Vijay Devarakonda: సాధారణంగా మనం పులులు లేదా పాములు చూసినప్పుడు భయంతో ఆమడ దూరం పరుగులు పెడతాము.అయితే విజయ్ దేవరకొండ మాత్రం పులులు పాములు సింహాలతో పెద్ద ఎత్తున సాహసాలు చేస్తూ ఫోటోలకు ఫోజులిచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
విజయ్ దేవరకొండ నటిస్తున్న ఖుషి సినిమా సమంత కారణంగా వాయిదా పడిన విషయం మనకు తెలిసిందే.ఇలా సినిమా షూటింగులు లేకపోవడంతో విజయ్ దేవరకొండ హాలిడే వెకేషన్ వెళ్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రమంలోని తన ఫ్యామిలీతో కలిసి ఈయన దుబాయ్ వెకేషన్ లో ఉన్న విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే అక్కడ ఓ జూ పార్క్ ను సందర్శించారు.
నిజానికి తనకు పాములంటే ఎంతో భయం అని చెప్పిన విజయ్ దేవరకొండ ఏకంగా పెద్దపెద్ద కొండచిలువలను మెడలో వేసుకొని ఫోటోలకు ఫోజులిచ్చారు. అదేవిధంగా పులులు సింహపు పిల్లలకు పాలు తాపిస్తూ ఈయన ఫోటోలు దిగారు. ఇలా క్రూర మృగాలతో సరదాగా గడుపుతూ పెద్ద ఎత్తున సాహసం చేశారని చెప్పాలి.విజయ్ దేవరకొండ ఇందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఒక్కసారిగా వైరల్ అయ్యాయి.
ఇక ఈ ఫోటోలను షేర్ చేసిన ఈయన తనకు పాములంటే ఎంతో భయం అని అయితే పాములతో ఇలా సరదాగా గడపడానికి కృషి చేసినటువంటి సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే సింహం పులులతో మాట్లాడటానికి సహకరించిన జూ సిబ్బందికి కృతజ్ఞతలు తెలుపుతూ ఇది తన జీవితంలో ఒక తీపి జ్ఞాపకమని ఈ ఫోటోలను షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట చెక్కర్లు కొడుతున్నాయి.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…