Tag Archives: Sriya Reddy

Sriya Reddy: అమ్మ తోడు ఆ సినిమా ఏం అర్థం కాలేదు.. సలార్ బ్యూటీ షాకింగ్ కామెంట్స్?

Sriya Reddy: సలార్ సినిమా ద్వారా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు నటి శ్రియా రెడ్డి. ఈమె ఇదివరకు పలు తెలుగు తమిళ భాష చిత్రాలలో నటించారు. అయితే పెళ్లి చేసుకున్న తర్వాత పూర్తిగా సినిమాలకు దూరమైనటువంటి ఈమె తిరిగి తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. ఇలా శ్రియా రెడ్డి ఇటీవల సలార్ సినిమా ద్వారా మరోసారి తన నటన విశ్వరూపాన్ని చూపించారు.

ఇక ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో ఈమె వరస ఇంటర్వ్యూలకు హాజరై సందడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి శ్రియా రెడ్డి మణిరత్నం దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి పొన్నియన్ సెల్వన్ సినిమా గురించి మాట్లాడుతూ ఈ సినిమా తనకు ఏ మాత్రం అర్థం కాలేదు అంటూ కామెంట్స్ చేశారు.

మణిరత్నం సినిమాపై కామెంట్స్…

ఈ సినిమా ఎక్కడ మొదలవుతుంది ఎక్కడ వెళుతుంది అనే విషయాలు నాకు అసలు అర్థం కాలేదు అంటూ శ్రియా రెడ్డి కామెంట్స్ చేయడంతో ఈ కామెంట్లపై నెటిజన్స్ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా స్పందిస్తూ ఈమె వ్యాఖ్యలపై వారి అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఇక ఈమె ప్రస్తుతం సలార్ 2 సినిమాతో పాటు ఓ జి సినిమాలో కూడా నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే.

Sriya Reddy: సలార్ సినిమాలో ముందుగా నా పాత్రే లేదు..డైరెక్టర్ ప్రశాంత్ అలా నన్ను ఒప్పించారు?

Sriya Reddy: పాన్ ఇండియా స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ దర్శకత్వంలో మరో పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నటించిన తాజా చిత్రం సలార్ ఈ సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమాలో రాధా రామ మన్నార్ పాత్రలో ఎంతో అద్భుతంగా నటించారు నటి శ్రీయా రెడ్డి . ఈ సినిమా స్థాయిలో ఎంతో మంచి సక్సెస్ అందుకుంది.

0

ఇక ఈ సినిమా ఎంత విజయవంతం కావడంతో ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి శ్రీయ రెడ్డి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. డైరెక్టర్ ప్రశాంత్ పొగరు సినిమా చూసిన తర్వాత ఈ పాత్రకు నేనైతే సరిపోతానని చెప్పి ఆయన కథతో నా దగ్గరికి వచ్చారు. ఆయన కథ మొత్తం అద్భుతంగా అనిపించింది కానీ సినిమాలపై ఆసక్తి లేకపోవడంతో నేను నటించను అని చెప్పాను కానీ ఆయన ఒక చిన్న పిల్లలను ఒప్పించినట్టు నన్ను ఈ సినిమాకు ఒప్పించారని తెలిపారు.

స్క్రిప్ట్ మొత్తం చదివిన తర్వాతే సినిమా గురించి ఆలోచించండి అంటూ ప్రశాంత్ చెప్పారు. స్క్రిప్ట్ చదివిన తర్వాత నాకు ఈ సినిమా తెగ నచ్చి సినిమాకి ఒప్పుకున్నాను అని ఈమె తెలిపారు ఈ సినిమాకు చేసే సమయంలో ప్రశాంత్ ఈ పాత్ర ద్వారా మీకు మంచి పేరు వస్తుంది అంటూ నాకు ప్రామిస్ చేశారు ఆయన చెప్పిన విధంగానే ఈ పాత్రలో నటించినందుకు నాకు మంచి పేరు వచ్చిందని ఈమె తెలిపారు.

ప్రభాస్ స్వీట్ పర్సన్..

ఇకపోతే ఈ సినిమాకు ముందుగా అనుకున్నటువంటి స్క్రిప్ట్ లో నా పాత్ర లేదని అనంతరం లేడీ విలన్ క్యారెక్టర్ టచ్ చేస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచనతోనే తిరిగి నా పాత్రను తీసుకువచ్చారని ఈమె తెలియజేశారు. ఇక ప్రభాస్ గురించి మాట్లాడుతూ చాలా స్వీట్ పర్సన్ అని కామెంట్ చేశారు. మొదటి భాగం కొంతమందికి అర్థం కాకపోయినా రెండవ భాగం చూస్తే కనుక ఈ సినిమా ప్రతి ఒక్కరికి నచ్చుతుందని రెండవ భాగం మరో లెవెల్ లో ఉండబోతుందని మొదటి భాగం ద్వారా మేము కథను మాత్రమే పరిచయం చేసాము అంటూ శ్రేయ రెడ్డి సలార్ సినిమా గురించి చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Sriya Reddy: సలార్ నటి శ్రియారెడ్డి… ప్రముఖ క్రికెటర్ కూతురు అనే సంగతి తెలుసా?

Sriya Reddy: సలార్ సినిమాలో రాధా రామ పాటలు నటించినటువంటి నటి శ్రియ రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ఈమె తన నటనతో ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్నారు అయితే ఈ సినిమాలో ఏమైనా చూసినటువంటి కొందరు టాలీవుడ్ ఇండస్ట్రీకి మరో విలన్ దొరికింది అంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు అంతేకాకుండా ఈవెన్ ఎక్కడో చూసాము అని కూడా పలువురు భావిస్తున్నారు.

ఇదివరకే విషయాలు హీరోగా నటించిన పొగరు సినిమాలో విలన్ పాత్రలో నటించిన జీవితంలో కూడా విశాల్ అన్నయ్యను పెళ్లాడి తనకు వదినగా వెళ్లారు. ఇలా పెళ్లి తర్వాత కొంతకాలం పాటు అమెరికాలో ఉన్నటువంటి శ్రియా రెడ్డి అనంతరం చెన్నై తిరిగి వచ్చారు. ఇలా చెన్నై తిరిగి వచ్చినటువంటి ఈమె ఒక వెబ్ సిరీస్ లో నటించారు అనంతరం సలార్ సినిమాలో అవకాశం అందుకున్నారు.

ప్రముఖ నటుడు నిర్మాత విశాల్ అన్నయ్య విక్రంను పెళ్లి చేసుకుని గృహిణిగా స్థిరపడ్డారు. తాజాగా ఈమె తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ద్వారా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈమెకు క్రికెట్ రంగానికి విడదీయరాని అనుబంధం ఉందని తెలుస్తుంది ఈమె ప్రముఖ క్రికెటర్ కుమార్తే అంటూ తాజాగా ఈమె గురించి ఒక వార్త వైరల్ గా మారింది.

ప్రముఖ క్రికెటర్ కుమార్తె…

శ్రియా రెడ్డి తండ్రి భరత్ రెడ్డి ఈయన చెన్నైలో జన్మించారు. అంతర్జాతీయ స్థాయిలో భరత్ రెడ్డి టీం ఇండియా తరపున పలు మ్యాచ్లను ఆడారు.1978 నుంచి 81 వరకు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పాకిస్తాన్ 3 ఇంటర్నేషనల్ మ్యాచులలో వికెట్ కీపర్ గా నటించారు. ఇక ఈయన రిటైర్డ్ అయిన తర్వాత రెడ్డి క్లెంపాస్ట్ లో పనిచేయడమే కాకుండా క్రికెట్ శిక్షణ శిబిరాలను కూడా ప్రారంభించారు ఇలా ఈమెకు క్రికెట్ రంగానికి ఎంతో మంచి అనుబంధం ఉందని తెలుస్తుంది.