Tag Archives: sleep

వారి పక్కన పడుకుంటే ఇక అంతే.. చిన్మయి షాకింగ్ కామెంట్స్!

అటు సింగింగ్ , డబ్బింగ్ లో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చకున్నారు చిన్మయి. అంతేకాదు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అభిమానులతో ముచ్చటిస్తుంటారు. ఆమె ముఖ్యంగా మీటూ ఉద్యమంలో యాక్టివ్ గా ఉంటూ.. ఎంతో మందిపై ఆమె ఆరోపణలు చేశారు. సినీ పరిశ్రమలో ఆమె ఎదుర్కొన్న లైంగిక వేధింపులను ధైర్యంగా బయటపెట్టింది చిన్మయి.

ఆమెపై సోషల్ మీడియాలో వస్తున్న ట్రోలింగ్ లపై కూడా అంతే స్థాయిలో సమాధానం చెబుతోంది చిన్నయి. ఇక నాగచైతన్య, సమంత పై వస్తున్న వార్తలపై మాట్లాడింది. వారి విడాకుల గురించి ప్రత్యక్షంగా మాట్లాడకుండా.. ఇటీవల శాకుంతలం సినిమా నిర్మాత నీలిమ గుణ సమంత గురించి చెప్పిన విషయాలను ఆమె మెచ్చుకుంది. సమంత గురించి అన్ని నిజాలే చెప్పారని.. థ్యాంక్స్ అంటూ నీలిమ గుణను చిన్మయి అభినందించింది.

ఇటీవల నీలిమ శాకుంతలం సినిమాకు సమంతను సంప్రదించినప్పుడు తాను సినిమాలు చేయకూడదని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారన్నారు. ఫ్యామిలీ ప్లానింగ్‌లో ఉన్నానని సమంత చెప్పింది. కానీ దీని కథ విని నచ్చడంతో కొన్ని కండీషన్లతో ఒప్పుకుందని ఆమె తెలిపినట్లు నీలిమ అన్నారు. నీలిమ ఈ మాటలు బయటకు వచ్చి మాట్లాడటంతో చిన్మయి నీలిమ గుణను అభినందించారు.

తర్వాత ఆమె ఓ ఫన్నీ వీడియోను పోస్ట్ చేశారు. అందులో గురక పెట్టే వారి పక్కన పడుకుంటే ఎలా ఉంటుందో చూపించారు. అందులో ఓ కుక్క గురక పెట్టి నిద్రపోతుండగా.. పక్కనే ఉన్న పిల్లి ఒక్కసారిగా ఉలిక్కిపడింది. దీంతో ఇలా గురక పెట్టే వారి పక్కన పడుకుంటే కష్టమని సింగర్ చిన్మయి పరోక్షంగా చెప్పారు.

ఆ రోజు రాత్రంతా నిద్ర లేకుండా గడిపిన పవన్ కళ్యాణ్..!

మెగాహీరో సాయిధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురయ్యారనే వార్త తెలియడంతో అందరికంటే ముందుగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన మేనల్లుడుని పరామర్శించిన సంగతి మనకు తెలిసిందే.దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో కలసి ఆస్పత్రికి చేరుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సాయి ధరమ్ తేజ్ ను పరామర్శించిన అనంతరం తన బాగోగుల గురించి కుటుంబ సభ్యులకు వెల్లడించారు.

తన మేనల్లుడికి ఏ విధమైనటువంటి ప్రమాదం లేదని అపోలో వైద్యులు తెలిపేవరకు ఆయనకు నిద్ర పట్టడం లేదని ఆ రోజు రాత్రంతా అలాగే ఆలోచిస్తూ కంగారుపడుతూ కూర్చున్నారని పవన్ కళ్యాణ్ సన్నిహితులు వెల్లడించారు.సాయి ధరమ్ తేజ్ పవన్ కళ్యాణ్ కి మేనల్లుడు అయినప్పటికీ వీరిద్దరి మధ్య ఎంతో సన్నిహిత సంబంధం ఉంది.

పవన్ కళ్యాణ్ తో సాయి ధరమ్ తేజ్ కు ఉన్న అనుబంధం గురించి సాయి తేజ్ పలు సందర్భాలలో వివరించారు. సాయి తేజ్ ప్రమాదానికి గురైన వెంటనే గతంలో తన మామయ్య తనకు బండి నడిపే విషయంలో ఎలాంటి జాగ్రత్తలు చెప్పారు అనే విషయాన్ని ఓ ఇంటర్వ్యూ సందర్భంగా చెప్పారు ఆ వీడియోను ప్రస్తుతం సోషల్ మీడియాలో మెగా అభిమానులు వైరల్ చేయడం మనకు తెలిసిందే.

సాయి తేజ్ కు బైక్ నడపడం అంటే ఎంతో ఇష్టం ఉండడం చేత మొట్టమొదటిసారిగా తన సంపాదనతో కొన్న కొత్త బండి తీసుకుని తన మామయ్య దగ్గరికి వెళ్తే హెల్మెట్ కొన్నావా అనే ప్రశ్నను అడిగినట్టు సాయి తేజ్ ఓ సందర్భంలో వెల్లడించారు. ఇలా వీరిద్దరి మధ్య ఎంతో అనుబంధం ఉండటం చేత సాయి తేజ్ ప్రమాదానికి గురయ్యారన్న వార్త పవన్ కళ్యాణ్ ఎంతో కలచివేసిందని, అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించే వరకు తనకు నిద్రపట్టడం లేదని సాయి ధరమ్ ప్రమాదానికి గురైన రోజంతా పవన్ కళ్యాణ్ నిద్రలేకుండా కంగారుపడుతున్నారని సన్నిహితవర్గాలు తెలియజేశారు.

వామ్మో.. ఇతను ఏడాదిలో 300 రోజులు నిద్రలోనే ఉంటాడు.. కారణం ఏమిటంటే?

సాధారణంగా ప్రతి రోజూ మనం ఎనిమిది గంటల పాటు నిద్ర పోతే ఎంతో ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపవచ్చు. ఎనిమిది గంటలకు మించి నిద్రపోతే తీవ్రమైన తలనొప్పి మనల్ని వెంటాడుతుంది.అయితే మనం పురాణాలలో కుంభకర్ణుడు ఆరు నెలల పాటు నిద్రపోతే మరో ఆరు నెలల పాటు మేల్కొని ఉంటాడు అనే సంగతి వినే ఉంటాము. కానీ రాజస్థాన్ కు చెందిన ఓ వ్యక్తి మాత్రం కుంభకర్ణుడిని మించి నిద్రపోవడం విశేషం. ఈ వ్యక్తి ఏడాదిలో సుమారుగా 300 రోజులు నిద్రలోనే ఉంటాడు. ఈ విధంగా నిద్ర పోవడానికి కారణం ఏమిటి అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం..

రాజస్థాన్‌‌లోని నగౌర్‌కు చెందిన పుర్కారామ్ అనే వ్యక్తి వయస్సు 42 ఏళ్లు. భద్వా గ్రామంలో నివసిస్తున్నాడు. ఇతను ఏడాదిలో 300 రోజులు నిద్రలోనే ఉంటాడు. పుర్కారామ్ ఒక్కసారి నిద్రలోకి వెళ్ళాడు అంటే ఇక 25 రోజుల పాటు ఎంత లేపినా నిద్రనుంచి లేవడు. ఈ విధంగా నెలలో కేవలం అయిదు రోజులు మాత్రమే మెలకువలో ఉంటాడు. అయితే ఇతను సరదాగా ఇలా నిద్రపోతున్నాడు అంటే మనం పొరపాటు పడినట్లే.

పుర్కారామ్ ఈ విధంగా నిద్ర పోవడానికి గల కారణం అతనిని వెంటాడుతున్న “యాక్సిస్ హైపర్సోమ్నియా” అనే అరుదైన వ్యాధే కారణం. అయితే తన ఆర్థిక పరిస్థితుల కారణంగా చికిత్సకు దూరంగా ఉంటున్నాడు. ఈ క్రమంలోనే తమ జీవనాధారం కోసం ఒక కిరాణా అంగడి నిర్వహిస్తున్న ఇతను కేవలం ఐదు రోజులు మాత్రమే షాపును తెరుస్తున్నాడు.

ఈ సందర్భంగా పుర్కారామ్ భార్య లక్ష్మీదేవి మాట్లాడుతూ.. గత కొంతకాలం వరకు రోజుకు 15 గంటలు మాత్రమే నిద్ర పోయేవాడు. వయసు పెరిగేకొద్దీ అతడు నిద్రపోవడం కూడా పెరుగుతోందని తెలిపింది. అతడు నిద్రలో ఉండగానే అతడికి స్నానం చేయించి ఆహారం తినపెడతామని లక్ష్మీదేవి తెలిపారు. ఒక్కసారి నిద్ర లోకి వెళ్ళాడంటే ఎంత ప్రయత్నించినా లేవడని నిద్ర లేవగానే తీవ్రమైన తలనొప్పితో బాధపడతారని ఈ సందర్భంగా భార్య లక్ష్మీదేవి తెలిపారు.

బరువు పెరుగుతున్నారా… నిద్రపోయే ముందు పొరపాటున కూడా ఈ పనులు చేయకండి?

ప్రస్తుత కాలంలో చాలామంది ఎదుర్కొంటున్న సమస్య లో అధిక శరీర బరువు సమస్య ఒకటి. సాధారణంగా శరీర బరువు పెరగడానికి గల కారణం మనం తీసుకునే ఆహారం ఒక కారణం అయితే, నిద్రపోయే ముందు మనకు తెలిసి తెలియకుండా చేసే కొన్ని పొరపాట్లు కూడా మన శరీర బరువును పెంచడానికి కారణమవుతాయని నిపుణులు తెలియజేస్తున్నారు. మన శరీర బరువు పెరగకుండా ఉండాలంటే నిద్రపోయే ముందు పొరపాటున కూడా ఈ పనులు చేయకూడదు మరి ఆ పనులు ఏమిటో తెలుసుకుందాం..

చాలామంది రాత్రి భోజనం చేసిన వెంటనే నిద్ర పోతారు. ఈ విధమైనటువంటి అలవాటు ఉన్నవారు తొందరగా శరీర బరువు పెరుగుతారు. ఈ క్రమంలోనే పొట్ట విపరీతంగా పెరుగుతుంది కనుక మనం నిద్ర పోయే సమయానికి గంట ముందు భోజనం చేయడం ఎంతో మంచిది. అదే విధంగా ఉదయం నుంచి మన పై పడిన ఒత్తిడి, అధిక పని ప్రభావం మన మెదడులో ఉండటంవల్ల మన మెదడు కంటికి నిద్ర లేకుండా చేస్తుంది. తద్వారా నిద్రలేమి సమస్య ఏర్పడుతుంది.నిద్రలేమి సమస్య కూడా శరీర బరువు పెరగడానికి ఒక కారణం.

రాత్రి సమయంలో ఆలస్యంగా నిద్రపోవడం,నిద్రపోయే వరకు సెల్, లాప్టాప్ వంటి వాటిని చూడటం వల్ల మన కంటి పై అధిక ప్రభావం పడుతుంది. కంటి పై అధిక ప్రభావం చూపడం వల్ల నిద్ర భంగం కలుగుతుంది. ఇది క్రమేపీ మన శరీర బరువును పెంచడానికి దోహదం చేస్తుంది.

చాలామంది రాత్రి భోజనం చేసిన తర్వాత తిన్న చోటనే ఎక్కువసేపు కూర్చోవడం, లేదా తిన్న వెంటనే నిద్రపోతుంటారు. ఈ విధంగా భోజనం చేసిన తరువాత ఒకేచోట కూర్చుని పనిచేయడం వల్ల శరీర బరువు పెరుగుతారు. అందుకే రాత్రి భోజనం చేసిన పది నిమిషాల తరువాత కాసేపు వాకింగ్ చేయడం ఎంతో మంచిది. దీని ద్వారా శరీర బరువు పెరగకపోవడమే కాకుండా మనం తీసుకున్న ఆహారం తేలికగా జీర్ణం అవుతుంది అని నిపుణులు తెలియజేస్తున్నారు.