Sitara: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గారాల పట్టి సితార గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సితార ఇంత చిన్న వయసులోనే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నారు. ఎప్పటికప్పుడు తన డాన్స్ వీడియోలతో పాటు తన వెకేషన్ కి సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు.
ఇలా సితార సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ అన్ని విషయాలను అభిమానులతో పంచుకోవడం వల్ల ఈమెకు సోషల్ మీడియాలో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందనే చెప్పాలి. ఇకపోతే తాజాగా సోషల్ మీడియా వేదికగా సితార తనకు ప్రముఖ బాలీవుడ్ నటి ఆలియా భట్ నుంచి వచ్చిన సర్ప్రైజ్ గిఫ్ట్ గురించి వెల్లడించారు.
అలియా భట్ ఈ మధ్యకాలంలో టాలీవుడ్ సెలబ్రిటీలకు వారి పిల్లలకు పెద్ద ఎత్తున దుస్తులను పంపిస్తూ సర్ప్రైజ్ చేస్తున్నారు.గత కొద్ది రోజుల క్రితం ఎన్టీఆర్ పిల్లలకు దుస్తులు పంపిన అలియా భట్ ఉపాసనకు కూడా ప్రెగ్నెన్సీ సమయంలో తనకు అవసరమయ్యే దుస్తులను పంపించారు. అయితే తాజాగా సితారకు సైతం దుస్తులను పంపిస్తూ తనని సర్ప్రైజ్ చేశారు.
ఈ క్రమంలోనే అలియా భట్ పంపిన ఈ దుస్తులను ఈమె సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ తనకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేయడమే కాకుండా తన కుటుంబంలో తనని భాగం చేసుకున్నందుకు ధన్యవాదాలు అంటూ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…