Kiara Advani -Sidharth Malhotra: బాలీవుడ్ నటీనటులు కియారా, సిద్ధార్థ్ మల్హోత్రా గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న విషయం మనకు తెలిసిందే. ఇలా ప్రేమలో ఉన్నటువంటి ఈ జంట ఎట్టకేలకు వివాహ బంధంతో ఒకటయ్యారు. ఫిబ్రవరి 7వ తేదీ సాయంత్రం వీరి వివాహం పలువురు సినీ సెలబ్రిటీలు, ప్రముఖ వ్యక్తుల సమక్షంలో ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది.
గత మూడు రోజుల నుంచి కియారా వివాహ వేడుకలను
రాజస్థాన్‌లోని సూర్యగఢ్ ప్యాలస్‌లో ఎంతో ఘనంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే మంగళవారం సాయంత్రం వివాహం ఎంతో ఘనంగా జరిగింది.ఇక ఈమె పెళ్లి వేడుకలకు సంబంధించిన ఫోటోలను బయటకు రాకుండా జాగ్రత్త పడ్డారు. అయితే పెళ్లి పూర్తి అయిన అనంతరం నటి కియారా అద్వానీ తన పెళ్లి ఫోటోలను ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు.
ఇలా పెళ్లి ఫోటోలను షేర్ చేస్తూ ఇప్పుడు మా పర్మినెంట్ బుకింగ్ పూర్తి అయింది అంటూ పెళ్లి ఫోటోలకు క్యాప్షన్ జోడించారు. ఇక కొత్త జీవితం ప్రారంభించబోతున్న తమకు మీ అందరి ఆశీస్సులు కావాలి అంటూ ఈమె కోరుకున్నారు.ప్రస్తుతం ఈమె షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఎంతో మంది సినీ సెలబ్రిటీలు ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా వీరి పెళ్లి ఫోటోలు పై ఓ లుక్ వేసేయండి.
మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో ఎన్నో బ్లాక్‌బస్టర్ చిత్రాలు వచ్చినా, ప్రేక్షకుల మదిలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న సినిమాల్లో ‘పసివాడి ప్రాణం’…
చూపు లేకపోయినా సంగీతంతో కోట్ల హృదయాలను గెలుచుకున్న గాయని వైకమ్ విజయలక్ష్మి జీవితం నిజంగా ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. చిన్నప్పటి…
మహాభారతం భారతీయ ఇతిహాసాల్లో అత్యంత ప్రాముఖ్యత కలిగిన మహాగ్రంథంగా గుర్తింపు పొందింది. ధర్మం, అధర్మం మధ్య జరిగిన కురుక్షేత్ర యుద్ధం…
భారతీయ సంప్రదాయంలో రత్నాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. అందులోనూ ముత్యాలు ఎప్పటినుంచో పవిత్రత, ప్రశాంతత, శుభానికి ప్రతీకగా భావించబడుతున్నాయి. తెల్లని…
వివాహం అనేది ఇద్దరి మనుషుల మధ్య బంధమే కాదు, వారి ఆలోచనలు, స్వభావాలు, జీవన విధానాల కలయిక కూడా. వేద…
హిందూ సాంప్రదాయంలో కొన్ని మొక్కలకు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంటుంది. వాటిలో పారిజాతం మొక్కకు ఎంతో విశిష్ట స్థానం ఉంది.…