అటు సింగింగ్ , డబ్బింగ్ లో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చకున్నారు చిన్మయి. అంతేకాదు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అభిమానులతో ముచ్చటిస్తుంటారు. ఆమె ముఖ్యంగా మీటూ ఉద్యమంలో యాక్టివ్ గా ఉంటూ.. ఎంతో మందిపై ఆమె ఆరోపణలు చేశారు. సినీ పరిశ్రమలో ఆమె ఎదుర్కొన్న లైంగిక వేధింపులను ధైర్యంగా బయటపెట్టింది చిన్మయి.
ఆమెపై సోషల్ మీడియాలో వస్తున్న ట్రోలింగ్ లపై కూడా అంతే స్థాయిలో సమాధానం చెబుతోంది చిన్నయి. ఇక నాగచైతన్య, సమంత పై వస్తున్న వార్తలపై మాట్లాడింది. వారి విడాకుల గురించి ప్రత్యక్షంగా మాట్లాడకుండా.. ఇటీవల శాకుంతలం సినిమా నిర్మాత నీలిమ గుణ సమంత గురించి చెప్పిన విషయాలను ఆమె మెచ్చుకుంది. సమంత గురించి అన్ని నిజాలే చెప్పారని.. థ్యాంక్స్ అంటూ నీలిమ గుణను చిన్మయి అభినందించింది.
ఇటీవల నీలిమ శాకుంతలం సినిమాకు సమంతను సంప్రదించినప్పుడు తాను సినిమాలు చేయకూడదని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారన్నారు. ఫ్యామిలీ ప్లానింగ్‌లో ఉన్నానని సమంత చెప్పింది. కానీ దీని కథ విని నచ్చడంతో కొన్ని కండీషన్లతో ఒప్పుకుందని ఆమె తెలిపినట్లు నీలిమ అన్నారు. నీలిమ ఈ మాటలు బయటకు వచ్చి మాట్లాడటంతో చిన్మయి నీలిమ గుణను అభినందించారు.
తర్వాత ఆమె ఓ ఫన్నీ వీడియోను పోస్ట్ చేశారు. అందులో గురక పెట్టే వారి పక్కన పడుకుంటే ఎలా ఉంటుందో చూపించారు. అందులో ఓ కుక్క గురక పెట్టి నిద్రపోతుండగా.. పక్కనే ఉన్న పిల్లి ఒక్కసారిగా ఉలిక్కిపడింది. దీంతో ఇలా గురక పెట్టే వారి పక్కన పడుకుంటే కష్టమని సింగర్ చిన్మయి పరోక్షంగా చెప్పారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…