Tag Archives: sports

Indian Cricketer: ఈ ఫోటోలో ఉన్న కుర్రాడు టీమిండియాలో స్టార్ ప్లేయర్.. ఎవరో గుర్తుపట్టారా?

Indian Cricketer: సోషల్ మీడియా అభివృద్ధి చెందిన తర్వాత ఎంతో మంది సెలబ్రిటీలు వారి చైల్డ్ హుడ్ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటారు. ఈ క్రమంలోనే అభిమానులు పెద్ద ఎత్తున ఆ ఫోటోలను వైరల్ చేస్తూ ఈ ఫోటోలో ఉన్నది ఎవరో గుర్తుపట్టండి అంటూ వైరల్ చేస్తుంటారు.ఈ క్రమంలోనే టీమ్ ఇండియాలో స్టార్ ప్లేయర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఓ కుర్రాడి ఫోటో వైరల్ అవుతుంది మరి ఈ ఫోటోలో ఉన్న ఆ క్రికెటర్ ఎవరో గుర్తుపట్టారా.

ఈ ఫోటోలో ఉన్న కుర్రాడు ప్రస్తుతం టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ లలో ఆడుతున్నారు. ఈయన కనుక గ్రౌండ్ లో ఉంటే ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు కనపడుతుంటాయి. వినూత్నమైన షాట్లతో అందరికీ చమటలు పట్టిస్తుంటారు. ఇప్పుడైనా ఈ క్రికెటర్ ఎవరో గుర్తుపట్టారా? అదేనండి ఈ ఫోటోలో ఉన్న క్రికెటర్ మరెవరో కాదు సూర్య కుమార్ యాదవ్.

Indian Cricketer: ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తున్న సూర్య కుమార్ యాదవ్…


ప్రస్తుతం టీమిండియాలో ఎంతో అద్భుతమైన ఆట తీరును కనబరితో ప్రత్యర్థి జట్టుకు చుక్కలు చూపిస్తున్నారు.ఎంతో అద్భుతమైన ఆటతో ఇండియా ని ముందుకు నడిపిస్తున్నటువంటి సూర్య కుమార్ యాదవ్ చిన్నప్పటి ఫోటో వైరల్ అవుతుంది. ఈయన బ్యాట్ చేతపట్టారంటే బౌలర్లకు చెమటలు పట్టాల్సిందే. ఇక ఈ ప్రపంచ కప్ పోటీలలో ఈయన తన విశ్వరూపం చూపిస్తున్నారు. ప్రస్తుతం ఇతని ఫోటో వైరల్ కావడంతో అభిమానుల సైతం సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Virat Kohli: కళ్ళు కనిపించవు.. కానీ విరాట్ కోహ్లీ ఇన్స్పిరేషన్.. విరాట్ బ్లైండ్ ఫ్యాన్ స్టోరీ ఇదే!

Virat Kohli: భారత క్రికెటర్ విరాట్ కోహ్లీకి ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు ఉన్నారు. కేవలం ఇండియన్స్ మాత్రమే కాకుండా విదేశీ వ్యక్తుల సైతం తనకు అభిమానులుగా ఉన్నారు అంటే ఈయనకు ఎలాంటి క్రేజ్ ఉందో మనకు తెలిసింది. ఇలా ఇంగ్లాండ్ కి చెందిన ఎలీ అనే ఒక బ్లైండ్ యువతి విరాట్ కోహ్లీకి అభిమానిగా మారిపోయారు. తనకు కళ్ళు కనిపించక పోయిన ఓ ఇంటర్వ్యూలో విరాట్ కోహ్లీ బయోగ్రఫీ విన్న తర్వాత ఆమె తనకు అభిమానిగా మారిపోయినట్లు వెల్లడించారు.

ఇలా ఇంగ్లాండ్ కి చెందిన ఈమె విరాట్ కోహ్లీకి వీరాభిమానిగా మారడంతో కోహ్లీ కోసం వరల్డ్ కప్ మ్యాచ్ చూడటం కోసం ఆస్ట్రేలియా వెళ్లారు. ఈమె విరాట్ కోహ్లీ బయోగ్రఫీ విన్న తర్వాత ఆయనని ఇన్స్పిరేషన్ గా తీసుకున్నానని ఓ ఇంటర్వ్యూ సందర్భంగా వెల్లడించారు. తనకు టెన్నిస్ అంటే ఎంతో ఇష్టమని చెప్పిన ఎలీ కోహ్లీ కూడా టెన్నిస్ అంటే ఇష్టపడతారని తెలుసుకుంది.

కోహ్లీ ఎలా ఉంటారో ఎలా ఆడతారో తెలియక పోయినప్పటికీ ఈమె తనకు అభిమానిగా మారిపోవడంతో విరాట్ కోహ్లీ సైతం ఎంతో సంతోషం వ్యక్తం చేశారు.అయితే ఇలా ఒక బ్లైండ్ ఉమెన్ తనకు అభిమానిగా మారిపోయారని తెలియడంతో విరాట్ సైతం తన జెర్సీతో పాటు ఆటోగ్రఫీ చేసినటువంటి ఒక బ్యాట్ ను కూడా తనకు బహుమానంగా ఇచ్చారు.

Virat Kohli: కోహ్లీ కోసం ఇండియాకి సపోర్ట్ చేసిన ఎలీ..

ఇక ఈమెకు కోహ్లీ పై ఉన్న ప్రేమకు తన తల్లి ఎప్పుడు కూడా అడ్డు చెప్పలేదు తన తల్లి ఇంగ్లాండ్ కి మద్దతు తెలుపగా ఈమె మాత్రం కోహ్లీ కోసం ఇండియాకి సపోర్ట్ చేస్తున్నారు. ఇలా ఈమె ఇండియాని సపోర్ట్ చేస్తున్నప్పటికీ తన తల్లి ఏమాత్రం అడ్డు చెప్పలేదు. ఇకపోతే ఈ మ్యాచ్ చూడటం కోసం ఆమె తన తల్లి సహాయంతో ఏకంగా స్టేడియంకు రావడంతోనే తనకు కోహ్లీ అంటే ఏ విధమైనటువంటి అభిమానం ప్రేమ ఉందో అర్థం అవుతుంది.

Sourav Ganguly -VVS Laxman: గంగూలీ కారణంగానే క్రికెటర్ వివిఎస్ లక్ష్మణ్ వరల్డ్ కప్ ఆశలు గల్లంతు అయ్యాయా..? ఆ విషయంలో లక్ష్మణ్ ను దాదా ధారుణంగా మోసం చేసాడా?

Sourav Ganguly -VVS Laxman: టీమిండియా క్రికెటర్లుగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న వివిఎస్ లక్ష్మణ్ సౌరవ్ గంగూలీ గురించి క్రికెట్ అభిమానులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మణికట్టు మాంత్రికుడిగా టెస్ట్ క్రికెట్లలో ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్న వివిఎస్ లక్ష్మణ్ ఎంతో అద్భుతమైన ఆటతీరును కనపరుస్తూ ప్రపంచ క్రికెట్ ను శాసిస్తున్న ఆస్ట్రేలియాను ఒంటి చేతితో ఓడించారు.

ఇలా ఎన్నో అద్భుతమైన రికార్డులు సృష్టిస్తూ క్రికెటర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకొని ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న వివిఎస్ లక్ష్మణ్ తన క్రికెట్ ప్రస్థానంలో తనకు తీరని కోరిక అలాగే మిగిలిపోయిందని తెలుస్తోంది. అయితే లక్ష్మణ్ కోరిక తీరకుండా ఉండడానికి కారణం అప్పుడు ఇండియన్ కెప్టెన్ గా ఉన్నటువంటి సౌరఫ్ గంగూలీ అని తెలుస్తుంది.

లక్ష్మణ్ కి గంగూలి బద్ధ శత్రువుగా మారి తన కోరికను అణచివేసారని అప్పట్లో ఎంతో మంది క్రికెట్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 2001లో వీవీఎస్‌ లక్ష్మణ్‌ ఆడిన 281 పరుగుల ఇన్నింగ్స్‌ ఇప్పటికీ ప్రపంచ క్రికెట్‌లో ఒక సంచలనం. 1996 లో జరిగిన టెస్ట్ మ్యాచ్ లతో వివిఎస్ లక్ష్మణ్ షార్ట్‌గా వీవీఎస్‌ లక్ష్మణ్‌ అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశారు. 2001 సంవత్సరానికి గాను క్రికెట్లో పీక్ స్టేజ్ కు చేరిన ఈయన 2003లో జరిగిన వరల్డ్ కప్ మ్యాచ్ పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.

Sourav Ganguly -VVS Laxman: లక్ష్మణ్ కు శత్రువుగా మారిన గంగూలి..

2003 వ సంవత్సరంలో వన్డే వరల్డ్ కప్ మ్యాచ్ లో తనకు చోటు ఖాయమని ఫిక్స్ అయిపోయినటువంటి లక్ష్మణ్ కు గంగూలి షాక్ ఇచ్చారు. ఆ సమయంలో టీం ఇండియన్ కెప్టెన్ గా ఉన్నటువంటి గంగూలీ మాత్రం తన ఆలోచనలతో వండే వరల్డ్ కప్ మ్యాచ్లో లక్ష్మణ్ కు చోటు కల్పించకుండా కేవలం ఒక సెంచరీ చేసిన కారణంతో దినేష్‌ మోంగియాను వన్డే వరల్డ్‌ కప్‌ టీమ్‌లోకి తీసుకున్నాడు. ఇలా గంగూలి కారణంగా తన చిరకాల కోరిక అలాగే మిగిలిపోయిందని చెప్పాలి. ఇలా వండే వరల్డ్ కప్ మ్యాచ్లో లక్ష్మణ్ కు చోటు సంపాదించకపోవడంతో టీమిండియా ఫైనల్ వరకు వెళ్లిన చివరికి ఆస్ట్రేలియా చేతిలో ఓటమిపాలు కాక తప్పలేదని ఆ సమయంలో లక్ష్మణ్ కనుక టీం లో ఉండి ఉంటే ఇండియాకు వరల్డ్ కప్ ఖాయమంటూ ఎంతోమంది క్రికెట్ అభిమానులు నిరాశ వ్యక్తం చేశారు. ఇలా లక్ష్మణ్ తీరని కోరికకు గంగూలి కారణమని చెప్పాలి.

క్రికెట్ అభిమానులు పండగ చేసుకునే వార్త.. ఏంటంటే..

గత కొన్ని రోజుల నుంచి క్రికెట్ అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. ఐపీఎల్ మొదలైన దగ్గర నుంచి అభిమానులు సందడి చేస్తున్నారు. ఐపీఎల్ అయిపోగానే వెంటనే టీ20 వరల్డ్ కప్ వచ్చింది. తర్వాత వెంటనే మళ్లీ న్యూజిలాండ్ తో టీ20 మరియు టెస్టు ఆడనున్నారు. 2022 ఆస్ట్రేలియా వేదికగా మరో టీ20 వరల్డ్ కప్ సమరం ఉండనుంది.

మళ్లీ మరుసటి సంవత్సరం 2023 లో వన్డే వరల్డ్ కప్ మన భారతదేశం వేదిక కానుంది. అయితే తాజాగా 2024లో నిర్వహించే క్రికెట్ కు సంబంధించి 8 ఐసీసీ టోర్నమెంట్ల వేదికలను ఐసీసీ తాజాగా ప్రకటించింది. 14 దేశాల్లో ఈ టోర్నమెంట్లు జరుగనున్నట్లు ట్విట్టర్ వేదిక ద్వారా ప్రకటించారు. 2024 టీ 20 వరల్డ్‌ కప్‌ యూఎస్‌ఏ, వెస్టిండీస్‌ లో జరుగనుంది.

2025 చాంపియన్‌ ట్రోపికి పాకిస్తాన్‌ వేదిక కానుంది. ఇక 2026 టీ20 వరల్డ్‌ కప్‌ ఇండియా, శ్రీలంక లో జరుగనుంది. ఇక 2027 వరల్డ్‌ కప్‌ కు సౌతాఫ్రికా, జింబాబ్వే, నమీబియా వేదికలు కానున్నట్లు ట్విట్టర్ లో ప్రకటించారు. అలాగే… 2028 టీ20 వరల్డ్‌ కప్‌ ఆసీస్‌, న్యూజిలాండ్‌ దేశాలు వేదికలు కానున్నాయి. 2029 లో చాంపియన్‌ ట్రోఫికి ఇండియా వేదిక కానుంది.

2030 టీ 20 వరల్డ్‌ కప్‌కు ఇంగ్లండ్‌, ఐర్లాండ్‌, స్కాట్లాండ్‌ లు వేదికలు కానున్నాయి. 2031 వరల్డ్‌ కప్‌ కు ఇండియా, బంగ్లా దేశ్ దేశాలు వేదికలు కానున్నాయి. ఈ కొత్త వేదికలు.. టైం టేబుల్ లతో క్రికెట్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆ షెడ్యూల్ ప్రకారమే వారి వారి వ్యక్తిగత పనులను చేసుకునేందుకు అవకాశం ఉండనుంది.