Featured

జ్యోతక్క.. కాస్త కంట్రల్ చేసుకో.. మీరు చేసింది మాకు తెలవదా అంటూ ఏకిపారేసిన నెటిజన్లు..!

తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 5 రెండు రాష్ట్రాల్లో ఎంత పాపులరో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికే నాలుగు సీజన్స్‌ను పూర్తి చేసుకుంది. ప్రస్తుతం ఐదవ సీజన్‌‌ విజయవంతంగా నడుస్తోంది. ఇప్పటికే దీనిలో 10 వారాలు పూర్తి చేసుకోగా.. 11వ వారంలోకి అడుగు పెట్టింది. అధికారికంగా బయటకు తెలియకపోయినా.. అనధికారికంగా 10 వ వారంలో జెస్సీ బయటకు వెళ్లినట్లు తెలిసింది.

ఇక బీబీ హోటల్ అంటూ బిగ్ బాస్ కెప్టెన్సీ టాస్క్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ టాస్క్‌లో విజేతగా నిలిచిన రవి ఇంటి కెప్టెన్ అయ్యారు. ఇక కెప్టెన్ అవ్వడానికి ఇచ్చిన టాస్క్ లో షణ్ముఖ్, సన్నీ మధ్య భయంకరమైన గొడవ చోటు చేసుకుంది.. నవ్వెంతా అంటే నువ్వెంతా అన్నట్లు సాగింది ఈ గొడవ. బిగ్ బాస్ కు మొన్నటి వరకు టీఆర్పీ రేటు తగ్గగా.. ఇప్పుడిప్పుడే మళ్ళీ బిగ్ బాస్ రేటింగ్స్ పుంజుకుంటున్నట్టు కనిపిస్తుంది. సోషల్ మీడియాలోనూ బిగ్ బాస్ అప్డేట్స్ పై నెటిజన్స్ ఆసక్తి ఒక్కసారిగా పెరిగిపోయింది.

ఇదిలా ఉంటే.. హౌస్ లో సన్నీ, షణ్ముఖ్ మధ్య జరుగుతున్న గొడవ సోషల్ మీడియాలో చర్చనీయాంశం అవుతుంది. దీనిపై షణ్ముఖ్ గర్లఫ్రెండ్ దీప్తి సునయనా తనదైన శైలిలో స్పందిస్తూ..ఇన్‌స్టాగ్రామ్‌ లో స్టోరీ పోస్టు చేశారు. ఆమె షేర్ చేసిన దానిని శివజ్యోతి షేర్ చేస్తూ.. ఆడవాళ్లని అడ్డం పెట్టుకుని ఆడటం అంటే..? ఒకసారి మీరు కెప్టెన్‌ అవడానికి యానీ మాస్టర్‌ సపోర్ట్‌ చేశారు. ఇది లేడీ కార్డ్‌ వాడటం కాదా..? గుర్తు తెచ్చుకోండి. హౌస్‌ బయట కాదు, హౌస్‌ లోపల హెల్తీ గేమ్‌ ఆడండి, మీరు మీ ఫ్రెండ్స్‌తో గేమ్‌ ఆడొచ్చు, మీ ఫ్రెండ్‌ మిమ్మల్ని సేవ్‌ చేయకపోతే అడగొచ్చు, ఏంటో మరి..’ అని సన్నీకి చురకలు అంటించింది శివ జ్యోతి. దీనిపై నెటిజన్లు తీవ్రంగా విరుచుపడుతున్నారు.

సన్నీ ఫ్యాన్స్ అయితే ఓ రేంజిలో విరుచుకుపడుతున్నారు. జ్యోతక్క.. షణ్ముఖ్, సిరి గురించి మాట్లాడటంలో తప్పలేదు .. సిరి సన్నీ క్యారెక్టర్ ను బ్యాడ్ చేయడంలో తప్పులేదు.. కాకపోతే.. మీరు కేవలం కొన్ని పాయింట్లు పట్టుకొని వేలాడకండి.. ప్రతీ పాయింట్ గురించి మాట్లాడాలి అంటూ చురకలంటించారు. క్యారెక్టర్ జడ్జ్ చేయొద్దు అంటూ వీడియోలు పెట్టావ్.. కానీ ఇప్పుడు మీరు చేస్తున్నది ఏంటి..? అంటూ సన్నీ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మీరు బిగ్ బాస్ కు వెళ్లినప్పుడు అస్సలు గేమ్ ఆడారా.. ఊరికే ఏడవడం తప్పా ఏం చేతకాలేదు.. అలాంటిది మీరు గేమ్ గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందంటూ.. ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago