Tag Archives: Saidabad Rape Case

సైదాబాద్ నిందితుడు రాజు ఆత్మహత్య.. మృతదేహాన్ని కనిపెట్టిన పోలీసులు..

తెలంగాణలోని సైదాబాద్ ఘటనలో చిన్నారిని అత్యాచారం చేసి హత్య చేసిన రాజును పట్టుకోవడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. అయితే దీనిపై తాజాగా ఓ వార్త వెలుగులోకి వచ్చింది. నిందితుడు రాజు ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం వినపడుతోంది. వివరాల్లోకి వెళ్తే.. గత కొన్ని రోజుల క్రితం హైదరాబాద్ లోని సైదాబాద్ ప్రాంతంలో ఓ ఆరేళ్ల చిన్నారి చిప్స్ ప్యాకెట్ కొనడానికి బయటకు వెళ్లగా.. ఆ చిన్నారిని బలవంతంగా తీసుకెళ్లి.. అత్యాచారం, హత్య చేశాడు రాజు అనే నిందితుడు.

అయితే ఈ ఘటనను ప్రతీ ఒక్కరూ సీరియస్ గా తీసుకున్నారు. సెలబ్రిటీల దగ్గర నుంచి రాజకీయ ప్రముఖుల వరకు తీవ్రంగా స్పందించారు. కుటుంబసభ్యులు, స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళన చెప్పట్టగా.. నిందుతుడిని పట్టుకొని న్యాయం చేస్తామంటూ పోలీసులు హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇంత వరకు అతడి ఆచూకీని మాత్రం పోలీసులు కనుక్కోలేకపోయారు.

పవణ్ కళ్యాణ్, రేవంత్ రెడ్డి , వైఎస్ షర్మిల, మంచు మనోజ్ తో పాటు ఎంతో మంది బాధిత కుటుంబసభ్యులను పరామర్శించారు. అతడిని పట్టిస్తే నజరానాలను కూడా అందజేస్తామని సీనీ ప్రముఖులు ప్రకటించారు. అయితే తాజాగా అతడు ఆత్మహత్య చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై పోలీసులు అధికారికంగా ప్రకటించలేదు.

త్వరలో ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎల్బీ నగర్ నుంచి బయలుదేరిన రాజు నాగోల్ లో మద్యం కొనుగోలు చేసినట్లు సీసీటీవీ ఫుటేజీల ద్వారా పోలీసులు గుర్తించారు. ఆ తర్వాత ఉప్పల్ వెళ్లాడు. అక్కడి వరకు సిసీటీవీ ఫుటేజీల ద్వారా అతని కదలికలను పోలీసులు గుర్తించారు. తర్వాత వారం రోజుల పాటు రాజు కోసం గాలించిన పోలీసులు చివరకు అతని మృతదేహాన్ని కనిపెట్టారు. ఘట్ కేసర్ రైలు పట్టాలపై పోలీసులకు అతడి మృతదేహం కనిపించింది.

మాకు సెలవులు ఇవ్వండి.. ఆ దుర్మార్గుడిని పట్టుకుంటాం..

సైదాబాద్ లో జరిగిన అత్యాచార, హత్య ఘటనపై ప్రతీ ఒక్కరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ నిందితుడిని పట్టిస్తే రూ.10 లక్షలు రివార్డు అందజేస్తామని పోలీసులు కూడా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఎన్ని పై ఎత్తులు వేసినా ఆ నిందితుడు మాత్రం కనిపించలేదు. అందరి డిమాండ్ ఇప్పుడు ఒక్కటే.. నిందితుడిని పట్టుకొని కఠినమైన శిక్షను అమలు చేయాలని.

అందులో సామాన్యులు కూడా భాగస్వాములవుతున్నారు. ఇదిలా ఉండగా.. హైదరాబాద్ లో ఉద్యోగాలు చేసే చాలామంది దీనిపై తీవ్రంగా స్పందిస్తున్నారు. అతడిని పట్టుకోవడానికి మాకు అవకాశం ఇవ్వండంటే.. తమకు సెలవులు కావాలంటూ తమ కంపెనీ బాస్ లను అడుగుతున్నారు. మాకు ఒక వారంరోజులు సెలువులు ఇవ్వండి ఆ దుర్మార్గుడు రాజుని పట్టుకొస్తామంటూ అర్జీలు పెడుతున్నారంట.

పోలీసులు అనౌన్స్ చేసిన ఆ రివార్డు కోసం కాదంటూ.. ఆ ఘటన విన్న మాకు రక్తం మరిగిపోతుందని.. అలాంటి నీచులు ఈ సమాజంలో ఉండటానికి అర్హత లేదంటూ చెప్పారు. ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా.. ఇలాంటి దుర్మార్గులు ఇంకొకరు తయారు కాకుండా ఉండాలంటే అతడికి కఠిన శిక్షలు అమలు చేయాలని వాళ్లు కోరుతున్నారు.

మాకు ఆ నీచుడిని వెతికి పట్టుకునేందుకు అవకాశం ఇవ్వాలని.. దానికి తమకు సెలవులు కావాలంటూ దరఖాస్తులు పెడుతున్నట్లు సమాచారం. బాధిత కుటంబసభ్యులను పరామర్శించేందుకు రాజకీయ ప్రముఖులతో పాటు.. సీని ప్రముఖులు కూడా అక్కడికి క్యూ కడుతున్నారు. ఎంతో సంచలనంగా మారిన ఈ కేసులో తమ వంత భాగస్వాములు అవుతామంటూ పేర్కొంటున్నారు.

సైదాబాద్ నిందితుడిని పట్టుకోవడం కోసం.. మరికొన్ని క్లూ ఇచ్చిన పోలీసులు.. గుండు చేయించుకుంటే ఇలా..

హైదరాబాద్ నగరంలోని సైదాబాద్ సింగరేణి కాలనీలో ఆరేళ్ల చిన్నారిపై జరిగిన అత్యాచార ఘటన పై రెండు తెలుగు రాష్ట్రాలు ఆగ్రహంతో ఊగిపోతున్నాయి. ఈ క్రమంలోనే నిందితుడు రాజును కఠినంగా శిక్షించాలని ఈ నిందితుడు బయట తిరగడానికి వీలు లేదంటూ.. అతనిని ఉరి తీసి చంపాలని పెద్దఎత్తున రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే నిందితుల్ని పట్టుకోవడం కోసం తెలంగాణ పోలీసులు పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టారు.

ఈ క్రమంలోనే పరారీలో ఉన్న నిందితుడిని పట్టుకోవడం కోసం పోలీసులు పది లక్షల రూపాయలు నజరానాలు ప్రకటించారు. నిందితులు ఉపయోగించిన సెల్ఫోన్ ఆధారంగా అతని ఆచూకీ పట్టుకోవడం కష్టతరంగా మారడంతో సిసిటివీ ఫుటేజీ ఆధారంగా నిందితులను పట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.ఇలా నగరంలో పలు ప్రాంతాల వద్ద ఉన్నటువంటి సీసీ కెమెరాల రికార్డులను పోలీసులు పర్యవేక్షిస్తున్నారు.

ఇదిలా ఉండగా నిందితులు రాజు వివిధ మారువేషాల్లో తిరుగుతూ ఉంటే అతనిని గుర్తించడం కోసం పోలీసులు పలు ఫోటోలను విడుదల చేశారు. తను గుండు కొట్టించుకుని ఉంటే ఏ విధంగా ఉంటాడు అనేటటువంటి ఊహా చిత్రాలను విడుదల చేశారు. ఎవరికైనా అనుమానాస్పదంగా కనపడితే వారిని క్షుణ్ణంగా పరిశీలించాలని అతని చేతి పై మౌనిక అనే పేరు ద్వారా తనని సులభంగా గుర్తించవచ్చు అని పోలీసులు తనకి సంబంధించిన మరికొన్ని వివరాలను తెలియజేశారు.

సీసీటీవీల ఫుటేజీలను పరిశీలిస్తున్న పోలీసులకు ఉప్పల్ సిగ్నల్స్ దగ్గర నిందితుడు రోడ్డు క్రాస్ చేస్తూ వెళ్తున్న అటువంటి దృశ్యాలను పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలోనే అక్కడ ఉన్నటువంటి ఒక వైన్ షాప్ దగ్గర నిందితుడు తన చేతిలో ఉన్న కవర్ పడేయడంతో టాస్క్ ఫోర్స్ సిబ్బంది ఆ కవర్ ను స్వాధీనం చేసుకున్నారు.ఆ కవర్‌లో కల్లు సీసా, టవల్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఎలాగైనా నిందితుడిని మరో 24 గంటలలో పట్టుకోవాలని హైదరాబాద్ పోలీసులు పలు ప్రాంతాలలో అతని ఫోటోలు చూపిస్తూ గాలింపు చర్యలు చేపడుతున్నారు.