Tag Archives: Sidharth Malhotra

Kiara Advani -Sidharth Malhotra: ఘనంగా కియారా, సిద్ధార్థ్ మల్హోత్రా వివాహ వేడుక… వైరల్ అవుతున్న ఫోటోలు!

Kiara Advani -Sidharth Malhotra: బాలీవుడ్ నటీనటులు కియారా, సిద్ధార్థ్ మల్హోత్రా గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న విషయం మనకు తెలిసిందే. ఇలా ప్రేమలో ఉన్నటువంటి ఈ జంట ఎట్టకేలకు వివాహ బంధంతో ఒకటయ్యారు. ఫిబ్రవరి 7వ తేదీ సాయంత్రం వీరి వివాహం పలువురు సినీ సెలబ్రిటీలు, ప్రముఖ వ్యక్తుల సమక్షంలో ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది.

గత మూడు రోజుల నుంచి కియారా వివాహ వేడుకలను
రాజస్థాన్‌లోని సూర్యగఢ్ ప్యాలస్‌లో ఎంతో ఘనంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే మంగళవారం సాయంత్రం వివాహం ఎంతో ఘనంగా జరిగింది.ఇక ఈమె పెళ్లి వేడుకలకు సంబంధించిన ఫోటోలను బయటకు రాకుండా జాగ్రత్త పడ్డారు. అయితే పెళ్లి పూర్తి అయిన అనంతరం నటి కియారా అద్వానీ తన పెళ్లి ఫోటోలను ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు.

Kiara Advani -Sidharth Malhotra:మీ ఆశీస్సులు కావాలి…


ఇలా పెళ్లి ఫోటోలను షేర్ చేస్తూ ఇప్పుడు మా పర్మినెంట్ బుకింగ్ పూర్తి అయింది అంటూ పెళ్లి ఫోటోలకు క్యాప్షన్ జోడించారు. ఇక కొత్త జీవితం ప్రారంభించబోతున్న తమకు మీ అందరి ఆశీస్సులు కావాలి అంటూ ఈమె కోరుకున్నారు.ప్రస్తుతం ఈమె షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఎంతో మంది సినీ సెలబ్రిటీలు ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా వీరి పెళ్లి ఫోటోలు పై ఓ లుక్ వేసేయండి.

Kiara Advani: డిసెంబర్ లో పెళ్లి పీటలు ఎక్కనున్న నటి కియారా అద్వానీ.. వరుడు అతనేనా?

Kiara Advani: మహేష్ బాబు కొరటాల కాంబినేషన్లో వచ్చిన భరత్ అనే నేను సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు నటి కియారా అద్వానీ.ఇలా మొదటి సినిమాతోనే ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె అనంతరం రామ్ చరణ్ తో వినయ విధేయ రామ సినిమాలో నటించారు.ఈ సినిమా పెద్దగా సక్సెస్ కాకపోవడంతో ఈ అమ్మడు తెలుగు ప్రేక్షకులకు దూరమై బాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస సినిమాలలో నటిస్తూ అగ్రతారగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.

ఇలా బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నటువంటి కియారా అద్వానీ బాలీవుడ్ నటుడు సిద్ధార్థ మల్హోత్రాతో గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న విషయం మనకు తెలిసిందే. అయితే త్వరలోనే ఈ జంట పెళ్లి బంధంతో ఒకటి కానున్నారనే వార్తలు బి టౌన్ మీడియాలో చెక్కర్లు కొడుతున్నాయి. గతంలో కాఫీ విత్ కరణ్ టాక్ షోలో పాల్గొన్నటువంటి వీరిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నామని పరోక్షంగా వెల్లడించిన సంగతి మనకు తెలిసిందే.

ఈ క్రమంలోనే ఈ జంట డిసెంబర్ నెలలో చండీగఢ్ లోని ది ఒబెరాయ్ సుఖ్విలాస్ స్పా అండ్ రిసార్ట్స్ లో ఎంతో ఘనంగా చేసుకోనున్నట్లు సమాచారం. ఇక ఈ వివాహానికి కేవలం సినీ సెలబ్రిటీలు మాత్రమే హాజరుకానున్నట్లు తెలుస్తోంది. ముందుగా వీరు వివాహాన్ని గోవాలో సిద్ధార్థ మల్హోత్రా కుటుంబ సాంప్రదాయాల ప్రకారం జరపాలని భావించినప్పటికీ కొన్ని కారణాల వల్ల వీరి వివాహాన్ని చండీగడ్ కి మార్చినట్టు వెల్లడించారు.

Kiara Advani: శరవేగంగా జరుగుతున్న పెళ్లి పనులు..

ఇప్పటికే వీరి వివాహానికి సంబంధించిన పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయని సమాచారం. ఇలా వీరి పెళ్లి గురించి సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నప్పటికీ ఈ విషయం గురించి ఏ విధమైనటువంటి అధికారిక ప్రకటన తెలియజేయలేదు. ఇక కీయారా సినిమాల విషయానికి వస్తే ఈమె రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే.