Shraddha Das: బుల్లితెర కార్యక్రమాల ద్వారా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు కమెడియన్ హైపర్ ఆది. కెరియర్ మొదట్లో జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ప్రేక్షకులను సందడి చేసిన హైపర్ ఆది అనంతరం ఢీ కార్యక్రమం ద్వారా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేశారు. ప్రస్తుతం శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమంలో కూడా సందడి చేస్తున్నారు.
ఈ విధంగా వారానికి మూడు నాలుగు రోజులపాటు బుల్లితెర కార్యక్రమాల ద్వారా ప్రేక్షకులను సందడి చేస్తున్న హైపర్ ఆది వేసే పంచ్ డైలాగులు కొన్నిసార్లు పెద్ద ఎత్తున వివాదాలకు కారణం అవుతుంటాయి. ఈ క్రమంలోనే తాజాగా ఢీ కార్యక్రమంలో భాగంగా హైపర్ ఆది నోటిదూల కారణంగా ఏకంగా చెంప దెబ్బలు తినాల్సిన పరిస్థితి ఎదురైంది.
హైపర్ ఆది వేదిక పైకి వచ్చిన నటి శ్రద్ధదాస్ ను తనకు ముద్దు కావాలని అడిగారు.ఈ మాట విన్నటువంటి శ్రద్ధాదాస్ హిందీలో మాట్లాడుతూ అసలు మీరేం మాట్లాడుతున్నారో అర్థం అవుతుందా అని ప్రశ్నించగా తనకు ఒకటి కాదు రెండు ముద్దులు కావాలని అడిగారు. ఇదే సమయంలోనే యాంకర్ ప్రదీప్ కాస్త మసాలా జోడించారు.ఇక హైపర్ ఆది తనకు ముద్దు కావాలని కళ్ళు మూసుకొని శ్రద్ధాదాస్ వైపు బుగ్గ పెట్టగా ఒక్కసారిగా ఈమె తన రెండు చేతులతో హైపర్ ఆది చెంప చెల్లుమనిపించింది.
ఈ విధంగా శ్రద్ధాదాస్ దెబ్బకి ఖంగు తిన్నటువంటి హైపర్ ఆది ముందు అంటే తప్ప అని చెప్పింది ఎవడ్రా అంటూ యాంకర్ ప్రదీప్ ఉద్దేశించి మాట్లాడారు.ముద్దు అంటే గూసా అని అనీ మాస్టర్ చెప్పగా అరగంట గూసా అని ఆది శ్రద్ధాదాస్ తో అన్నారు. ఆ తర్వాత శ్రద్ధాదాస్ ఆది చాతిపై వరుసగా పంచ్ లు ఇవ్వడం అందరికి నవ్వు తెప్పించింది. మొత్తానికి హైపర్ ఆది శ్రద్ధాదాస్ నుంచి ముద్దు కావాలని ఆశపడగా ఆమె మాత్రం తన స్టైల్ లో ఆది చెంప చెల్లుమనిపించింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…