Tag Archives: shotting

Mega Star Chiranjeevi: షూటింగ్ లో గాయపడిన మెగాస్టార్ చిరంజీవి… నొప్పిని లెక్క చేయకుండా షూటింగ్లో బిజీ!

Mega Star Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ తర్వాత వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే వరుస సినిమా షూటింగులతో బిజీగా గడుపుతున్న చిరు తన 154 వ చిత్రాన్ని బాబి దర్శకత్వంలో చేస్తున్నారు. ఈ క్రమంలోనే గతవారం ఈ సినిమాలో పలు యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించారు.

Mega Star Chiranjeevi: షూటింగ్ లో గాయపడిన మెగాస్టార్ చిరంజీవి… నొప్పిని లెక్క చేయకుండా షూటింగ్లో బిజీ!

ఈ యాక్షన్ సన్నివేశాలలో భాగంగా మెగాస్టార్ చిరంజీవి గుర్రంపై సవారి చేయాల్సి వచ్చింది.అయితే జూనియర్ ఆర్టిస్ట్ తప్పిదం వల్ల చిరంజీవి ఏనుగు పై నుంచి దిగే సమయంలో కాలు జారి కింద పడ్డారు. దీంతో ఆయన కాలు బెణికి కాస్త నొప్పి చేసినట్లు సమాచారం.

Mega Star Chiranjeevi: షూటింగ్ లో గాయపడిన మెగాస్టార్ చిరంజీవి… నొప్పిని లెక్క చేయకుండా షూటింగ్లో బిజీ!

ఇలా షూటింగ్లో ఏదైనా ప్రమాదం జరిగితే సాధారణంగా హీరోలు షూటింగ్ నుంచి వెళ్లిపోయి కాస్త విరామం తీసుకుంటారు.కానీ చిరంజీవి మాత్రం తన కాలు బెనకి తీవ్రమైన నొప్పి కలిగించినా షూటింగ్ నుంచి విరామం తీసుకోకుండా తన కారణంగా ఆ రోజు షెడ్యూల్ డిస్టర్బ్ కాకూడదని నొప్పిని భరిస్తూ చిరంజీవి షూటింగ్ లో పాల్గొన్నట్లు తెలుస్తోంది.

నిర్మాతలకు నష్టం రాకూడదు…

ఈ విధంగా చిరంజీవి ఈ వయసులో కూడా డూప్ లేకుండా ఇలాంటి సన్నివేశాల్లో నటిస్తూ గాయపడిన, ఏ మాత్రం విశ్రాంతి తీసుకోకుండా తన కారణంగా నిర్మాతలకు నష్టం రాకూడదని భావించి నొప్పిని భరిస్తూ షూటింగ్ పూర్తి చేశారని తెలియడంతో ఎంతో మంది నెటిజన్లు అందుకేగా ఆయనని మెగాస్టార్ అని పిలిచేది అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇక ఇక చిరంజీవి ఈ సినిమాలో మాత్రమే కాకుండా గాడ్ ఫాదర్, భోళా శంకర్ సినిమాలో కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే.

రియల్ రివాల్వర్ తో షూటింగ్ స్పాట్ కు మెగస్టార్..! ఎందుకో తెలుసా..?

భారత చలన చిత్రం రంగంలో మెగాస్టార్ చిరంజీవికి ప్రత్యేక స్థానం ఉంది. తన డ్యాన్సులతో, ఫైట్లతో మరే హీరోకు లేని క్రేజ్ చిరంజీవి సొంతం.. అయితే అలాంటి చిరంజీవి ఒకసారి రియల్ గన్ తో షూటింగ్ వెళ్లాడు. దీంతో షూటింగ్ సబ్బంది ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. అసలు షూటింగ్ కు నిజమైన రివాల్వర్ తో వెళ్లాల్సిన అవసరం ఎమొచ్చింది. ఎందుకు వెళ్లాల్సి వచ్చిందని తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.. 

1978లో అనామకుడిగా వచ్చిన చిరంజీవి తన పట్టుదలతో మెగాస్టార్ చిరంజీవిగా ఎదిగాడు. అప్పటి వరకు ఓమూస ధోరణిలో ఉన్న టాలీవుడ్ కు డ్యాన్సులు, బ్రెక్ డ్యాన్సులు, ఫైట్లను కొత్తగా పరిచయం చేసింది చిరంజీవే. తన మ్యానరిజం, కామెడీ టైమింగ్ తో తెలుగు యువతను ఉర్రూతలూపాడు. సూపర్ స్టార్ రజినీ వంటి వారే చిరంజీవి డ్యాన్సులకు ఫిదా అయిపోయి కంగారు పడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయంటే అతిశయోక్తికాదు. 

ఎన్టీఆర్, ఎఎన్నార్, క్రిష్ణ, క్రిష్ణంరాజు, శోభన్ బాబు వంటి వారు వెండితెరను ఏలుతున్న సమయంలో అనామకుడిగా వచ్చి.. తన పెర్మామెన్స్ తో ఎలాంటి గాడ్ ఫాదర్ లేకుండా.. తనకంటూ ప్రత్యేకను చాటుకున్నాడు. డైరెక్టర్లకు చిరంజీవి నటన నచ్చి వరసగా సినిమాల్లో బుక్ చేసుకున్నారు. ఏకంగా ఏడాదికి 10 సినిమాలు చేస్తూ సుప్రీం హీరోగా.. మెగాస్టార్ గా ఎదిగారు.

అయితే జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన చంటబ్బాయ్ సినిమా చిరంజీవీ కెరీర్ లో ఆల్ టైం క్లాసిక్. ఆ సినిమాలో చిరంజీవి డిటెక్టివ్ పాత్రలో ఇరగదీశాడు. చిరంజీవి కామెడీ టైమింగ్ కు ప్రేక్షకులు పడిపడి నవ్వారు. కాగా ఈ సినిమాకు ఒకసారి చిరంజీవి నిజమైన రివాల్వర్ తీసుకురావడం చర్చనీయాంశం అయింది. అప్పుడప్పుడే హీరోగా ఎదుగుతున్న చిరంజీవి తన రక్షణ కోసం రివాల్వర్ కోసం ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. చిరంజీవికి రివాల్వర్ లైసెన్స్ ఇచ్చింది.

కాగా ఈ సినిమాలో ఓ సన్నివేశం చిత్రీకరణలో భాగంగా చిరంజీవి రివాల్వర్ తో కనిపించాల్సి ఉంది. అయితే ఇలాంటి సన్నివేశాల్లో డూప్ గన్స్ వాడుతారు. అయితే చిరంజీవి మాత్రం తన దగ్గర ఉన్న నిజమైన రివాల్వర్ తో షూటింగ్ వెళ్లాడు. నిజమైన గన్ కావడంతో అత్యంత జాగ్రత్తతో సీన్ షూట్ చేశారు డైరెక్టర్ జంధ్యాల.

సర్జరీ చేయించుకున్న మహేశ్ బాబు.. ‘సర్కారు వారి పాట’ షూటింగ్ కు బ్రేక్..!

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబుకు సర్జరీ అయింది. గత కొన్ని రోజులుగా మెకాలినొప్పితో బాధపడుతున్న ఆయనకు స్పెయిన్ లో ఆపరేషన్ జరిగింది. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ విశ్రాంతి తీసుకుంటున్నారు. అతడితో పాటు మహేశ్ సతీమణి నమ్రతా కూడా ఉన్నట్లు సమాచారం. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కూడా అతడు వెల్లడించారు.

త్వరలో తాను సర్జరీకి వెళ్తున్నానని అందుకే ‘సర్కారు వారి పాట’ సినిమా షూటింగ్ కు బ్రేక్ ఇచ్చానని చెప్పాడు. ఈ నాలుగు రోజులు కుటుంబంతో ఎక్కువ టైం స్పెండ్ చేయాలని నిర్ణయించుకున్నట్లు కూడా తెలిపాడు. అంతేకాదు.. తన సినిమాలను మొదట కుటుంబసభ్యులతో కలిసి చూస్తానని.. సినిమాలో ఫైట్ సీన్లంటే తన కూతురుకు ఇష్టం ఉండదని.. అటువంటి సమయంలో ఆమె అక్కడ నుంచి లేచి వెళ్లిపోతుందని అని కూడా చెప్పాడు.

ఇక ప్రస్తుతం అతడికి సర్జరీ పూర్తయినట్లు వార్తలు వస్తున్నాయి. మహేష్ పూర్తిగా కోలుకున్న తర్వాత మిగతా షూటింగ్ లో పాల్గొంటారని తెలుస్తోంది. సర్కారు వారి పాట సినిమాకు పరశురాం దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో మహేశ్ కు జోడీగా కీర్తి సురేష్ నటిస్తోంది.

ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, వీడియోలు సినిమాపై అంచనాలను పెంచాయి. దాదాపు ఈ సినిమా షూటింగ్ పూర్తయిందని.. ఇంకా ముఖ్యమైన కొన్ని సన్నివేశాలు చిత్రీకరించాల్సి ఉందని మూవీ సభ్యులు తెలుపుతున్నారు. ఈ సినిమా తర్వాత మహేశ్ రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమాలో నటించనున్నారు.

‘మా అన్నయ్య’ సినిమా షూటింగ్ ఆలస్యం.. మరో సినిమాకు శ్రీకారం చుట్టి విజయవంతం అయిన రాజశేఖర్..?

రవి రాజా పినిశెట్టి దర్శకత్వంలో 2000 సంవత్సరంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం మా అన్నయ్య. ఈ చిత్రంలో బ్రహ్మాజీ, వినీత్, దీప్తి భట్నాగర్ మరియు నాసర్ సహాయక పాత్రల్లో డా. రాజశేఖర్, మీనా హీరో హీరోయిన్లుగా నటించారు. దీనికి ఎస్ఏ రాజ్ కుమార్ సంగీత దర్శకుడిగా పనిచేశాడు. ఈ సినిమాలోని పాటలు అన్నీ విపరీతంగా హిట్ అయ్యాయి.

ఈ చిత్రం తమిళ చిత్రం వనతైపోలా (2000)కి రీమేక్. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది. ఇక రీమేక్ సినిమాల విషయానికి వస్తే.. ఎక్కువగా టాలీవుడ్ లో విక్టరీ వెంటకేష్, పవన్ కళ్యాణ్ లు ముందు వరుసలో ఉంటారు. కానీ ఈసారి అయితే వనతైపోలా తమిళ చిత్రానికి అప్పట్లో ఫుల్ రైట్స్ తీసుకున్నారు రాజశేఖర్. అయితే మొదట ఈ సినిమాకు వేరే దర్శకుడు అనుకున్నారట. కానీ సెట్స్ పైకి వెళ్లే సరికి దర్శకుడు మారాడని తెలిసింది.

ఈ సమయంలో ఈ సినిమా షూటింగ్ వాయిదా పడుకుంటూ వచ్చిందట. ఈ గ్యాప్ లో రాజశేఖర్ మనసున్న మారాజు సినిమాను కంప్లీట్ చేశారు. దీనికి ముత్యాల సుబ్బయ్య దర్శకత్వం వహించారు. ఈ సినిమా కూడా రిమేక్ కావడంతో .. ఇక మా అన్నయ్య సినిమాను తెర కెక్కించేందుకు రవిరాజా పనిశెట్టి దగ్గరకు వచ్చాడట.

అలా సినిమా శరవేగంగా షూటింగ్ కంప్లీట్ చేసుకొని ప్రేక్షకుల ముందుకు డిసెంబర్ 1, 2000లో వచ్చింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ఇదే సినిమాను కన్నడంలో కూడా రిమేక్ చేస్తే.. అక్కడ కూడా బ్లాక్ బాస్టర్ అయింది. నేటికి ఈసినిమా విడుదలై 21 ఏళ్లు పూర్తయింది. ఇలా ఈ సినిమా మూడు భాషల్లో సూపర్ హిట్ కొట్టేసింది.

చిరంజీవిని రోజంతా ఎండలో నిలబెట్టారు.. కారణం ఏంటో తెలుసా.?

తెలుగు సినీ పరిశ్రమలో అందరికీ ఆదర్శం, స్పూర్తి మెగస్టార్ చిరంజీవి. అతడు ఈ స్థాయికి చేరడానికి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రస్తుతం మేము ఏవైతే విలువలు పాటిస్తున్నామో అవన్నీ మాకు చిరంజీవి నుంచి వచ్చినవే అని ఎన్నో సార్లు మెగా హీరోలు చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ఎన్నో ఇబ్బందులు, ఒడిదొడుకులు ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చారు.

ఆయన కొన్ని సినిమాల్లో ఎవరికీ చెప్పలేని కష్టాలను ఎదుర్కొన్నాడు. అలా ఓ సినిమాలో చిరంజీవి ఇబ్బంది పడ్డ విషయాలను చిరంజీవితో క‌ల‌సి న‌టించిన తుల‌సి శివ‌మణి ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఇక ఆమె ఏం చెప్పారంటే.. చిరంజీవి కెరీర్ మొదట్లో ఆయ‌న‌కు మంచి పేరును తీసుకొచ్చిన సినిమా ‘కోత‌ల రాయుడు’.

ఈ సినిమా శ్రీ చిరిత చిత్ర నిర్మాణ సంస్థలో తమ్మారెడ్డి భరద్వాజ్ నిర్మాతగా కే. వాసు దర్శకత్వంలో రూపొందింది. ఇందులో చిరంజీవి గ్రే షేడ్ న‌టించారు. ఇక ఈ సినిమాలో తులసి కీలక పాత్రలో నటించారు. ఈ సినిమా షూటింగ్ సమయంలో ఓ రోజు అతడు షూటింగ్ కు లేట్ గా వచ్చాడు. దానికి ఆ సినిమా నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ కు కోపం వచ్చింది. దానికి అతడు ఇచ్చిన పనిష్ మెంట్ ఎంటో తెలుసా.. రోజంతా ఎండలో నిలబడమన్నారట.

దానికి చిరంజీవి ఏ మాత్రం సహనం కోల్పోకుండా.. తన వైపే తప్పు ఉందని దానిని స్వీకరించారు. ఈ విషయాన్ని విన్న తులసి షాకయ్యారని ఆమె తెలిపారు. ఇలా అతడు తన కెరీర్ లో ఎన్నో కష్టాలను ఎదుర్కొని ప్రస్తుతం ఈ స్థితిలో ఉన్నారంటూ చెప్పుకొచ్చారు. ఇక ఆ రోజు షూటింగ్ లో పాల్గొనకుండా.. ఇంటికి వెళ్లి మరుసటి రోజు షూటింగ్ కు హాజరయ్యాడని చెప్పారు. ఇక ఆ ఘటనను అతడు ఏ రోజు మనసులో పెట్టుకోలేదంటూ చెప్పారు. ఇలా ఆమె ఈ విషయాన్ని గుర్తు చేసుకుంటూ నవ్వుకున్నారు.