తెలుగు బిగ్ బాస్ రియాల్టీ షో మొన్నటి వరకు టీఆర్పీ రేటింగ్ దారుణంగా ఉంది. ప్రస్తుతం టీ20 వరల్డ్ కప్ కూడా అయిపోవడంతో బిగ్ బాస్ రియాల్టీ షో టీఆర్పీ రేటు పుంజుకుంటున్నట్టు కనిపిస్తుంది. ఎన్నికలు, క్రికెట్ ముగిసిపోవటంతో మళ్ళీ సోషల్ మీడియాలో బిగ్ బాస్ క్రేజ్ పెరిగింది. దీనిపై బిగ్ బాస్ అప్డేట్స్ పై నెటిజన్లు ఎక్కువ ఆసక్తిని కనబరుస్తున్నారు.
దీనికి కారణం హౌస్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్లు అయిన సన్నీకి, షణ్ముఖ్ మధ్య గొడవనే చెప్పాలి. ఆడవాళ్లను అడ్డం పెట్టుకొని గేమ్ ఆడుతున్నావ్ అంటూ షణ్ముఖ్ పై సన్నీ రెచ్చిపోయాడు. దీనిపై షణ్ముఖ్ గర్ల్‌ఫ్రెండ్ దీప్తి సునయన కూడా సన్నీకి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన విషయం తెలిసిందే. దానిపై ఓ పెద్ద పోస్టును దీప్తి తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేశారు.
ఆ గొడవలో షణ్ముఖ్ ప్రవర్తించిన తీరు తనకు ఎంతగానో నచ్చిందని.. తనను హగ్ చేసుకోవాలని అనిపిస్తుంది అంటూ దీప్తి అందులో పేర్కొంది. ఇదిలా ఉండగా.. ఆ వ్యవహారంపై మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్లు అయిన శివజ్యోతి షణ్ముఖ్ కు సపోర్టు చేయగా.. కొందరు షణ్ముఖ్ దే తప్పు అంటూ భావిస్తున్నారు.
తాజాగా సీనియర్ టీవీ యాంకర్ ప్రశాంతి షణ్ముఖ్ బిహేవియర్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. హౌస్ లో గేమ్ చూసి ఓటు వేయండి.. అంతేకాని బయట వారి పాపులారిటీ చూసి ఓట్లు వేయకండి అంటూ షణ్ముఖ్ ని ఇన్ డైరెక్ట్ గా టార్గెట్ చేసింది యాంకర్ ప్రశాంతి. హౌస్ లో టాప్ 5 లో ఎవరుంటారో తనకు తెలుసని.. వాళ్లందరికీ తన సపోర్టు ఉంటుందని ఆమె పేర్కొంది. హౌస్ లో గేమ్ లు మంచిగా ఆడిన వారికి మాత్రమే ఓట్లు వేయండి అంటూ యాంకర్ ప్రశాంతి షాకింగ్ కామెంట్ చేశారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…