Venu Swamy: ప్రముఖ ఆస్ట్రాలజర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి ఈయన తరచూ సెలబ్రిటీల జాతకాలని చెబుతూ వార్తల్లో నిలుస్తున్నారు. ఇలా ఇప్పటికే ఎంతోమంది స్టార్ హీరోలు రాజకీయ నాయకులు జీవితాలు గురించి ఎన్నో విషయాలు చెప్పినటువంటి వేణు స్వామి పలుమార్లు విమర్శలను కూడా ఎదుర్కొంటున్నారు. ఈయన చెప్పే జ్యోతిష్యం నిజం కాకపోవడంతో పలువురు ఈయన పట్ల విమర్శలు కురిపిస్తున్నారు.
ఇక ఇటీవల కెసిఆర్ ఫ్యాన్స్ ప్రభాస్ ఫాన్స్ ఈయనపై విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా మొదటిసారి వేణు స్వామి సంపాదించినటువంటి ఆస్తుల గురించి మాట్లాడుతూ ఈయన చేస్తున్నటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి తాను జాతకాలు చెప్పడంతో చాలామంది తనపై విమర్శలు చేస్తున్నారని తెలిపారు. జ్యోతిష్యం చెప్పేవాడు జాతకమే బాగుంటే ఇలా జ్యోతిష్యం ఎందుకు చెబుతారు అంటూ కొందరు కామెంట్లు చేసినట్లు వేణుస్వామి వెల్లడించారు.
ఇలా నా గురించి విమర్శలు చేసే వారికి నేను చెప్పే సమాధానం ఇదే నేను కేవలం జ్యోతిషం చెప్పి మాత్రమే బతకడం లేదని నాకు వైన్ షాప్స్ ఉన్నాయని నాకు రేంజ్ రోవర్ కార్ ఉంది కోట్ల విలువ చేస్తే ఇల్లు అలాగే, ఆస్తులు కూడా ఉన్నాయని ఈయన తెలిపారు. ఇక తన భార్య వీణ వాణి కూడా భారీగానే సంపాదిస్తుందని వేణు స్వామి తెలిపారు.
జ్యోతిష్యం చెప్పి నేను బతకలేదు..
ఇలా నాకు ఎన్నో బిజినెస్ లో ఉన్నాయని నేను కేవలం జ్యోతిష్యం చెబుతూ బతకలేదు అంటూ వేణు స్వామి ఈ సందర్భంగా తన ఆస్తుల గురించి అన్ని విషయాలు బయటపెడుతూ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. వేణు స్వామి చెప్పినటువంటి ఈ మాటలను బట్టి చూస్తే ఈయన కూడా వందల కోట్ల ఆస్తిపరుడని తెలుస్తుంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…