Indraja: నాని, కీర్తి సురేష్ జంటగా నటించిన దసరా సినిమా ఇటీవల విడుదలై ఘన విజయం సాధించిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో పాటల కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా ఈ సినిమాలోని పాటలే వినిపిస్తున్నాయి.ముఖ్యంగా చమ్కీల అంగిలేసి అనే పాటకి సెలబ్రిటీలు సైతం రీల్స్ చేస్తున్నారు.
ఇక ఈ సినిమాలో పెళ్లి కూతురిగా చీరలో కీర్తి వేసిన మాస్ డ్యాన్స్ కూడా నెట్టింట వైరల్ అవుతోంది. కీర్తీ చేసిన ఈ మాస్ డాన్స్ ని రీల్స్ చేస్తున్నారు. తాజాగా సీనియర్ నటి ఇంద్రజ కూడా ఆ మాస్ బీట్ కి అదిరిపోయే స్టెప్పులు వేసింది. శ్రీదేవి డ్రామా కంపెనీ అనే షోలో ఇంద్రజ జడ్జిగా వ్యవహరిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ షోలో ఇంద్రజ తన జడ్జిమెంట్ తో పాటు అప్పుడప్పుడు డాన్స్ తో కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.
ఒకప్పుడు హీరోయిన్గా మంచి గుర్తింపు పొందిన ఇంద్రజ ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అమ్మ, అత్తా వంటి పాత్రలలో నటిస్తూ ప్రేక్షకులకు మరింత చేరువయ్యింది. అంతేకాకుండా ఈటీవీలో ప్రసారమవుతున్న టీవీ షో లో జడ్జిగా వ్యవహరిస్తూ సందడి చేస్తోంది. కొంతకాలం జబర్దస్త్ షోలో జడ్జిగా వ్యవహరించి తన పంచులతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఇంద్రజ ప్రస్తుతం శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో కూడా జడ్జిగా వ్యవహరిస్తోంది.
తాజాగా ఈ షో కి సంబంధించిన ప్రోమో విడుదల అయింది. ఇక ఈ షోలో దసరా సినిమాలోని కీర్తి సురేష్ చేసిన ఆ మాస్ స్టెప్పులను తనదైన శైలిలో వేసి ఇంద్రజ రచ్చ చేసింది. ఈ ప్రోమోలో ఇంద్రజ చేసిన మాస్ డాన్స్ హైలెట్గా నిలిచింది. ఈ వయసులో కూడా ఫుల్ ఎనర్జీ తో ఇంద్రజ వేసిన మాస్ స్టెప్పులు చూసి ఆడియన్స్ షాక్ అవుతున్నారు. కీర్తి సురేష్ కి ఏ మాత్రం తీసిపోలేదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…