Prabhas: టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి సినిమా తర్వాత పాన్ ఇండియా స్టార్ హీరోగా మారిపోయారు.ఈ సినిమా తర్వాత ఈయనకు భారీ స్థాయిలో క్రేజ్ ఏర్పడటమే కాకుండా ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉండే ఈయనకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.
మిగతా హీరోలతో పోలిస్తే సోషల్ మీడియాలో ప్రభాస్ పెద్దగా యాక్టివ్ గా ఉండరు అయినప్పటికీ ఈయనకి ఇన్స్టాగ్రామ్ లో ఏకంగా 9.4 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. ఇలా మిలియన్ సంఖ్యలో ఫాలోవర్స్ ను సొంతం చేసుకున్న ప్రభాస్ ఇన్ స్టాలో ఎంతమందిని ఫాలో అవుతున్నారు వారు ఎవరు అనే విషయానికి వస్తే… ప్రభాస్ కేవలం 15 మందిని మాత్రమే ఇన్ స్టాలో ఫాలో అవుతున్నారు.
ఇలా ఈయన ఫాలో అయ్యే 15 మంది ఎవరు అంటే పెదనాన్న కృష్ణంరాజు డైరెక్టర్ సందీప్ వంగా. అలాగే ఆదిపురుష్ ఫేమ్ సన్నీ సింగ్, బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్. ఫిల్మ్ యాక్షన్ యూనిట్ ఎడిటర్ DB బ్రాకమోంటెస్, నాగ్ అశ్విన్, రాధాకృష్ణ, శ్రుతి హాసన్, అమితాబ్ బచ్చన్, ఓంరౌత్, దీపికా పదుకొణే, నటి భాగ్య శ్రీ, పూజా హెగ్డే, శ్రద్ధా కపూర్, సాహో డైరెక్టర్ సుజిత్ ఉన్నారు.
ఇలా ప్రభాస్ ఫాలో అయ్యే 15 మంది కూడా ఇతర భాష సెలబ్రిటీలు కావడం గమనార్హం.ఇక ఈయనకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో గోపీచంద్ ఎంతో ప్రాణ స్నేహితులు అలాగే ఈయన రామ్ చరణ్ ఎన్టీఆర్ అల్లు అర్జున్ వంటి వారితో కూడా చాలా సన్నిహితంగా ఉన్నప్పటికీ తెలుగు సెలబ్రిటీలను ఫాలో కాకపోవడం గమనార్హం. చివరికి తనకు ఇంత క్రేజ్ ఇచ్చిన రాజమౌళిని కూడా ఫాలో కాకుండా పూర్తిగా తెలుగువారిని దూరం పెట్టారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…