Tag Archives: shanmukh

అలాంటి వారికి ఓట్లు వేయకండి.. తన సపోర్ట్ వాళ్లకే .. యాంకర్ ప్రశాంతి షాకింగ్ కామెంట్స్..!

తెలుగు బిగ్ బాస్ రియాల్టీ షో మొన్నటి వరకు టీఆర్పీ రేటింగ్ దారుణంగా ఉంది. ప్రస్తుతం టీ20 వరల్డ్ కప్ కూడా అయిపోవడంతో బిగ్ బాస్ రియాల్టీ షో టీఆర్పీ రేటు పుంజుకుంటున్నట్టు కనిపిస్తుంది. ఎన్నికలు, క్రికెట్ ముగిసిపోవటంతో మళ్ళీ సోషల్ మీడియాలో బిగ్ బాస్ క్రేజ్ పెరిగింది. దీనిపై బిగ్ బాస్ అప్డేట్స్ పై నెటిజన్లు ఎక్కువ ఆసక్తిని కనబరుస్తున్నారు.

దీనికి కారణం హౌస్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్లు అయిన సన్నీకి, షణ్ముఖ్ మధ్య గొడవనే చెప్పాలి. ఆడవాళ్లను అడ్డం పెట్టుకొని గేమ్ ఆడుతున్నావ్ అంటూ షణ్ముఖ్ పై సన్నీ రెచ్చిపోయాడు. దీనిపై షణ్ముఖ్ గర్ల్‌ఫ్రెండ్‌ దీప్తి సునయన కూడా సన్నీకి స్ట్రాంగ్ కౌంటర్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. దానిపై ఓ పెద్ద పోస్టును దీప్తి తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేశారు.

ఆ గొడవలో షణ్ముఖ్ ప్రవర్తించిన తీరు తనకు ఎంతగానో నచ్చిందని.. తనను హగ్ చేసుకోవాలని అనిపిస్తుంది అంటూ దీప్తి అందులో పేర్కొంది. ఇదిలా ఉండగా.. ఆ వ్యవహారంపై మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్లు అయిన శివజ్యోతి షణ్ముఖ్ కు సపోర్టు చేయగా.. కొందరు షణ్ముఖ్ దే తప్పు అంటూ భావిస్తున్నారు.

తాజాగా సీనియర్ టీవీ యాంకర్ ప్రశాంతి షణ్ముఖ్ బిహేవియర్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. హౌస్ లో గేమ్ చూసి ఓటు వేయండి.. అంతేకాని బయట వారి పాపులారిటీ చూసి ఓట్లు వేయకండి అంటూ షణ్ముఖ్ ని ఇన్ డైరెక్ట్ గా టార్గెట్ చేసింది యాంకర్ ప్రశాంతి. హౌస్ లో టాప్ 5 లో ఎవరుంటారో తనకు తెలుసని.. వాళ్లందరికీ తన సపోర్టు ఉంటుందని ఆమె పేర్కొంది. హౌస్ లో గేమ్ లు మంచిగా ఆడిన వారికి మాత్రమే ఓట్లు వేయండి అంటూ యాంకర్ ప్రశాంతి షాకింగ్ కామెంట్ చేశారు.

మరోసారి పోలీసుల మాట పెడచెవిన పెట్టిన షణ్ముఖ్.. ఫుల్ సీరియస్

యూట్యూబ్ స్టార్ ష‌ణ్ముఖ్ జ‌శ్వంత్ తాగిన మత్తులో ఇటీవల ప్రమాదం చేసిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సోషల్ మీడియా స్టార్ కారు రోడ్ నంబ‌రు 10 , జూబ్లీహిల్స్ లో కంట్రోల్ తప్పి, ఎదురుగా వస్తున్న రెండు కార్లను , రెండు బైక్ లను సైతం ఢీకొట్టింది. ఈ యాక్సిడెంట్ లో రోడ్ పై వెళ్తున్న ఒక వ్యక్తి కి బలం గా దెబ్బలు తగిలాయి. ఇంకా ఈ పరిస్థితికి కారణం అయిన షణ్ముఖ్‌ జశ్వంత్‌కు పోలీసులు బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ చేశారు. ఆ ఫలితాల్లో రీడింగ్ 170 రాగ, సెక్షన్ 337, 279 కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇక్కడ వరకు అందరికి తెలిసిన తాజాగా షణ్ముఖ్ చేసిన పనితో పోలీసులు సీరియస్ గా ఉన్నారట.

ప్రమాదం తర్వాత ‌ పోలీసులు ఇచ్చే కౌన్సిలింగ్‌కు షణ్ముఖ్‌ జశ్వంత్‌ అటెండ్ అవ్వకపోవడమే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తుంది. ఇక ప్రమాదం తర్వాత సాధారణంగా కుటుంబ సభ్యుల సమక్షంలో ఎవరికైనా కౌన్సిలింగ్ ఇవ్వడం పరిపాటి. సెలబ్రిటీస్ సైతం ఇందుకు మినహాయింపు కాదు. అందులో భాగంగానే షణ్ముఖ్‌‌కు తన తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ ఇచ్చేందుకు సిద్ధం అయ్యి, అందుకోసం షణ్ముఖ్ ని పిలిచారు. కానీ వారి విన్నపాన్ని ఏ మాత్రం పట్టించుకోని షణ్ముఖ్ కౌన్సిలింగ్ హాజరు కాలేదట.

అంతే కాదు షణ్ముఖ్‌ను అరెస్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు అతడి ప్రవర్తన సైతం పోలీసుల ఆగ్రహానికి మరొక కారణం అని తెలుస్తుంది. ఆ సమయంలో పలువురు పెద్దలతో ఫోన్లు చేయించాలని షణ్ముఖ్ భావించగా అందుకు పోలీసులు ఒప్పుకోలేదు. ఇక ఏవైరికి ఏమి కానప్పుడు ఎందుకు ఇంత అతిగా ప్రవర్తిస్తున్నారంటూ షణ్ముఖ్ వితండవాదం చేయడం సైతం అందరు వీడియోల్లో చూసారు. ఇది ఇప్పటికి వైరల్ గా కొనసాగుతుంది. మరి ఇప్పటికైనా తన ప్రవర్తన మార్చుకొని షణ్ముఖ్ జస్వంత్ పోలీసుల కౌన్సిలింగ్ వస్తాడా, రాడా అనే విషయం వేచి చూడాలి.