Sourav Ganguly -VVS Laxman: టీమిండియా క్రికెటర్లుగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న వివిఎస్ లక్ష్మణ్ సౌరవ్ గంగూలీ గురించి క్రికెట్ అభిమానులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మణికట్టు మాంత్రికుడిగా టెస్ట్ క్రికెట్లలో ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్న వివిఎస్ లక్ష్మణ్ ఎంతో అద్భుతమైన ఆటతీరును కనపరుస్తూ ప్రపంచ క్రికెట్ ను శాసిస్తున్న ఆస్ట్రేలియాను ఒంటి చేతితో ఓడించారు.
ఇలా ఎన్నో అద్భుతమైన రికార్డులు సృష్టిస్తూ క్రికెటర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకొని ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న వివిఎస్ లక్ష్మణ్ తన క్రికెట్ ప్రస్థానంలో తనకు తీరని కోరిక అలాగే మిగిలిపోయిందని తెలుస్తోంది. అయితే లక్ష్మణ్ కోరిక తీరకుండా ఉండడానికి కారణం అప్పుడు ఇండియన్ కెప్టెన్ గా ఉన్నటువంటి సౌరఫ్ గంగూలీ అని తెలుస్తుంది.
లక్ష్మణ్ కి గంగూలి బద్ధ శత్రువుగా మారి తన కోరికను అణచివేసారని అప్పట్లో ఎంతో మంది క్రికెట్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 2001లో వీవీఎస్ లక్ష్మణ్ ఆడిన 281 పరుగుల ఇన్నింగ్స్ ఇప్పటికీ ప్రపంచ క్రికెట్‌లో ఒక సంచలనం. 1996 లో జరిగిన టెస్ట్ మ్యాచ్ లతో వివిఎస్ లక్ష్మణ్ షార్ట్‌గా వీవీఎస్ లక్ష్మణ్ అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశారు. 2001 సంవత్సరానికి గాను క్రికెట్లో పీక్ స్టేజ్ కు చేరిన ఈయన 2003లో జరిగిన వరల్డ్ కప్ మ్యాచ్ పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.
2003 వ సంవత్సరంలో వన్డే వరల్డ్ కప్ మ్యాచ్ లో తనకు చోటు ఖాయమని ఫిక్స్ అయిపోయినటువంటి లక్ష్మణ్ కు గంగూలి షాక్ ఇచ్చారు. ఆ సమయంలో టీం ఇండియన్ కెప్టెన్ గా ఉన్నటువంటి గంగూలీ మాత్రం తన ఆలోచనలతో వండే వరల్డ్ కప్ మ్యాచ్లో లక్ష్మణ్ కు చోటు కల్పించకుండా కేవలం ఒక సెంచరీ చేసిన కారణంతో దినేష్ మోంగియాను వన్డే వరల్డ్ కప్ టీమ్‌లోకి తీసుకున్నాడు. ఇలా గంగూలి కారణంగా తన చిరకాల కోరిక అలాగే మిగిలిపోయిందని చెప్పాలి. ఇలా వండే వరల్డ్ కప్ మ్యాచ్లో లక్ష్మణ్ కు చోటు సంపాదించకపోవడంతో టీమిండియా ఫైనల్ వరకు వెళ్లిన చివరికి ఆస్ట్రేలియా చేతిలో ఓటమిపాలు కాక తప్పలేదని ఆ సమయంలో లక్ష్మణ్ కనుక టీం లో ఉండి ఉంటే ఇండియాకు వరల్డ్ కప్ ఖాయమంటూ ఎంతోమంది క్రికెట్ అభిమానులు నిరాశ వ్యక్తం చేశారు. ఇలా లక్ష్మణ్ తీరని కోరికకు గంగూలి కారణమని చెప్పాలి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…