Actor Raj Kumar : రాజ్ కుమార్ ను తెలుగులో మొదట పరిచయం చేసింది దాసరి నారాయణ రావు గారు. అయన సినిమా ‘అమ్మ రాజీనామా’లో హీరోగా రాజ్ కుమార్ నటించారు. అయినా రాజ్ కుమార్ ను తెలుగు ఇండస్ట్రీ పెద్దగా పట్టించుకోలేదు కానీ కన్నడలో మాత్రం హీరోగా సక్సెస్ చూసారు. తెలుగులో మాత్రం సినిమాల్లో కంటే సీరియల్స్ తో బాగా పేరు తెచ్చుకున్నారు రాజ్ కుమార్. ఈటీవీలో విధి, జెమినీ లో పవిత్ర బంధం వంటి హిట్ సీరియల్స్ లో హీరోగా చేసారు. దాదాపు 12 సంవత్సరాలు బ్రేక్ లేకుండా సీరియల్స్ చేసిన ఆయన తెలుగులో హీరోగా హిట్ కొట్టాలనే కోరికతో ‘బారిష్టర్ శంకర్ నారాయణ’ అనే సినిమాలో నటించారు. ఈ సినిమాకు రాజ్ కుమార్ భార్య నిర్మాత అయితే ఫేమస్ కోరియోగ్రాఫర్ తార మాస్టర్ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో రాజ్ కుమార్ డ్యూయల్ రోల్ లో చేసారు. ఈ సినిమా తెలుగులో ఎవరూ పట్టించుకోకపోయినా కన్నడ లో మాత్రం సూపర్ హిట్ అయింది.
కుటుంబం గురించి… కొడుకులు ఏంచేస్తున్నారంటే…
రాజ్ కుమార్ గారు తెలుగు వారే అయినా తెలుగులో కంటే ఇతర భాష సినిమాల్లో ఎక్కువగా సక్సెస్ అయ్యారు. ఆయన తండ్రి టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ అవడం వల్ల ఎక్కువ ఊర్లు తిరిగారు. ఇక రాజ్ కుమార్ గారికి ఒక తమ్ముడు, ఒక చెల్లి కాగా చెల్లి క్యాన్సర్ తో మరణించగా తమ్ముడు ఆక్సిడెంట్ లో మరణించారట. అయితే వాళ్ళ పిల్లలు అందరూ హ్యాపీగా కలిసున్నాం అంటూ చెప్పారు రాజ్ కుమార్. ఇక రాజ్ కుమార్ గారికి ఇద్దరు అబ్బాయిలు.
మొదటి అబ్బాయి పవన్ కుమార్ ఎంబిఏ పూర్తి చేసి డిజిటల్ మార్కెటింగ్ వైపు అడుగులు వేయగా రెండో అబ్బాయి ఆదిత్య లా చదివి ప్రస్తుతం సుప్రీం కోర్ట్ న్యాయవాది వద్ద జూనియర్ లాయర్ గా ఉన్నారట. ఇక పెద్దబ్బాయి కి సినిమాల్లో రావాలని ఇప్పుడు కొంచం ఆసక్తి కలిగిందని అయితే నేను నా భార్య దానికి పూర్తి వ్యతిరేకం అంటూ చెప్పారు రాజ్ కుమార్. ఇండస్ట్రీలో అవమానాలు ఉంటాయి సన్మానాలు ఉంటాయి, వాటాన్నింటినీ ఎదుర్కోగలగాలి అందుకే వద్దనిపించింది అంటూ తెలిపారు.
కాకినాడ జిల్లాలోని తుని మండలం సీహెచ్ అగ్రహారంలో అదృశ్యమైన రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి కేసు రోజురోజుకూ మరింత ఉత్కంఠ రేపుతోంది.…
భారతీయ సంప్రదాయ వైద్యంలో వేప చెట్టుకు ప్రత్యేక స్థానం ఉంది. తరతరాలుగా వేప ఆకులు, పువ్వులు, బెరడు, గింజలను అనేక…
దేశవ్యాప్తంగా ఇటీవల సిజేరియన్ ప్రసవాలకు సంబంధించిన కొన్ని ఘటనలు చర్చనీయాంశంగా మారాయి. రాజస్థాన్‌లోని కొన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవం అనంతరం…
జూన్ నెలలో గ్రహాల సంచారాలు జ్యోతిష్య పరంగా ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ముఖ్యంగా జూన్ 17న చంద్రుడు కర్కాటక రాశిలోకి…
తమిళ సినీ దిగ్గజ దర్శకుడు భారతీరాజా మరణంతో ఆయన సినీ ప్రయాణానికి సంబంధించిన అనేక ఆసక్తికర అంశాలు మరోసారి వెలుగులోకి…
పుదుచ్చేరిలోని ఒక ప్రముఖ హోటల్‌లో జరిగిన సంఘటన వినియోగదారుల హక్కులపై మరోసారి చర్చకు దారి తీసింది. చికెన్ బిర్యానీ ఆర్డర్…