Samantha: తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్రతారగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న సమంత గత కొంతకాలంగా మాయోసైటిసిస్ వ్యాధితో బాధపడుతూ ఇండస్ట్రీకి దూరంగా ఉన్నటువంటి విషయం మనకు తెలిసిందే. ఇలా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నటువంటి సమంత ఇప్పుడిప్పుడే కోలుకోవడంతో తిరిగి సినిమా షూటింగ్లలో పాల్గొనడానికి సిద్ధమవుతున్నారు.
ఇలా ఒక్కో సినిమాకు కోట్లలో రెమ్యూనరేషన్ తీసుకుంటూ ఇండస్ట్రీలో బిజీగా గడుపుతున్నటువంటి సమంత తాజాగా సోషల్ మీడియా వేదికగా ఒక ఫోటోని షేర్ చేశారు. అయితే ఇది మాత్రం సముద్రపు వ్యూ కనిపించేలా ఉన్నటువంటి ఇంటి బాల్కనీలో ఫోటో దిగినట్టు తెలుస్తోంది. దీంతో సమంత కొత్త ఇంటిని కొనుగోలు చేస్తుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
సమంత సన్నిహితుల సమాచారం మేరకు సమంత తన సొంత రాష్ట్రమైన చెన్నైలో కాకుండా అలాగే రెండు తెలుగు రాష్ట్రాలలో కాకుండా ముంబైలో కొత్త ఇంటిని కొనుగోలు చేసినట్టు సమాచారం.ఇలా మూడు పడకల గది కలిగి ఉన్నటువంటి ఇంటిని సమంత ఏకంగా 15 కోట్ల రూపాయలు ఖర్చు చేసి కొనుగోలు చేశారని తెలుస్తుంది.
ఈ విధంగా సమంత కొత్త ఇంటిని కొనుగోలు చేసి ఆ ఇంటిలో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిందని భావిస్తున్నారు.ఇక ఈమె ప్రస్తుతం తెలుగు తమిళ సినిమాలతో పాటు హిందీ సినిమాలు వెబ్ సిరీస్ లకు కూడా కమిట్ అవుతున్నారు. దీంతో షూటింగ్ ముంబై వెళ్లాల్సి ఉంటుంది కనుక ముంబైలో కొత్త ఇంటిని కొనుగోలు చేశారని తెలుస్తోంది.ఇక ఈమె సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం తెలుగులో ఖుషి సినిమాలో నటిస్తున్నారు. అయితే ఈ సినిమా సమంత కారణంగానే వాయిదా పడిన త్వరలోనే తిరిగి షూటింగ్ పనులను ప్రారంభించుకోనుంది.
ఇటీవలి కాలంలో బరువు తగ్గడం, షుగర్ నియంత్రణ కోసం వాడుతున్న GLP-1 తరహా మందులపై చర్చ పెరుగుతోంది. వైద్యుల సలహాతో…
ఉదయపు అల్పాహారంలో ఇడ్లీ, దోసె, ఉప్మా వంటి వంటకాలకు తోడు తప్పనిసరిగా కనిపించే వంటకం కొబ్బరి చట్నీ. సాధారణంగా రుచికోసం…
వేసవి మొదలవుతూనే ఆహారంలో మార్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం, నీటి కొరత రాకుండా జాగ్రత్తపడటం ఈ…
కొబ్బరికాయ కొనడం చాలా సాధారణమైన పని అనిపించినా, చాలా సార్లు అది మనకు నిరాశ కలిగిస్తుంది. బయట నుంచి బాగానే…
ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న కొద్దీ సహజమైన ఆహారాలపై ప్రజల దృష్టి మరింతగా పడుతోంది. అలాంటి వాటిలో “అల్ఫాల్ఫా” అనే మొక్క,…
ఇటీవలి కాలంలో ఆధ్యాత్మిక అంశాలపై ఆసక్తి పెరుగుతున్న కొద్దీ “స్పిరిట్ యానిమల్” అనే భావన కూడా సోషల్ మీడియాలో, యువతలో…