Sriya Reddy: సలార్ సినిమా ద్వారా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు నటి శ్రియా రెడ్డి. ఈమె ఇదివరకు పలు తెలుగు తమిళ భాష చిత్రాలలో నటించారు. అయితే పెళ్లి చేసుకున్న తర్వాత పూర్తిగా సినిమాలకు దూరమైనటువంటి ఈమె తిరిగి తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. ఇలా శ్రియా రెడ్డి ఇటీవల సలార్ సినిమా ద్వారా మరోసారి తన నటన విశ్వరూపాన్ని చూపించారు.
ఇక ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో ఈమె వరస ఇంటర్వ్యూలకు హాజరై సందడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి శ్రియా రెడ్డి మణిరత్నం దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి పొన్నియన్ సెల్వన్ సినిమా గురించి మాట్లాడుతూ ఈ సినిమా తనకు ఏ మాత్రం అర్థం కాలేదు అంటూ కామెంట్స్ చేశారు.
మణిరత్నం సినిమాపై కామెంట్స్…
ఈ సినిమా ఎక్కడ మొదలవుతుంది ఎక్కడ వెళుతుంది అనే విషయాలు నాకు అసలు అర్థం కాలేదు అంటూ శ్రియా రెడ్డి కామెంట్స్ చేయడంతో ఈ కామెంట్లపై నెటిజన్స్ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా స్పందిస్తూ ఈమె వ్యాఖ్యలపై వారి అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఇక ఈమె ప్రస్తుతం సలార్ 2 సినిమాతో పాటు ఓ జి సినిమాలో కూడా నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…