR: రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ రామ్ చరణ్ హీరోలుగా నటించిన RRR సినిమాలోని నాటు నాటు పాటకు గాను ఆస్కార్ అవార్డు రావడం అందరిని ఎంతో సంతోషానికి గురి చేసింది.ఇలా 95వ అంతర్జాతీయ ఆస్కార్ వేడుకలలో భాగంగా తెలుగు సినిమాకు ఇలా ఆస్కార్ అవార్డు రావడం నిజంగానే తెలుగు చిత్ర పరిశ్రమకు గర్వకారణం అని చెప్పాలి.

ఇక ఆస్కార్ వేడుకలలో భాగంగా గత పది రోజులుగా రామ్ చరణ్ అమెరికాలో సందడి చేస్తున్నారు. అలాగే తారక్ సైతం ఇంటర్వ్యూలకు హాజరవుతూ సినిమాని భారీగా ప్రమోట్ చేశారు. ఇలా రామ్ చరణ్ ఎక్కడ ఏ ఇంటర్వ్యూలో పాల్గొన్న తారక్ గురించి గొప్పగా చెబుతూ వచ్చారు. అయితే ఎన్టీఆర్ మాత్రం కొన్ని సందర్భాలలో రామ్ చరణ్ పేరును స్కిప్ చేయడం గమనార్హం.

ఇకపోతే ఆస్కార్ అవార్డు అందుకున్న వెంటనే ఎన్టీఆర్ రామ్ చరణ్ ఇద్దరు కూడా తమ సంతోషాన్ని ట్విట్టర్ వేదికగా తెలియజేశారు. అయితే రామ్ చరణ్ ట్వీట్ చేస్తూ ఎన్టీఆర్ ను ట్యాగ్ చేశారు. కానీ ఎన్టీఆర్ మాత్రం రామ్ చరణ్ ను ట్యాగ్ చేయలేదు దీంతో రామ్ చరణ్ అభిమానులు కాస్త డిసప్పాయింట్ అయినట్టు తెలుస్తుంది. అలాగే ఆస్కార్ ప్రకటించగానే వేదికపై కీరవాణి మాట్లాడుతున్న సమయంలో వెనుక కేవలం ఎన్టీఆర్ ఫోటోను మాత్రమే స్క్రోల్ చేశారు.

Jr.NTR: మ్ చరణ్ ను ట్యాగ్ చేయని తారక్…

ఈ పాటలో ఎన్టీఆర్ పాత్ర ఎంత ఉందో రాంచరణ్ పాత్ర కూడా అంతే ఉంది కనుక రామ్ చరణ్ ఫోటోని పక్కన పెట్టకపోవడంతో చరణ్ అభిమానులు మాత్రం అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇలా ఈ చిన్నపాటి విషయాలే ఇద్దరి స్టార్ హీరోల అభిమానుల మధ్య పెద్ద ఎత్తున వివాదాలకి కారణమవుతున్నాయని చెప్పాలి. ప్రస్తుతం ఈ విషయం గురించి చరణ్ తారక్ అభిమానుల మధ్య పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి.

Osacar 2023: నాటు నాటుతో పాటు ఆస్కార్ బరిలో నిలిచిన పాటలు ఇవే?

Osacar 2023: ప్రపంచ సినీ చరిత్రలో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ నామినేషన్స్ లో తెలుగు సినిమా నుండి నాటు నాటు పాట ఎంపికైన సంగతి అందరికీ తెలిసిందే. రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఆర్ ఆర్ ఆర్ సినిమాకి కీరవాణి సంగీతం అందించారు. చంద్రబోస్ రచించిన నాటు నాటు పాటకు కీరవాణి స్వరం చేకూర్చారు. ఆర్ఆర్ఆర్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా అన్ని భాషలలో విడుదలై అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది.

ఇక ఈ నాటు నాటు పాటకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది. అంతేకాకుండా ఈ పాటకు గోల్డెన్ గ్లోబల్ అవార్డు కూడా దక్కించుకొని ఆస్కార్ నామినేషన్ లో నిలిచింది. మార్చి 13వ తేదీ అమెరికాలోని లాస్ ఏంజిల్స్ లో జరిగే ఆస్కార్ అవార్డు ప్రధానోత్సవ వేడుక ఎంతో ఘనంగా జరగబోతుంది. ఈ వేడుకలలో మన తెలుగు పాటకు ఆస్కార్ అవార్డు దక్కాలని తెలుగు ప్రజలు కోరుకుంటున్నారు.

ఇప్పటికే ఆర్ఆర్ఆర్ టీమ్ లాస్ ఏంజెల్స్ లో సందడి చేస్తు విదేశీ మీడియాకి వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ ఆర్ఆర్ఆర్ సినిమా గొప్పతనాన్ని ప్రపంచానికి చాటిచెబుతున్నారు. ఇదిలా ఉండగా నాటు నాటు పాటతో పాటు ఇతర భాషల సినిమాలలోని మరి కొన్ని సాంగ్స్ కూడా ఆస్కార్ కోసం పోటీ పడుతున్నాయి.

Osacar 2023: నాటు నాటు పైనే ఆశలన్నీ…

‘టెల్ ఇట్ లైక్ ఏ ఉమెన్’ సినిమాలోని పాట ‘ఆప్లాజ్’, అలాగే ‘బ్లాక్ పాంథర్ : వకాండా ఫరెవ్వర్’ లోని ‘లిప్ట్ మీ అప్’ అనే పాట.’ఎవ్రీథింగ్ ఎవ్రీ వేర్ ఆల్ ఎట్ వన్స్’ సినిమాలోని ‘దిస్ ఇజ్ ఏ లైఫ్’ అలాగే పాటు ‘టాప్ గన్ మావెరిక్’ సినిమాలోని ‘హోల్డ్ మై హ్యాండ్’ అనే పాటలు కూడా ఆస్కార్ రేస్ లో ఉన్నాయి. ఆస్కార్ బరిలో ఉన్న ఈ పాటలను వెనక్కి నెట్టి బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీ లో నాటు నాటు పాట ఆస్కార్ అవార్డు దక్కించుకుంటుందో లేదో చూడాలి.

Oscar 2023: అందరి చూపు ఆస్కార్ పైనే… ఆస్కార్ వేడుకలలో తెలుగు సినిమా సత్తా చాటేనా?

Oscar 2023: ప్రపంచ సినిమా ఇండస్ట్రీలో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే అవార్డులలో ఆస్కార్ అవార్డు కూడా ఒకటి. మార్చి 13న జరగబోయే ఈ అవార్డ్ ప్రధానోత్సవ వేడుకల కోసం యావత్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తుంది. ముఖ్యంగా తెలుగు ప్రజలు ఈ అవార్డు ప్రధానోత్సవం వేడుకల కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. మొదటిసారిగా తెలుగు సినిమా ఆస్కార్ నామినేషన్స్ లో నిలవటం తెలుగు ప్రజలు గర్వంగా భావిస్తున్నారు.

రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్ ఆర్ ఆర్ సినిమాలోని నాటు నాటు పాట ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్ కి ఎంపికయ్యింది. అమెరికాలో లాస్ ఏంజిల్స్‏లోని డాల్బీ థియేటర్ లో ఆస్కార్‌ అవార్డుల ప్రదానోత్సవం అంగరంగా వైభవంగా జరగబోతోంది. మరికొద్ది గంటల్లో ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డుల ప్రధాన ఉత్సవ కార్యక్రమం ప్రారంభం కానుంది. ప్రపంచ వేదికపై మన తెలుగు సినిమాలోని ఆర్ఆర్ఆర్ సత్తా చాటబోతోంది. ఈ సినిమాలోని నాటు నాటు పాట ప్రపంచవ్యాప్తంగా ప్రభంజనం సృష్టిస్తోంది.

నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డ్‌ రావాలని భారతీయ ప్రజలు బలంగా కోరుకుంటున్నారు. ఆస్కార్‌ అవార్డుకు అడుగు దూరంలో నిలిచిన ట్రిపుల్‌ ఆర్‌ టీమ్‌కి…తెలుగు రాష్ట్రాల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఇదిలా ఉండగా కొద్ది రోజులుగా ఆర్ ఆర్ ఆర్ టీమ్‌ అమెరికాలో సందడి చేస్తున్నారు. దర్శకుడు రాజమౌళితో పాటు హీరోలు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ అమెరికాలో ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ జోరుగా చేస్తున్నారు.

Oscar 2023: ఆశలన్నీ ఆస్కార్ పైనే…

అమెరికా మీడియాతో వరుస ఇంటర్వ్యూలు చేస్తూ ఆర్ఆర్ఆర్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంటున్నారు. ఒరిజినల్‌ సాంగ్‌ విభాగంలో నామినేట్‌ అయిన నాటునాటు సాంగ్‌కు ఆస్కార్‌ తప్పకుండా వస్తుందని చాలా నమ్మకంగా ఉన్నారు . ఇప్పటికే నాటు నాటు పాటకు గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డు కూడా లభించింది. అలాగే హాలీవుడ్ ఫిలిం క్రిటిక్ ఛాయిస్ అవార్డ్ సైతం అందుకుంది. ప్రపంచ సినీవేదికపై తెలుగు సినిమా ఖ్యాతిని వెలుగెత్తి చాటాలంటూ.. ట్రిపుల్‌ టీమ్‌కు అభిమానులు ఆల్‌ ది బెస్ట్‌ చెబుతున్నారు .

Nagababu: నీ అమ్మ మొగుడు ఖర్చు పెట్టాడా… తమ్మారెడ్డికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన నాగబాబు!

Nagababu: తెలుగు సినిమా ఇండస్ట్రీలో సీనియర్ నిర్మాతగా ఉన్నటువంటి తమ్మారెడ్డి భరద్వాజ్ ఈ మధ్య సినిమాలో నిర్మించడం తక్కువ అయినప్పటికీ పలు సినిమాలలో నటుడిగా నటిస్తూ ఉన్నారు. అయితే ఈయన ఇండస్ట్రీ గురించి తరచూ మాట్లాడుతూ ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు.ఇలా వివాదాస్పద వ్యాఖ్యల ద్వారా వార్తల్లో నిలిచే తమ్మారెడ్డి తాజాగా RRR సినిమా గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈ సినిమా ఆస్కార్ ప్రమోషన్ల కోసం దాదాపు 80 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేశారని, ఆ డబ్బుతో మేము ఎనిమిది సినిమాలు చేసే మీ మోహన కొట్టే వాళ్ళం అంటూ కామెంట్లు చేశారు. వీరి అమెరికా ఫ్లైట్ టికెట్లకే కొన్ని కోట్ల రూపాయలు ఖర్చవుతున్నాయి అంటూ ఈయన RRR సినిమా గురించి చేసినటువంటి ఈ కామెంట్స్ సంచలనం రేపాయే.

ఇలా తమ్మా రెడ్డి ఈ సినిమా గురించి ఇలా మాట్లాడటం తో నేటిజన్స్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు అయితే తమ్మారెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలపై పలువురు సెలబ్రిటీలు కూడా స్పందిస్తూ తనకు కౌంటర్ ఇస్తున్నారు. ఈ క్రమంలోనే మెగా బ్రదర్ నాగబాబు కూడా తమ్మారెడ్డి వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో అసహనం వ్యక్తం చేయడమే కాకుండా తమ్మారెడ్డికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

Nagababu: కొందరికి ఇలాగే సమాధానం చెప్పాలి..


ఈ క్రమంలోనే నాగబాబు ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ… నీ అమ్మ మొగుడు ఖర్చు పెట్టాడారా… 80 కోట్లు RRR కోసం.(#RRR మీద కామెంట్ కు వైసిపి వారి భాషలో సమాధానం) అంటూ ఈయన ట్వీట్ చేశారు.ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇక నాగబాబు చేసిన ట్వీట్ పై స్పందిస్తూ కొందరికి ఇలాంటి భాషలో సమాధానం చెబితేనే అర్థం అవుతుంది అంటూ ఈయన ట్వీట్ పై సమర్థిస్తూ కామెంట్లు చేస్తున్నారు. మరి నాగబాబు చేసినటువంటి ఈ వ్యాఖ్యలపై తమ్మారెడ్డి స్పందన ఎలా ఉంటుందో తెలియాల్సి ఉంది.