Actress Rambha: తెలుగు చిత్ర పరిశ్రమలో నటిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న రంభ వివాహం అనంతరం కెనడాలో నివసిస్తున్న విషయం మనకు తెలిసిందే. అయితే మంగళవారం తన పిల్లలను స్కూల్ నుంచి తీసుకురావడానికి వెళ్లి వస్తుండగా కారు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఇలా మరొక కారు వేగంగా వచ్చి రంభకారుని ఢీకొనడంతో తన కూతురు సాషాకు స్వల్ప గాయాలయ్యాయి.
ఈ క్రమంలోనే తన కుమార్తెను ఆసుపత్రిలో చేర్చి చికిత్స చేయిస్తూ తన కారు ప్రమాదానికి గురైన విషయాన్ని ఈమె సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఒక్కసారిగా యాక్సిడెంట్ కు సంబంధించిన ఫోటోలు వైరల్ అయ్యాయి. ఈ క్రమంలోనే తన కూతురు క్షేమంగా కోలుకోవాలని ప్రతి ఒక్కరు ప్రార్థించండి అంటూ ఈమె సోషల్ మీడియా వేదికగా అభిమానులను కోరారు.
ఈ విధంగా రంభ యాక్సిడెంట్ కు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి. అయితే యాక్సిడెంట్ తర్వాత ఈమె మొదటిసారి ఇంస్టాగ్రామ్ లైవ్ లోకి వచ్చారు.ఈ సందర్భంగా రంభ మాట్లాడుతూ తాను మొదటిసారి లైవ్ లోకి వచ్చానని తన కూతురు ప్రమాదం జరిగిన విషయం తెలియగానే తన కూతురి కోసం ప్రార్థించిన మీ అందరికీ ధన్యవాదాలు అని తెలియజేశారు.
ప్రస్తుతం తన కూతురు ఆరోగ్యంగా ఉందని తనని ఇంటికి తీసుకువచ్చామంటూ రంభ తెలియచేశారు. ఇలా తమపై ఎంతో ప్రేమను చూపించిన మీ అందరికీ ఎప్పటికీ రుణపడి ఉంటా అంటూ రంభ ఇంస్టాగ్రామ్ లైవ్ ద్వారా అభిమానులకు ధన్యవాదాలు తెలియజేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…