Tag Archives: sp balu

MM Srelekha: నాయుడు గారు నన్ను, దాసరిని కోటి రూపాయలు పోగొట్టినందుకు తిట్టేవారు.. సంగీతం నేర్పమంటే బాలుగారు అలా అన్నారు: ఎం ఎం శ్రీలేఖ

MM Srelekha: ఎం ఎం శ్రీలేఖ తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న ఏకైక మహిళ సంగీత దర్శకురాలు. ఈమె చిన్నప్పటి నుంచి సినీ నేపథ్యం ఉన్న కుటుంబంలో పుట్టి పెరగడం వల్ల తనకు కూడా సంగీతంపై ఎంతో మక్కువ ఏర్పడింది. శంకరాభరణం సినిమా చూసి తాను సింగర్ గా స్థిరపడాలని నిర్ణయం తీసుకున్నానని శ్రీలేఖ ఒక ఇంటర్వ్యూ ద్వారా వెల్లడించారు. ఇకపోతే ఎం ఎం కీరవాణి అన్నయ్యతో కలిసి మ్యూజిక్ కంపోజ్ చేస్తూ అలా సంగీత దర్శకురాలిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చానని తెలిపారు.

తన మొట్టమొదటి సినిమా తమిళ హీరో విజయ్ తో చేశానని తెలిపారు. ఇకపోతే కొండపల్లి రత్తయ్య సినిమాకి కూడా సంగీత దర్శకత్వం వహించానని,ఈ సినిమా ఫ్లాప్ కావడంతో రామానాయుడు ఎప్పుడూ కూడా కోటిపల్లి రత్తయ్య అంటూ నన్ను దాసరి గారిని కలిపి తిట్టే వారు అంటూ ఈ సందర్భంగా శ్రీలేఖ వెల్లడించారు.ఈ సినిమాకు దాసరి దర్శకత్వం వహించగా,తాను సంగీత దర్శకత్వం వహించానని ఈ సినిమా ఫ్లాప్ కావడంతో కోటి రూపాయలు నష్టం రావడం వల్ల నాయుడు గారు చనిపోయేవరకు మమ్మల్ని కోటి రూపాయలు గురించి ప్రస్తావిస్తూ తిట్టేవారు అంటూ సరదాగా తెలియజేశారు.

ఇకపోతే తాను ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలకు సంగీత దర్శకత్వం వహించిన సంగతి మనకు తెలిసిందే. ఇందులో ఎన్నో మంచి హిట్ అందుకున్నాయి.ఇకపోతే తన కెరీర్లో ఏ విధమైనటువంటి ఆటుపోట్లు ఎదురయ్యాయ అనే ప్రశ్నకు సమాధానం చెబుతూ ఎక్కడైనా మంచి ఉంది అంటే తప్పకుండా చెడు కూడా ఉంటుంది.నా కెరీర్లో కూడా అలాంటి ఆటుపోట్లు ఉన్నాయి అయితే నేను పెద్దగా వాటి గురించి పట్టించుకోలేదని తెలిపారు.

గాడిద గొంతు అన్నారు…

ఇకపోతే తనకు సంగీత దర్శకురాలిగా కన్నా సింగర్ గా పాట పాడటం ఎంతో ఇష్టం ఇలా సింగర్ కావాలని కోరుకుంటున్నట్లు ఇంట్లో చెప్పడంతో ఇంట్లో వాళ్లు కూడా ఏదో ఇష్టపడుతుంది కదా అని ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి దగ్గరికి తీసుకువెళ్లి సంగీతం నేర్పించాలని అడిగారు. ఈ విధంగా అడిగేసరికి బాలు గారు నేను తనకి సంగీతం నేర్పించనని మొహం మీదే చెప్పారు. తన గొంతు గాడిద గొంతులా ఉంది. తనకు నేను సంగీతం నేర్పించనని బాలు గారు చెప్పినట్టు ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఎం.ఎం.శ్రీలేఖ అప్పటి విషయాలను గుర్తు చేసుకున్నారు.

అతడి చేతికి ‘పాడుతా తీయగా’ షో బాధ్యతలు.. త్వరలో 19వ సీజన్..!

దివంగత ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం గురించి ప్రత్యేకంగా చెప్పాలా.. కొన్ని వేల పాటలను పాడారు. ఏ వేరియేషన్లో పాడాలన్నా అతడికి అతనే సాటి. అంత అద్భుతంగా పాడతారు. అతడి పాటలు నచ్చని వారంటూ ఉండరు. పాత తరం దగ్గర నుంచి కొత్త తరం వరకు.. ఎవరి అభిరుచులకు తగ్గట్టూ అలా పాడుతారు. కానీ కరోనా మహమ్మారి కారణంగా ఈ లోకాన్ని విడిచి పెట్టాల్సి వచ్చింది.. ఈ సంగీత శిఖరం.

కానీ ఆయన చనిపోయి సంవత్సరం గడిచి పోతున్నా.. అతడి పాటలు మాత్రం ప్రతీ ఒక్కరి గుండెల్లో నాటుకుపోయాయి. ఇక బుల్లితెరపై అతడు పాడుతా.. తీయగా అనే ప్రోగ్రాంను రన్ చేసిన విషయం తెలిసిందే. అతడు మరణించిన తర్వాత కాస్త దానికి బ్రేక్ వచ్చింది. 25 సంవత్సరాలుగా బుల్లితెర ప్రేక్షకులతో ఈ కార్యక్రమం అనుబంధం ఉంది.

ఈ పాడుతా తీయగా 19వ సీజన్ త్వరలో ప్రారంభం కానుందని ఈటీవీ పేర్కొంది. 25 ఏళ్లక్రితం ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం చేతుల మీదుగా ప్రారంభమైన ఈ కార్యక్రమం ఎందరో యువ గాయకులను సమాజానికి పరిచయం చేసింది. 18 సీజన్లను దిగ్విజయంగా పూర్తి చేసుకొని, త్వరలో ప్రారంభంకానున్న 19వ సీజన్ పాడుతా తీయగా కోసం ఈటీవీ భారీ కసరత్తు చేస్తున్నట్లు ఈటీవీ యాజమాన్యం పేర్కొంది.

కరోనా కారణంగా మధ్యలో గ్యాప్ వచ్చింది. దానిలోనే ఆన్‌లైన్‌ ఆడిషన్స్ నిర్వహించింది. 4 వేలమంది గాయనీగాయకుల స్వరాలను నిర్ణేతల పరీక్షించి వారిలో నుంచి 16 మంది కళాకారులను ఎంపిక చేసినట్లు ఈటీవీ యాజమాన్యం తెలిపింది. షోను నిర్వహించే బాధ్యతను బాలు కుమారుడు ఎస్‌పీ చరణ్ స్వీకరిస్తున్నట్లు పేర్కొంది.

ఎస్పీ బాలును స్మరించుకుంటున్న నెటిజన్స్.. వైరల్ అవుతున్న పాటలు..

స్వాతంత్రం రాక ముందు అంటే 1945 జూన్ 4 న జన్మించిన ఎస్పీ బాలసుబ్రమణ్యం సెప్టెంబర్ 25, 2020 లో మాయదారి కరోనా మహమ్మారి దాటికి కన్నుమూశారు. సరిగ్గా నేటికి అతడు ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయి సంవత్సరం. మనిషికి మరణం ఉంటుంది కానీ.. అతడు పాడిన పాటలకు ఏనాడూ మరణం ఉండదు.. అంతే కాకుండా.. అతడి గానం కూడా ప్రతీ ఒక్కరి మదిలో నిండి ఉంటుందంటూ సోషల్ మీడియాలో ఎస్పీ బాలసుబ్రమణ్యం గురించి స్మరించుకుంటున్నారు నెటిజన్లు.

ఉదయం నుంచి ట్విట్టర్‌లో #SPBalasubrahmanyam అనే హ్యాష్‌ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు. అంతేకాదు అతడు పాడిన పాటలు కూడా హల్ చల్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. తొలిసారిగా 1966లో విడుదలైన శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న చిత్రంలో పాడే అవకాశం వచ్చింది ఎస్పీ బాలసుబ్రమణ్యంకు.. ఎంతో మంది హీరోలకు తన స్వరంతో.. వారికి అనుగుణంగా పాటలు పాడారు. తెలుగు సినిమా పాటలకు ఘంటసాల అందించిన సేవలు.. అతడి పాడిన పాటలకు ఎంతో ఘన చరిత్ర ఉంది.

అతడి వారసుడిగా పునికి పుచ్చుకున్నాడు ఎస్పీ. అతడు దాదాపు నాలుగు దశాబ్దాల్లో…11భాషల్లో 40వేల పాటలు పాడి గిన్నీస్ రికార్డు నెలకొల్పారు. ఆయన అందుకున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పురస్కారాలకు లెక్కే లేదు. తన కెరీర్ మొత్తంలో, బాలసుబ్రహ్మణ్యం కేవలం నేపథ్య గానం మాత్రమే కాకుండా, సంగీత దర్శకత్వం, నటన, డబ్బింగ్ మరియు నిర్మాణానికి కూడా అవార్డులు గెలుచుకున్నారు. ఇంకా అతడు టెలివిజన్ అరంగేట్రం చేసిన తెలుగు మ్యూజిక్ రియాలిటీ టీవీ షో ‘పాడుతా తియ్యగా’కు హోస్ట్ మరియు న్యాయనిర్ణేతగా వ్యవహరించారు .

1996 నుండి ఈ కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ నుంచి ప్రతిభావంతులైన గాయకులను వెలికితీసిన ఘనత కూడా ఎస్పీదే. ఉష , కౌసల్య , గోపిక పూర్ణిమ , మల్లికార్జున్ , హేమచంద్ర , ఎన్‌సి కారుణ్య , స్మిత మొదలైన గాయకులు ఇక్కడ పాడి తన సత్తా చాటుకున్నావాళ్లే.

ఎస్పీ బాలసుబ్రమణ్యం ఒక్క పాటకు ఎన్ని రూ. లక్షలు తీసుకున్నారో తెలుసా..

సింగర్ విజయ లక్ష్మి దివంగత మ్యూజిక్ డైరెక్టర్ చక్రి సంగీతంలో ఎన్నో పాటలు పాడారు. ఆమె గానానికి ఎంతో మంది మంత్ర ముగ్దులయ్యారు. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొని కొన్ని ఆశక్తికరమైన విషయాలను పంచుకున్నారు. అందులో ముఖ్యంగా.. సంగీత దర్శకుడు చక్రి గురించి మాట్లాడుతూ.. మ్యూజిక్ డైరెక్టర్ చక్రి తనను ఎంతో ప్రోత్సహించారని.. తన ప్రోత్సాహం వల్లే తన ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నానని ఇండస్ట్రీలోకి వచ్చిన మొదట్లో తనకు ఎవరు సహాయం చేయలేదని అన్నారు.

తన మెరిట్ ప్రకారమే ఇంత వరకు వచ్చానని.. చక్రి మొదట్లో మంచి సాంగ్స్ ఇవ్వకపోయినా.. తర్వాత మంచి సాంగ్స్ తనతో పాడిచ్చారని తెలిపింది. చక్రి ఉండుంటే వేరేలా ఉండేదని.. ఎంతో మంది కొత్త వాళ్లకు చాన్స్ కూడా వచ్చేదని విజయలక్ష్మి ఈ సందర్భంగా పేర్కొన్నారు. కొత్త కొత్త వాళ్లను అతడు ఎంకరేజ్ చేసేవాడని తెలిపింది. అతడి జర్నీలో.. అతడితో పాటు ఉన్నవాళ్లు అతడిని చాలా మంది గుర్తు పెట్టుకున్నారన్నారు.

చక్రి సినిమాకు అగ్రిమెంట్ చేయించుకుంటారా అనే ప్రశ్న ఈమెకు ఎదురవగా.. అలాంటిది ఏమి లేదు.. పాట పాడిన దానికి మాత్రమే ఇస్తాడని చెప్పింది. ప్రస్తుతం చాలామంది రూ.లక్ష వరకు తీసుకుంటుంన్నారని చెప్పారు. ఒక సాంగ్ హిట్ అయితే కెరీర్ లో అలా నిలిచిపోతుంది. ఒక్క పాట హిట్ అయితే తర్వాత పాటలకు ఎక్కువ డబ్బులు అడగడానికి అవకాశం ఉంటుందని తెలిపారు.

అలా ఆ పాట వల్ల ఎక్కువగా రెమ్యూనరేషన్ పొందొచ్చన్నారు. పాట హిట్ అయితే .. మంచిగా లైఫ్ ఉంటుందని చెప్పారు. దివంగత బాల సుబ్రమణ్యం గారు కూడా రెండు సంవత్సరాల క్రితం ఒక పాటకు రూ.లక్ష వరకు రెమ్యూనరేషన్ తీసుకున్నారని వెల్లడించారు. మిగతా వారు దాదాపు రూ.25 నుంచి రూ.50 వేల వరకు తీసుకుంటున్నారని ఈ సందర్భంగా సింగర్ విజయ లక్ష్మి తెలిపారు.

Sp Balu : ప్రస్తుతం ఎస్పీ బాలు భార్య సావిత్రమ్మ ఆరోగ్య పరిస్థితి తెలిస్తే కన్నీళ్లే.!

Sp Balu : తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రముఖ గాయకుడు ఎస్పీ బాల సుబ్రమణ్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన గొంతుతో కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. ఆయన మరణ వార్త సినిమా పరిశ్రమ మొత్తం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. చిత్ర పరిశ్రమలో దాదాపు 16 భాషల్లో..నలభై వేళకు పైగా పాటలు పాడిన ఏకైక గాయకుడు ఎస్పీ బాలు.

SP Balasubrmanyam Wife Savitri

1946 జూన్ 4న నెల్లూరులోని కోనేటమ్మపేటలో జన్మించారు. ఆయన అసలు పేరు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రమణ్యం. చిన్నతనం నుంచే పాటలు పాడటం హాబీగా మార్చుకున్న బాలుకి.. తొలిసారిగా 1966లో విడుదలైన శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న సినిమాలో పాడే అవకాశం వచ్చింది. ఎంతమంది హీరోలకైనా తన అద్భుతమైన స్వరంతో వారికి అనుగుణంగా పాటలు పాడగల గొప్పగాయకుడు ఎస్పీ. తెలుగు సినిమా గీతాలకు దొరికిన ఒకానొక ఆణిముత్యం బాలసుబ్రహ్మణ్యం. సినిమా పాటలే కాకుండా పలు టీవీ షోల్లో పాటలు పాడి ఆకట్టుకున్న ఎస్పీ.. ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్నారు. పద్మభూషణ్ లాంటి అరుదైన సత్కారాలను అందుకున్న గొప్ప సింగర్ బాలసుబ్రహ్మణ్యం.

అయితే కర్ణాటక, హిందీ, తమిళ, మలయాళంలో ఇలా ఎన్ని భాషల్లో పాడినా.. కాని ఒక తెలుగు బిడ్డగా ఘంటసాల గారి తరువాత అలాంటి గాయకుడ్ని చూస్తామా అనుకున్న సందర్భంలో నేనున్నా అని ముందుకు వచ్చిన గాయకుడు ఎస్పీ బాలు ఇక లేరు అనే వార్తను ఇప్పటికీ ఎవ్వరూ జీర్ణించుకోలేక పోతున్నారు..ఇక బాలు గారి కుటుంబ సభ్యులు ఇంకా ఆ బాధ నుంచి తేరుకోలేక పోతున్నట్లు సమాచారం.

ఇక ముఖ్యంగా బాల సుబ్రహ్మణ్యం భార్య సావిత్రి ఈఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తన భర్త దూరమైన తర్వాత చాలా రోజులు ఇంట్లో నుంచి అస్సలు బయటికి రాలేకపోయిందట..ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం..బాలు గారి మరణాంతరం కొద్ది రోజుల తర్వాత అడయార్ లోని తన కూతురు పల్లవి ఇంట్లో ఉన్న తన తల్లిని ఎస్పీ చరణ్.. ఇప్పుడిప్పుడే బయటికి తీసుకెళ్తున్నట్లు,ఆమె ఆరోగ్య పరిస్థితి కూడా ఇప్పుడు కాస్త నిలకడగానే ఉన్నట్లు బాలు గారి సన్నిహిత వర్గాలు తెలుపుతున్నాయి.