Kiara Advani: మహేష్ బాబు కొరటాల కాంబినేషన్లో వచ్చిన భరత్ అనే నేను సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు నటి కియారా అద్వానీ.ఇలా మొదటి సినిమాతోనే ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె అనంతరం రామ్ చరణ్ తో వినయ విధేయ రామ సినిమాలో నటించారు.ఈ సినిమా పెద్దగా సక్సెస్ కాకపోవడంతో ఈ అమ్మడు తెలుగు ప్రేక్షకులకు దూరమై బాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస సినిమాలలో నటిస్తూ అగ్రతారగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.
ఇలా బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నటువంటి కియారా అద్వానీ బాలీవుడ్ నటుడు సిద్ధార్థ మల్హోత్రాతో గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న విషయం మనకు తెలిసిందే. అయితే త్వరలోనే ఈ జంట పెళ్లి బంధంతో ఒకటి కానున్నారనే వార్తలు బి టౌన్ మీడియాలో చెక్కర్లు కొడుతున్నాయి. గతంలో కాఫీ విత్ కరణ్ టాక్ షోలో పాల్గొన్నటువంటి వీరిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నామని పరోక్షంగా వెల్లడించిన సంగతి మనకు తెలిసిందే.
ఈ క్రమంలోనే ఈ జంట డిసెంబర్ నెలలో చండీగఢ్ లోని ది ఒబెరాయ్ సుఖ్విలాస్ స్పా అండ్ రిసార్ట్స్ లో ఎంతో ఘనంగా చేసుకోనున్నట్లు సమాచారం. ఇక ఈ వివాహానికి కేవలం సినీ సెలబ్రిటీలు మాత్రమే హాజరుకానున్నట్లు తెలుస్తోంది. ముందుగా వీరు వివాహాన్ని గోవాలో సిద్ధార్థ మల్హోత్రా కుటుంబ సాంప్రదాయాల ప్రకారం జరపాలని భావించినప్పటికీ కొన్ని కారణాల వల్ల వీరి వివాహాన్ని చండీగడ్ కి మార్చినట్టు వెల్లడించారు.
ఇప్పటికే వీరి వివాహానికి సంబంధించిన పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయని సమాచారం. ఇలా వీరి పెళ్లి గురించి సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నప్పటికీ ఈ విషయం గురించి ఏ విధమైనటువంటి అధికారిక ప్రకటన తెలియజేయలేదు. ఇక కీయారా సినిమాల విషయానికి వస్తే ఈమె రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…