Tag Archives: songs

Mahashivaratri: మహాశివరాత్రి స్పెషల్ ఈ పాటలు తప్పకుండా వినాల్సిందే!

Mahashivaratri: మహాశివరాత్రి రోజు పెద్ద ఎత్తున భక్తులు శివుడి పూజలో నిమగ్నమౌతూ ఆయన సేవలోనే ఉంటారు. ఇలా శివుడికి పూజ చేసిన తర్వాత శివుడికి సంబంధించిన సినిమాలను పాటలను వింటూ ఉంటారు. శివరాత్రి రోజు తప్పనిసరిగా వినాల్సిన శివుడి పాటలు ఏంటి అనే విషయానికి వస్తే…

ఓం మహా ప్రాణదీపం పాట శ్రీ మంజునాథ సినిమాలోనిది. ఎంతో ప్రజాదరణ పొందిన ఈ పాటను శంకర్ మహదేవన్ పాడారు. అలాగే ఈ సినిమాలో శ్రీ పాదం అనే పాటను ఎస్పీ బాలసుబ్రమణ్యం పాడారు. ఇక జీవిత చిత్రాన్ని చూపించే పాటలలో అత్యంత ప్రజాదరణ పొందిన పాట ఆటగదరా శివ ఇది ఆటగద కేశవ అనే పాట కూడా ఎంతో ఆదరణ పొందింది.

ఇందులోని ప్రతి ఒక్క అక్షరం జీవిత సత్యాన్ని తెలియజేస్తుంది. ఇంత అద్భుతమైన ఈ పాటను తనికెళ్ళ భరణి రచించగా ఏసుదాసు ఈ పాటను ఆలపించారు. ఇక శివరాత్రి రోజు వినాల్సిన పాటలలో ఎట్టాగయ్య శివ శివ పాట ఒకటి ఇది కూడా శివరాత్రి రోజున వినాల్సిన పాటలలో ఒకటి.

Mahashivaratri: లింగాష్టకం శివరాత్రి ప్రత్యేకత…


జగద్గురు ఆదిశంకరాచార్య సినిమాలోని భ్రమ అని తెలుసు అనే పాట కూడా ఎంతో ఆదరణ పొందింది బ్రతుకంటే బొమ్మలాట పుట్టుక మరణం తప్పదు అంటూ సాగిపోయే ఈ పాట ఎంతో మంచి ఆదరణ సంపాదించుకుంది. ఇక పరమానందయ్య శిష్యులు సినిమాలో ఓం మహాదేవ అనే పాట శివరాత్రి ప్రత్యేకమని చెప్పాలి. ఈ పాటను పి సుశీల పాడారు. ఇక లింగాష్టకం పాట కూడా శివరాత్రి స్పెషల్ సాంగ్ గా నిలిచిపోయింది.

Tammareddy Bharadwaj: కృష్ణంరాజు గారు అడిగిన ఆపని చేయలేకపోయాను.. నాకు మాట్లాడటానికి కూడా సిగ్గుగా ఉంది: తమ్మారెడ్డి భరద్వాజ్

Tammareddy Bharadwaj: తెలుగు వెండితెర రారాజుగా ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటుడు కృష్ణంరాజు ఆదివారం మరణించిన విషయం మనకు తెలిసిందే. ఇలా ఆదివారం ఈయన మరణించడంతో తెలుగు సినీ ప్రపంచం శోకసంద్రంలో మునిగిపోయింది. ఈ క్రమంలోనే మంగళవారం ఈయన సంస్కరణ సభను నిర్వహించారు.

ఫిల్మినగర్ కల్చరల్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సంస్కరణ సభలో పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు.ఈ క్రమంలోనే ఈ సంస్కరణ సభలో పాల్గొన్నటువంటి తమ్మారెడ్డి భరద్వాజ్ కృష్ణంరాజు గురించి మాట్లాడుతూ షాకింగ్ కామెంట్స్ చేశారు.ఇక తాను నిర్మాతగా కృష్ణంరాజు హీరోగా ఫస్ట్ సినిమా చేశానని అయితే ఈ సినిమాకు మా అన్నయ్య దర్శకుడు అంటూ తమ్మారెడ్డి తెలియచేశారు.

ఈ సినిమాలో మా అన్నయ్య ఏకంగా నాలుగు పాటలు పెడతానన్నారు అయితే నాలుగు పాటలు పెడితే ఎవరు చూస్తారు అంటూ తాను అడ్డుపడ్డానని ఇదే విషయాన్ని కృష్ణంరాజు దగ్గరికి వెళ్లి మా అన్నయ్య నాలుగు పాటలు పెడతానన్నారు అసలు ఎవరు చూస్తారు ఈ పాటలు అని అతనితో చెప్పాను. ఆ స్థానంలో కృష్ణంరాజు కాకుండా వేరే ఏ హీరో ఉన్న లాగిపెట్టి నన్ను కొట్టేవారు. ఆయన మాత్రం ఓ చిన్న నవ్వు నవ్వి నేను పనికిరానా? అంటూ మా అన్నయ్యని ఒప్పించారు. ఆయన సినిమాకు ఏం కావాలో అంతే చేస్తారని తమ్మారెడ్డి పేర్కొన్నారు.

Tammareddy Bharadwaj:ఆయన ఇష్టపడిన ఫ్లాట్ ఇవ్వలేకపోయాను…

ఈ సంఘటన తర్వాత దాదాపు ఒక మూడు సంవత్సరాల పాటు ఆయన ఫోన్ ఎత్తాలన్న భయం వేసేదని తమ్మారెడ్డి పేర్కొన్నారు.ఇకపోతే మూడు సంవత్సరాల క్రితం కృష్ణంరాజు గారు తన వద్దకు వచ్చి మూవీ టవర్స్ లో తనకు ఒక ఫ్లాట్ కావాలని అడిగారు.అయితే తనకు మార్కెట్ రేట్ కావాలని చెప్పగా మార్కెట్ రేట్ ఎంత ఉంటే అంత ఇస్తానని కృష్ణంరాజు గారు చెప్పారు. అయితే ఆయనకు చెప్పినట్టుగా నేను ఆ ఫ్లాట్ ఇవ్వలేకపోయానని ఈ విషయం గురించి మాట్లాడాలన్నా చాలా సిగ్గుగా ఉందంటూ ఈ సందర్భంగా గతంలో జరిగిన విషయాన్ని తమ్మారెడ్డి భరద్వాజ్ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం ఈయన చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.