Tag Archives: Shraddha Das

Bigg Boss Jaswanth: పూజకి పనికి రాని పువ్వు..బిగ్ బాస్ జెస్సీ పరువు తీసిన హీరోయిన్..?

Bigg Boss Jaswanth: బిగ్ బాస్ రియాల్టీ షో ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన జెస్సీ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం జెస్సి ఢీ షోలో సందడి చేస్తున్నాడు. ప్రస్తుతం కొనసాగుతున్న ఢీ 15 లో జెస్సీ టీం లీడర్ గా సందడి చేస్తున్నాడు. అయితే తాజాగా ఈ షో లో జెస్సీ ని దారుణంగా అవమానించారా. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది.

ఈవారం ప్రసారం కాబోయే ఢీ షో కి సంబంధించిన ప్రోమో ఇటీవల విడుదల అయింది. ఈ ప్రోమోలో యాంకర్ ప్రదీప్, జడ్జ్ లు శేఖర్ మాష్టర్, హీరోయిన్ శ్రద్దా దాస్ జెస్సిని దారుణంగా అవమానించారు. దీంతో జెస్సీ కి ఏం మాట్లాడాలో తెలియక ముఖం చిన్నబుచ్చుకున్నాడు. అసలు విషయం ఏమిటంటే.. ఈ ప్రోమో లో జెస్సీ యాంకర్ దివ్యని ఫ్లటింగ్ చేస్తూ ఎంట్రీ ఇస్తాడు.

దివ్యకి బాగా చలిగా ఉందని చెప్పటంతో వెచ్చదనం ఇవ్వడం కోసం ఆమెకి దగ్గరగా ఉన్నానని జెస్సీ ఫన్నీగా చెబుతాడు. దీంతో శేఖర్ మాస్టర్ రీయాక్ట్ అవుతూ.. ఆమెకి వెచ్చదనం రావాలంటే ముందు మనలో వేడి ఉండాలి అని జెస్సీ పరువు తీసే ప్రయత్నం చేశాడు. ఆ తరువాత ప్రదీప్ మాట్లాడుతూ.. ఆరుగురు పతివ్రతలు సినిమాలో ఒకాయన కూర్చుని ఏడుస్తుంటాడు.. నువ్వు ఆ టైపా అని అంటాడు.దీంతో జెస్సీ ఉక్రోషంగా ఏమనుకుంటున్నారు నా గురించి.. నేనేంటో మీకు తెలియదు అని అంటాడు .

Bigg Boss Jaswanth: వల్గర్ కామెంట్స్ మంచిది కాదు..

జెస్సీ అలా అనగానే శ్రద్దా దాస్ స్పందిస్తూ.. నాకు తెలుసు అని అందుకుంటుంది. దీంతో జెస్సీ.. ఆ చెప్పండి అని ఆమె తనని పోగుడుతుందేమో అని ఆశగా చూస్తాడు. కానీ శ్రద్దా మాత్రం.. నువ్వు పూజకి పనికిరాని పువ్వు అంట కదా అంటూ దారుణంగా జెస్సీ పరువు తీసింది. దీంతో జెస్సీ పరువు పోయినట్టుగా అనిపించి ముఖం తిప్పుకున్నాడు. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా..ప్రదీప్,శేఖర్ మాస్టర్, శ్రద్ధాదాస్ తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక వ్యక్తి మీద సెటైర్లు వేయొచ్చు కానీ.. అందరి ముందు ఇలా ఒక వ్యక్తిపై వల్గర్ కామెంట్స్ మంచిది కాదని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Shraddha Das: హీరోయిన్ శ్రద్దా దాస్ ను ముద్దడిగిన హైపర్ ఆది… షాక్ ఇచ్చిన శ్రద్ధాదాస్?

Shraddha Das: బుల్లితెర కార్యక్రమాల ద్వారా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు కమెడియన్ హైపర్ ఆది. కెరియర్ మొదట్లో జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ప్రేక్షకులను సందడి చేసిన హైపర్ ఆది అనంతరం ఢీ కార్యక్రమం ద్వారా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేశారు. ప్రస్తుతం శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమంలో కూడా సందడి చేస్తున్నారు.

ఈ విధంగా వారానికి మూడు నాలుగు రోజులపాటు బుల్లితెర కార్యక్రమాల ద్వారా ప్రేక్షకులను సందడి చేస్తున్న హైపర్ ఆది వేసే పంచ్ డైలాగులు కొన్నిసార్లు పెద్ద ఎత్తున వివాదాలకు కారణం అవుతుంటాయి. ఈ క్రమంలోనే తాజాగా ఢీ కార్యక్రమంలో భాగంగా హైపర్ ఆది నోటిదూల కారణంగా ఏకంగా చెంప దెబ్బలు తినాల్సిన పరిస్థితి ఎదురైంది.

హైపర్ ఆది వేదిక పైకి వచ్చిన నటి శ్రద్ధదాస్ ను తనకు ముద్దు కావాలని అడిగారు.ఈ మాట విన్నటువంటి శ్రద్ధాదాస్ హిందీలో మాట్లాడుతూ అసలు మీరేం మాట్లాడుతున్నారో అర్థం అవుతుందా అని ప్రశ్నించగా తనకు ఒకటి కాదు రెండు ముద్దులు కావాలని అడిగారు. ఇదే సమయంలోనే యాంకర్ ప్రదీప్ కాస్త మసాలా జోడించారు.ఇక హైపర్ ఆది తనకు ముద్దు కావాలని కళ్ళు మూసుకొని శ్రద్ధాదాస్ వైపు బుగ్గ పెట్టగా ఒక్కసారిగా ఈమె తన రెండు చేతులతో హైపర్ ఆది చెంప చెల్లుమనిపించింది.

Shraddha Das: హైపర్ ఆదినీ ఆటాడుకున్న శ్రద్ధదాస్..

ఈ విధంగా శ్రద్ధాదాస్ దెబ్బకి ఖంగు తిన్నటువంటి హైపర్ ఆది ముందు అంటే తప్ప అని చెప్పింది ఎవడ్రా అంటూ యాంకర్ ప్రదీప్ ఉద్దేశించి మాట్లాడారు.ముద్దు అంటే గూసా అని అనీ మాస్టర్ చెప్పగా అరగంట గూసా అని ఆది శ్రద్ధాదాస్ తో అన్నారు. ఆ తర్వాత శ్రద్ధాదాస్ ఆది చాతిపై వరుసగా పంచ్ లు ఇవ్వడం అందరికి నవ్వు తెప్పించింది. మొత్తానికి హైపర్ ఆది శ్రద్ధాదాస్ నుంచి ముద్దు కావాలని ఆశపడగా ఆమె మాత్రం తన స్టైల్ లో ఆది చెంప చెల్లుమనిపించింది.

Shraddha Das: ఢీ డాన్స్ షో కోసం శ్రద్ధాదాస్ రెమ్యూనరేషన్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?

Shraddha Das: తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్యక్రమాలలో ఢీ డాన్స్ షో ఒకటి.ఈ కార్యక్రమం గత కొన్ని సంవత్సరాల నుంచి ప్రసారమవుతూ ఎంతో మంది డాన్సర్లను పరిచయం చేసింది. ఇలా బుల్లితెరపై ప్రసారమవుతు దూసుకుపోతున్న ఈ కార్యక్రమానికి ఎంతోమంది న్యాయ నిర్ణయితలుగా వ్యవహరించారు.

ప్రస్తుతం ఈ కార్యక్రమానికి జడ్జిగా వ్యవహరిస్తున్న వారిలో హాట్ బ్యూటీ శ్రద్ధాదాస్ ఒకరు.శ్రద్ధాదాస్ నటిగా పలు సినిమాలలో నటించి ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నారు. ఈ క్రమంలోని ఈమె ఈ కార్యక్రమానికి న్యాయ నిర్ణయితగా వ్యవహరిస్తున్నారు.

ఇకపోతే ఈ కార్యక్రమానికి ఒక హీరోయిన్ న్యాయ నిర్ణీతగా వ్యవహరిస్తుండడంతో ఈమె రెమ్యూనరేషన్ గురించి ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అసలు శ్రద్ధాదాస్ ఒక్కో ఎపిసోడ్ కు ఏ రేంజ్ లో రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారనే విషయం గురించి చర్చలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే సోషల్ మీడియా కథనాల ప్రకారం శ్రద్ధాదాస్ ఒక్కో ఎపిసోడ్ కు సుమారు 3.5 లక్షల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

Shraddha Das: భారీ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న శ్రద్ధాదాస్..

ఇకపోతే ఈ కార్యక్రమానికి సంబంధించి రెండు ఎపిసోడ్లకు ఒకరోజు షూటింగ్ జరుగుతుందని ఇలా ఈమె రెండు ఎపిసోడ్లకు ఏడు లక్షల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారని తెలుస్తుంది. వెండితెరపై ఈమెకు అవకాశాలు లేకపోయినా బుల్లితెరపై ఇలా పలు కార్యక్రమాలకు న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తూ బాగానే సంపాదిస్తున్నారని, ఇలా బుల్లితెర అభిమానులను కూడా సంపాదించుకున్నారని తెలుస్తోంది.