Shiva Jyothi: తీన్మార్ వార్తలు ద్వారా ఎంతో ఫేమస్ అయినటువంటి శివ జ్యోతి అనంతరం బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా మరింత ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు.ఇలా బిగ్ బాస్ కార్యక్రమం తర్వాత ఈమె సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉన్నారు.
అలాగే ఒక యూట్యూబ్ ఛానల్ కూడా ప్రారంభించి నిత్యం ఎన్నో వీడియోలను యూట్యూబ్ ద్వారా షేర్ చేస్తూ పెద్ద ఎత్తున అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇక ఈ మధ్యకాలంలో శివ జ్యోతి వరుసగా కొత్త ఇల్లు కొనుగోలు చేయడం ఖరీదైన కారు కొనుగోలు చేయడం వంటి వీడియోలను కూడా షేర్ చేశారు. అయితే తన సొంత గ్రామంలో తన అత్తయ్య వారి కోసం ఈమె కొత్త ఇంటిని కడుతున్న విషయాన్ని కూడా తెలిపారు.
గత కొద్ది రోజుల క్రితం తన కొత్త ఇంట్లో చేసినటువంటి ఇంటీరియర్ డిజైన్ మొత్తం అప్పుడే పాడైపోయింది అంటూ తన బాధను మొత్తం ఒక వీడియో రూపంలో వ్యక్తం చేశారు. అయితే పాడైపోయిన ఇంటీరియర్ డిజైన్ ను తిరిగి బాగు చేయించి నూతన గృహప్రవేశం చేస్తున్నట్టు తెలుస్తుంది.ఈ క్రమంలోనే నూతన గృహప్రవేశానికి సంబంధించిన వీడియోని కూడా అభిమానులతో పంచుకున్నారు.
ఇలా నూతన గృహప్రవేశ కార్యక్రమంలో భాగంగా శివ జ్యోతి దంపతుల సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేశారు. అనంతరం అక్కడికి వచ్చిన ముత్తైదువులకు తాంబూలాలు ఇచ్చి వారి గ్రామంలో ఉన్నటువంటి ఆలయాలకు వెళ్లి స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు.ఇలా శివ జ్యోతి నూతన గృహప్రవేశానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…