Producer Avula Giri : డిస్ట్రిబ్యూటర్ గా ఖుషి, నరసింహనాయుడు వంటి సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేసిన ఆవుల గిరి ఆపైన నిర్మాతగా మారి పలు సినిమాలను నిర్మించారు. శ్రీఆంజనేయం, కలుసుకోవాలని, నా అల్లుడు, ఆంధ్రవాలా, సై వంటి సినిమాలను నిర్మించిన ఆయన ప్రస్తుతం సినిమా నిర్మాణంకి సినిమాలకు దూరంగా ఉన్నారు. వివాదాలకు దూరంగా సినిమాలను నిర్మిస్తూ డిస్ట్రిబ్యూటర్ నుండి నిర్మాతగా ఏదిగిన ఆవుల గిరి కొన్ని కాంబినేషన్స్ ఎలా ఆగిపోయాయో, ఇండస్ట్రీలో ఎలాంటి పాలిటిక్స్ జరుగుతాయో ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తెలిపారు.
సుకుమార్ వల్ల నాకు ఎన్టీఆర్ కు చెడింది…
ఎన్టీఆర్ తో ‘నా అల్లుడు’ సినిమా నిర్మించిన ఆవుల గిరికి ఎన్టీఆర్ తో మంచి సన్నిహిత్యం ఉంది. అయితే వాళ్లిద్దరి కాంబినేషన్లో హిట్లు లేవు. ఇక ‘ఆంధ్రవాలా’ సినిమా కూడా నిరాశ మిగిల్చింది. అయినా ఎన్టీఆర్ తో సన్నిహితుంగానే ఉన్న ఆవుల గిరి ఆ తరువాత ఎన్టీఆర్ కాంబినేషన్ లో సినిమా చేయలేదు. ఎన్టీఆర్ కు తనకు మధ్య సుకుమార్ అనే వ్యక్తి దూరం పెంచాడని ఆవుల గిరి కామెంట్స్ చేసారు. సుకుమార్ అంటే మన డైరెక్టర్ సుకుమార్ కాదు. ఎన్టీఆర్ దగ్గర ఒకప్పుడు మేనేజర్ గా పనిచేసిన వ్యక్తి సుకుమార్.
అతని వల్ల మానసికంగా ఇబ్బందులు పడ్డానంటూ ఆవుల గిరి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. తన వల్ల ఎంత టార్చర్ అనుభవించానంటే ఏకంగా కారు ఆక్సిడెంట్ జరిగింది అతని గురించి ఆలోచిస్తూ, ఒకరకంగా ఇండస్ట్రీ మీద విరక్తి పుట్టడానికి ఇలాంటివే కారణాలు అంటూ తెలిపారు. అయితే ఆ సుకుమార్ తనకే కాకుండా కొడాలి నాని ఎన్టీఆర్ కి కూడా పెట్టాడని, నన్ను ఎన్టీఆర్ ను అందరినీ ముంచాడు. ఎన్టీఆర్ ను ఎవరినీ కలవనివ్వకుండా చేసాడు దీంతో అందరూ కలిసి అతన్ని కొట్టారు. ఇక చివరికి విషయం తెలిసి ఎన్టీఆర్ అతన్ని దూరం పెట్టాడు. మళ్ళీ నేను ఎన్టీఆర్ మాట్లాడుకున్నాం అంటూ చెప్పారు.
తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…
ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…
తెలంగాణలో క్రికెట్‌కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…