Movie News

Samantha: అప్పటివరకు శాకుంతలం రిలీజ్ కష్టమే… అసహనం వ్యక్తం చేస్తున్న అభిమానులు!

Samantha: సమంత తెలుగు సినీ ఇండస్ట్రీలో అగ్రతారక ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఈమె గత ఏడాది యశోద సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకున్నారు. అయితే సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం శాకుంతలం.

ఈ సినిమా షూటింగ్ పూర్తి అయ్యి దాదాపు ఏడాదిన్నర పూర్తి కావస్తోంది. అయినప్పటికీ ఇంకా ఈ సినిమా విడుదలకు నోచుకోలేదు. అయితే ఫిబ్రవరి 17వ తేదీ సినిమా విడుదల కానుందని చిత్ర బృందం ప్రకటించినప్పటికీ కొన్ని కారణాల వల్ల వాయిదా వేశారు. అయితే మరొక విడుదల తేదీని మాత్రం ఇప్పటివరకు ప్రకటించలేదు.

తాజాగా ఈ సినిమా గురించి వస్తున్న కథనాల ప్రకారం శకుంతలం సినిమా మే ఆఖరి వరకు విడుదలయ్యే అవకాశాలు లేవని తెలుస్తోంది.ఇలా ఈ సినిమా వరుసగా వాయిదాలు పడుతూ రావడంతో సమంత అభిమానులు ఈ సినిమా విషయంలో కాస్త అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాకు గుణశేఖర్ కుమార్తె నీలిమ దిల్ రాజు ఇద్దరు నిర్మాతలు కావడం విశేషం.

Samantha:శాకుంతలం విషయంలో క్లారిటీ ఇవ్వాలి…

ఇలా దిల్ రాజు ఈ సినిమా విషయంలో ఎందుకు తరచూ వాయిదాలు వేస్తున్నారో తెలియని పరిస్థితి నెలకొంది. ఇలా పలుమార్లు సినిమా వాయిదా పడటంతో సినిమాపై నెగెటివిటీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సమంత అభిమానులు ఆందోళన చెందుతున్నారు. మరి ఈ విషయంపై సమంత స్పందించి సరైన కారణాలను కూడా వెల్లడించాల్సిన పరిస్థితి ఉంది.ఇక సమంత గత కొంతకాలంగా మాయోసైటీసిస్ వ్యాధితో బాధపడుతూ సినిమా షూటింగ్లకు కూడా దూరంగా ఉంది వెంటనే ఈమె తిరిగే షూటింగ్లలో పాల్గొనాలని అభిమానులు కూడా కోరుకుంటున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago