Tag Archives: sbi home loan

ఎస్బీఐ కస్టమర్లకు బంపర్ ఆఫర్లు.. లోన్లు తీసుకునే వారికి భారీగా రాయితీలు..

పండుగ సీజన్ రాబోతున్నందును ఎస్‌బీఐ తన కస్టమర్లకు అద్భుత ఆఫర్లను ప్రవేశపెట్టింది. ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, పొదుపు ఖాతాలతో పాటు వాహనాలకు సంబంధించిన లోన్లు, బంగారు రుణాలు, గృహ రుణాలు తదితర రుణాలపై కూడా ఆఫర్లు ప్రకటించింది. దీనిలో ముఖ్యంగా కారు లోన్‌ కస్టమర్లకు 100 శాతం ప్రాసెసింగ్‌ రుసుము మినహాయింపుతో పాటు వాహనం ఆన్‌-రోడ్‌ ధరలో 90 శాతం వరకు రుణం పొందే సౌకర్యం కల్పిస్తున్నట్లు ప్రకటించింది.

దీనిని కేవలం యోనో యాప్ ద్వారా కారు లోన్ కు దరఖాస్తు చేసుకున్న వారికి మాత్రమే ఇది వర్తించనుది. దీనిపై వడ్డీని 0.25 శాతం రాయితీ లభించనుంది. సాధారణంగా యోనో వినియోగదారులకు కార్‌లోన్‌పై వడ్డీ రేటు 7.5 శాతం నుంచి ప్రారంభమవుతుంది. ఇక గోల్డ్ లోన్ రుణాలపై వడ్డీని 0.75 శాతం రాయితీని అందిస్తున్నట్లు ప్రకటించింది ఎస్బీఐ. అయితే దీనిలో కూడా యోనో యాప్‌ ద్వారా గోల్డ్‌ లోన్‌ కోసం దరఖాస్తు చేసుకునే కస్టమర్లకు ప్రాసెసింగ్‌ రుసుము పూర్తిగా మినహాయింపు ఇచ్చారు.

గోల్డ్ లోన్ పై ప్రస్తుతం ఆన్ లైన్, ఆఫ్ లైన్ ల ద్వారా వడ్డీ రేటు 7.5 శాతం ఉంది. ఇక పర్సనల్ లోన్ విషయానికి వస్తే.. మనం దరఖాస్తును ఎలా సమర్పించినా ప్రాసెసింగ్ ఫీజును మాత్రం 100 శాతం మినహాయింపు ఉంటుందని ప్రకటించారు. వీటిలో కరోనా కాలంలో ముందు ఉండి ప్రజల రక్షణ కొరకు పోరాడిన ఫ్రంట్ లైన్ వారియర్స్ కు వీటిపై 0.5 శాతం ప్రత్యేక రాయితీని కల్పించారు. వారికి ఇంకా కార్‌ లోన్‌, గోల్డ్‌ లోన్‌పైనా ఈ ఆఫర్‌ త్వరలో వర్తించనున్నట్లు ఎస్బీఐ ప్రకటించింది.

ఇక హోమ్ లోన్ పై కూడా 100 శాతం ప్రెసెసింగ్ ఫీజు రాయితీ ని ఈ నెల 31 వరకు ప్రకటించింది. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లయిన సందర్భంగా రిటైల్‌ డిపాజిట్‌దారుల కోసం ‘ప్లాటినమ్‌ టర్మ్‌ డిపాజిట్‌’ పథకాన్ని ప్రవేశపెడుతున్నట్లు ఎస్‌బీఐ ప్రకటించింది. ఈ ఆఫర్‌లో భాగంగా, 75 రోజులు, 75 వారాలు, 75 నెలల కాలపరిమితి డిపాజిట్‌పై 0.15 శాతం అదనపు వడ్డీ ఆదాయం పొందే అవకాశం కల్పిస్తున్నట్లు బ్యాంక్‌ తెలిపింది. ఈనెల 15 నుంచి సెప్టెంబరు 14 వరకు ఈ టర్మ్‌ డిపాజిట్‌ ఆఫర్‌ అందుబాటులో ఉండనున్నట్లు ఎస్ బీఐ ప్రకటించింది.

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎస్బీఐ శుభవార్త.. హోం లోన్ తీసుకునే వారికి ఉపయోగకరం…

కరోనా కాలంలో ప్రతీ ఒక్కరి జీవన విధానంలో మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ సొంత ఇళ్లు ఉండాలని కూడా కోరుకుంటున్నారు. కొంతమంది ఆర్థిక పరిస్థితులు బాగాలేక ఇల్లును విక్రయించాలనుకుంటుంటే.. మరి కొంత మంది కొనుగోలు చేయాలనుకుంటున్నారు.

ఈ మహమ్మారి పరిస్థితులు ఎదురైనా.. ఇళ్ల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. ఈ సందర్భంగా దేశంలో అతి పెద్ద ప్రభుత్వరంగ బ్యాంక్ అయిన దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంకింగ్ ఆఫ్ ఇండియా ఇల్లు కొనాలని ప్లాన్ చేసుకుంటున్న వారికి గుడ్ న్యూస్ చెప్పింది. స్వాతంత్ర్య దినోత్సవం అంటే ఆగస్టు 15 సందర్భంగా దేశంలో ఎవరైనా హోం లోన్ తీసుకోవాలనుకున్న వారికి ప్రాసెసింగ్ ఫీజు అనేది తీసుకోవడం లేదంటూ తెలిపింది.

స్వాతంత్ర్య దినోత్సవం రోజున..హోం లోన్లపై సున్నా ప్రాసెసింగ్ ఫీజుతో మీ కలల ఇంటిలోకి అడుగు పెట్టండి” అంటూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా ట్వీట్ చేసింది. దీంతో హోం లోన్ తీసుకునే మహిళా ఖాతాదారులకు మరొక వడ్డీ రాయితీ లభించనుంది. యోనో యాప్ వినియోగిస్తున్న ఖాతాదారులు కూడా యోనో ద్వారా దరఖాస్తు చేసినట్లయితే వారికి కూడా 5 బీపీఎస్ వడ్డీ రాయితీ లభించనుంది.

హోం లోన్లకు ఎస్బీఐ వడ్డీ రేటను 6.70శాతంగా పేర్కొంది. అంతేకాకుండా హోం లోన్ తీసుకునే వారు 7208933140 నంబరుకు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా కూడా లోన్ పొందే అవకాశం ఉంటుంది.

కస్టమర్లకు బంపర్ ఆఫర్.. తక్కువ వడ్డీకే బజాజ్ ఫైనాన్స్ రుణాలు..?

కరోనా విజృంభణ నేపథ్యంలో మారిన ప్రజల ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులు కస్టమర్లకు వరుస శుభవార్తలు చెబుతున్నాయి. రుణాలపై వడ్డీరేట్లను భారీగా తగ్గిస్తూ కస్టమర్లకు ప్రయోజనం చేకూరేలా చేస్తున్నాయి. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ బజాజ్ ఫైనాన్స్ కూడా కస్టమర్లకు శుభవార్త చెప్పింది. బజాజ్ ఫైనాన్స్ అనుబంధ సంస్థ అయిన బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ రుణాలపై భారీగా వడ్డీరేట్లను తగ్గించింది.

సొంతింటి కలను సాకారం చేసుకోవాలనే కస్టమర్లకు ప్రయోజనం చేకూర్చేందుకు 6.9 శాతం నుంచే బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ రుణాలు ప్రారంభం కానున్నాయి. బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ హోం లోన్లపై వడ్డీరేట్లను భారీగా తగ్గించడం గమనార్హం. దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హోమ్ లోన్స్ పై 6.9 శాతం వడ్డీ వసూలు చేస్తుండగా ఎస్బీఐకు పోటీగా ఇంతే వడ్డీకి బజాజ్ ఫైనాన్స్ కస్టమర్లకు ప్రయోజనం చేకూరేలా చేస్తుండటం గమనార్హం.

బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ లో ఒక వ్యక్తి ఇంటి కొనుగోలు కోసం కోటి రూపాయలు లోన్ తీసుకుంటే 6.9 శాతం వడ్డీ ప్రకారం చాలా తక్కువ మొత్తం వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. గతంతో పోలిస్తే బజాజ్ ఫైనాన్స్ లో వడ్డీ రేట్లు తగ్గడం వల్ల హోం లోన్ తీసుకున్న వాళ్లకు లక్షల రూపాయలు ఆదా కానుందని తెలుస్తోంది. కోటి రూపాయల లోన్ కు 30 సంవత్సరాలను లోన్ టెన్యూర్ గా ఎంచుకుంటే లోన్ పూర్తయ్యే సమయానికి కోటీ 30 లక్షలు వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది.

అయితే సాధారణంగా బయట వడ్డీలతో పోలిస్తే బ్యాంకుల ద్వారా రుణాలు తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలను పొందవచ్చు. తక్కువ వడ్డీరేటుకే రుణాలు పొందే అవకాశం ఉండటంతో పాటు లోన్ చెల్లించడానికి ఎక్కువ కాలపరిమితిని ఎంచుకోవచ్చు.