Bigg Boss Jaswanth: బిగ్ బాస్ రియాల్టీ షో ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన జెస్సీ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం జెస్సి ఢీ షోలో సందడి చేస్తున్నాడు. ప్రస్తుతం కొనసాగుతున్న ఢీ 15 లో జెస్సీ టీం లీడర్ గా సందడి చేస్తున్నాడు. అయితే తాజాగా ఈ షో లో జెస్సీ ని దారుణంగా అవమానించారా. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది.
ఈవారం ప్రసారం కాబోయే ఢీ షో కి సంబంధించిన ప్రోమో ఇటీవల విడుదల అయింది. ఈ ప్రోమోలో యాంకర్ ప్రదీప్, జడ్జ్ లు శేఖర్ మాష్టర్, హీరోయిన్ శ్రద్దా దాస్ జెస్సిని దారుణంగా అవమానించారు. దీంతో జెస్సీ కి ఏం మాట్లాడాలో తెలియక ముఖం చిన్నబుచ్చుకున్నాడు. అసలు విషయం ఏమిటంటే.. ఈ ప్రోమో లో జెస్సీ యాంకర్ దివ్యని ఫ్లటింగ్ చేస్తూ ఎంట్రీ ఇస్తాడు.
దివ్యకి బాగా చలిగా ఉందని చెప్పటంతో వెచ్చదనం ఇవ్వడం కోసం ఆమెకి దగ్గరగా ఉన్నానని జెస్సీ ఫన్నీగా చెబుతాడు. దీంతో శేఖర్ మాస్టర్ రీయాక్ట్ అవుతూ.. ఆమెకి వెచ్చదనం రావాలంటే ముందు మనలో వేడి ఉండాలి అని జెస్సీ పరువు తీసే ప్రయత్నం చేశాడు. ఆ తరువాత ప్రదీప్ మాట్లాడుతూ.. ఆరుగురు పతివ్రతలు సినిమాలో ఒకాయన కూర్చుని ఏడుస్తుంటాడు.. నువ్వు ఆ టైపా అని అంటాడు.దీంతో జెస్సీ ఉక్రోషంగా ఏమనుకుంటున్నారు నా గురించి.. నేనేంటో మీకు తెలియదు అని అంటాడు .
జెస్సీ అలా అనగానే శ్రద్దా దాస్ స్పందిస్తూ.. నాకు తెలుసు అని అందుకుంటుంది. దీంతో జెస్సీ.. ఆ చెప్పండి అని ఆమె తనని పోగుడుతుందేమో అని ఆశగా చూస్తాడు. కానీ శ్రద్దా మాత్రం.. నువ్వు పూజకి పనికిరాని పువ్వు అంట కదా అంటూ దారుణంగా జెస్సీ పరువు తీసింది. దీంతో జెస్సీ పరువు పోయినట్టుగా అనిపించి ముఖం తిప్పుకున్నాడు. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా..ప్రదీప్,శేఖర్ మాస్టర్, శ్రద్ధాదాస్ తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక వ్యక్తి మీద సెటైర్లు వేయొచ్చు కానీ.. అందరి ముందు ఇలా ఒక వ్యక్తిపై వల్గర్ కామెంట్స్ మంచిది కాదని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…