యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ జశ్వంత్ తాగిన మత్తులో ఇటీవల ప్రమాదం చేసిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సోషల్ మీడియా స్టార్ కారు రోడ్ నంబరు 10 , జూబ్లీహిల్స్ లో కంట్రోల్ తప్పి, ఎదురుగా వస్తున్న రెండు కార్లను , రెండు బైక్ లను సైతం ఢీకొట్టింది. ఈ యాక్సిడెంట్ లో రోడ్ పై వెళ్తున్న ఒక వ్యక్తి కి బలం గా దెబ్బలు తగిలాయి. ఇంకా ఈ పరిస్థితికి కారణం అయిన షణ్ముఖ్ జశ్వంత్‌కు పోలీసులు బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ చేశారు. ఆ ఫలితాల్లో రీడింగ్ 170 రాగ, సెక్షన్ 337, 279 కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇక్కడ వరకు అందరికి తెలిసిన తాజాగా షణ్ముఖ్ చేసిన పనితో పోలీసులు సీరియస్ గా ఉన్నారట.
ప్రమాదం తర్వాత పోలీసులు ఇచ్చే కౌన్సిలింగ్‌కు షణ్ముఖ్ జశ్వంత్ అటెండ్ అవ్వకపోవడమే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తుంది. ఇక ప్రమాదం తర్వాత సాధారణంగా కుటుంబ సభ్యుల సమక్షంలో ఎవరికైనా కౌన్సిలింగ్ ఇవ్వడం పరిపాటి. సెలబ్రిటీస్ సైతం ఇందుకు మినహాయింపు కాదు. అందులో భాగంగానే షణ్ముఖ్‌కు తన తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ ఇచ్చేందుకు సిద్ధం అయ్యి, అందుకోసం షణ్ముఖ్ ని పిలిచారు. కానీ వారి విన్నపాన్ని ఏ మాత్రం పట్టించుకోని షణ్ముఖ్ కౌన్సిలింగ్ హాజరు కాలేదట.
అంతే కాదు షణ్ముఖ్‌ను అరెస్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు అతడి ప్రవర్తన సైతం పోలీసుల ఆగ్రహానికి మరొక కారణం అని తెలుస్తుంది. ఆ సమయంలో పలువురు పెద్దలతో ఫోన్లు చేయించాలని షణ్ముఖ్ భావించగా అందుకు పోలీసులు ఒప్పుకోలేదు. ఇక ఏవైరికి ఏమి కానప్పుడు ఎందుకు ఇంత అతిగా ప్రవర్తిస్తున్నారంటూ షణ్ముఖ్ వితండవాదం చేయడం సైతం అందరు వీడియోల్లో చూసారు. ఇది ఇప్పటికి వైరల్ గా కొనసాగుతుంది. మరి ఇప్పటికైనా తన ప్రవర్తన మార్చుకొని షణ్ముఖ్ జస్వంత్ పోలీసుల కౌన్సిలింగ్ వస్తాడా, రాడా అనే విషయం వేచి చూడాలి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…