Tag Archives: Stock market

4 గంటల్లో రూ.2 లక్షలకుపైగా లాభం.. ఎలా అంటే?

కేవలం నాలుగు గంటల వ్యవధిలోనే రూ.2 లక్షల లాభం అంటే ఎంతో ఆశ్చర్యం. కేవలం ఇంత తక్కువ వ్యవధిలో ఇంత లాభం ఏ వ్యాపారంలో అని ఆలోచిస్తున్నారా? ఈ లాభం వచ్చింది మరే వ్యాపారంలోనో కాదు. స్టాక్ మార్కెట్ షేర్ ధరలలో 4 గంటల్లో 2 లక్షల లాభం వచ్చింది. స్టాక్ మార్కెట్ ఎంత పనైనా చేస్తుంది. లేనివాడిని ఉన్నోడిగా చేస్తుంది. ఉన్నోడిని లేనివాడిగా మారుస్తుంది.

స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేవారు ఎంత లాభాలను చవి చూస్తారో అంతే నష్టాలను కూడా చూడాల్సి ఉంటుంది. ఈ విధంగా స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టిన వ్యక్తికి కేవలం నాలుగు గంటల్లో 2 లక్షల లాభం పొందాడు.గ్లాండ్ ఫార్మా షేరు మంగళవారం ఇంట్రాడే ప్రారంభంలో రూ.2910 వద్ద ఉండేది. మధ్యాహ్నం కల్లా ఈ షేరు రూ.3125 వరకు పరుగులు పెట్టింది. కేవలం నాలుగు గంటల వ్యవధిలో రూ.215 వరకు పైకి ఎగబాకింది.

గ్లాండ్ ఫార్మా కంపెనీ నాల్గవ త్రైమాసిక ఆర్థిక ఫలితాలను ప్రకటించడంతో సదరు కంపెనీకి ఏకంగా రూ.260 కోట్లకు చేరగా,నికర లాభంలో 34 శాతం పెరుగుదల నమోదు అయ్యింది. దీంతో కంపెనీ షేర్లు పరుగులు పెట్టాయి. ఈ క్రమంలోనే ఈ కంపెనీ పై చేసిన ఇన్వెస్టర్లకు లాభాలు గడించాయి.

ఛోటా భీమ్ కంపెనీతో లక్షల్లో సంపాదించే అవకాశం.. ఎలా అంటే..?

పిల్లలు, యువతీ యువకులు ఎంతో ఇష్టపడే కార్టూన్ ప్రోగ్రామ్స్ లో ఛోటా భీమ్ కూడా ఒకటి. ఈ యానిమేషన్ ప్రోగ్రామ్ కు లక్షల సంఖ్యలో వ్యూస్ ఉంటాయి. తొమ్మిది సంవత్సరాల ఛోటా భీమ్ అనే శక్తివంతమైన కుర్రాడు ఢోల‌క్ పూర్ అనే గ్రామంలో ఎవరికి ఎలాంటి కష్టం వచ్చినా రక్షిస్తూ ఉంటాడు. అయితే అతనికి ఎంతో ఇష్టమైన లడ్డూ తింటే మాత్రమే ఛోటా భీమ్ రక్షించగలడు. మనలో ఎవరైనా ఛోటా భీమ్ ను చూడకపోయినా ఆ పేరు మాత్రం వినే ఉంటారు.

పిల్లలు ఎంతో ఇష్టంగా చూసే చోటా భీమ్ డబ్బు సంపాదించే అవకాశం కల్పిస్తోంది. ఛోటా భీమ్ ను నిర్మించిన సంస్థ నజారా టెక్నాలజీస్ అనే సంగతి మనకు తెలిసిందే. ఇంటర్నెట్ గేమ్స్ వచ్చిన తొలినాళ్లలో నజారా టెక్నాలజీస్ పేరు మారుమ్రోగింది. ప్రత్యేకంగా వెబ్ కోసమే గేమ్స్ ను రూపొందించి ఈ సంస్థ పాపులారిటీని అంతకంతకూ పెంచుకుంది. ఎంతో పాపులర్ అయిన ఈ సంస్థ ప్రస్తుతం నిధుల సమీకరణ కొరకు ప్రయత్నాలు చేస్తోంది.

ఐపీఓ ఇష్యూను త్వరలో ప్రారంభించడానికి సిద్ధమవుతున్న నజారా టెక్నాలజీస్ ఆ తర్వాత స్టాక్ మార్కెట్ లో లిస్టింగ్ కావడంతో పాటు 900 కోట్ల రూపాయలను పెట్టుబడి రూపంలో సమీకరించాలని భావిస్తోంది. 2020 సంవత్సరం ఏప్రిల్ నెలలో లిస్ట్ చేయబడని నజారా టెక్నాలజీస్ షేరు ధర 550 రూపాయలుగా ఉండగా ఇప్పుడు ఆ షేరు ధర ఏకంగా 770 రూపాయలకు చేరడం గమనార్హం.

కంపెనీ షేర్ ధరలో రోజురోజుకు భారీగా పెరుగుదల నమోదు చేసుకుంటున్న నేపథ్యంలో ఇందులో పెట్టుబడులు పెట్టడం ద్వారా భారీ లాభాలను సొంతం చేసుకునే ఛాన్స్ ఉంటుంది. ఈ సంవత్సరం కొన్ని ఐపీఓలు పెట్టుబడులు పెట్టిన వారికి రెట్టింపు లాభాలు ఇచ్చిన నేపథ్యంలో ఆసక్తి ఉన్నవాళ్లు నజారా టెక్నాలజీస్ ఐపీఓలో పెట్టుబడులు పెట్టి అదిరిపోయే లాభాలను పొందవచ్చు.

నెలకు రూ.1000తో లక్షల్లో సంపాదించే ఛాన్స్.. ఎలా అంటే..?

సామాన్య, మధ్యతరగతి వర్గాల ప్రజలు తక్కువ పెట్టుబడితోనే ఎక్కువ రాబడి వచ్చే ఆదాయ మార్గాల కోసం అన్వేషిస్తూ ఉంటారు. ప్రతి నెలా కొంత మొత్తం పొదుపు చేసి అదిరిపోయే లాభాలను సొంతం చేసుకోవాలని భావిస్తూ ఉంటారు. కొన్ని మార్గాల్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా తక్కువ సమయంలోనే ఎక్కువ లాభాలను పొందే అవకాశం ఉంటుంది. 5 మార్గాల ద్వారా సులభంగా ఇన్వెస్ట్ చేసి లాభాలు పొందవచ్చు.

స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా తక్కువ సమయంలోనే ఎక్కువ లాభాలను సొంతం చేసుకునే ఛాన్స్ ఉంటుంది. అయితే స్టాక్ మార్కెట్లలో కళ్లు చెదిరే లాభాలు ఏ విధంగా ఉంటాయో ఊహించని స్థాయిలో నష్టాలు కూడా అదే విధంగా ఉంటాయి. సరైన అవగాహనతో మంచి షేర్లను ఎంచుకుని తక్కువ మొత్తంలో సంవత్సరాల తరబడి ఇన్వెస్ట్ చేస్తే కళ్లు చెదిరే లాభాలు సొంతమవుతాయి.

దీర్ఘకాలంలో డబ్బులను ఇన్వెస్ట్ చేయడానికి మ్యూచువల్ ఫండ్స్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. నెలకు 500 రూపాయల నుంచి ఎంత మొత్తమైనా మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయవచ్చు. స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడులు పెట్టడం ఒక విధంగా రిస్క్ అనే చెప్పాలి. పోస్టాఫీస్ లేదా బ్యాంకుల్లో రికరింగ్ డిపాజిట్ లో నగదు డిపాజిట్ చేస్తే మంచి లాభాలు సొంతమవుతాయి.

రికరింగ్ డిపాజిట్ స్కీమ్ లో 10 సంవత్సరాల వరకు డబ్బులు దాచుకునే అవకాశం ఉంటుంది. ఈ స్కీమ్ లో కస్టమర్లకు 3 నుంచి 9 శాతం వరకు వడ్డీ లభిస్తుంది. నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ లో కూడా డబ్బులను డిపాజిట్ చేసే అవకాశాలు ఉంటాయి. నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ స్కీమ్ లో డబ్బులు పెడితే పన్ను మినహాయింపు ప్రయోజనాలను కూడా పొందవచ్చు. ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేస్తే 6.8 శాతం వడ్డీ పొందే అవకాశం ఉంటుంది.

డబ్బుకు అదిరిపోయే లాభం ఇచ్చే ఐదు స్కీమ్ లు ఇవే..?

మనలో చాలామంది డబ్బులను పొదుపు చేయాలని అనుకుంటూ ఉంటారు. అయితే ఎక్కడ పొదుపు చేస్తే మంచి లాభాలు వస్తాయో తెలీక చాలామంది గందరగోళానికి గురవుతూ ఉంటారు. అయితే సరైన విధంగా డబ్బులను ఇన్వెస్ట్ చేస్తే మాత్రమే అదిరిపోయే లాభాలను పొందే అవకాశం ఉంటుంది. ప్రస్తుత కాలంలో తక్కువ సమయంలో స్మాల్ సేవింగ్ స్కీమ్స్‌, మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్ అదిరిపోయే లాభాలను అందిస్తున్నాయి.

అయితే అదిరిపోయే లాభం పొందాలంటే కొన్నిసార్లు రిస్క్ తీసుకోవడంతో పాటు దీర్ఘకాలం వేచి ఉండాల్సి ఉంటుంది. ప్రస్తుతం 5 స్కీమ్స్ ఇతర స్కీమ్ లతో పోలిస్తే అదిరిపోయే ప్రయోజనాలను అందిస్తున్నాయి. ఇందులో మొదటిది సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్. ఈ స్కీమ్ ద్వారా ఏకంగా 7.4 శాతం వడ్డీని పొందవచ్చు. గరిష్టంగా 15 లక్షల రూపాయల వరకు మాత్రమే ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసే అవకాశం ఉంటుంది.

సీనియర్ సిటిజన్స్ ఈ స్కీమ్ ద్వారా ప్రయోజనం చేకూరే ఛాన్స్ ఉంటుంది. పోస్టాఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ కూడా అదిరిపోయే లాభాలను అందిస్తోంది. 1000 రూపాయల నుంచి నాలుగున్నర లక్షల రూపాయల వరకు ఈ స్కీమ్ లో డిపాజిట్ చేయవచ్చు. ఈ స్కీమ్ లో ప్రతి నెలా ఖాతాలో వడ్డీ డబ్బులు జమవుతాయి. ఆర్‌బీఐ బాండ్లలో పెట్టుబడులు పెట్టి కూడా సులువుగా ఆదాయం పొందవచ్చు.

ఆర్బీఐ బాండ్లలో పెట్టుబడులు పెట్టినా ఎలాంటి నష్టం ఉండదు. బజాజ్ ఫైనాన్స్ లాంటి కార్పొరేట్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టి సులభంగా అదిరిపోయే లాభాలను పొందవచ్చు. ట్యాక్స్ ఫ్రీ బాండ్లు సైతం ఖాతాదారులకు అందుబాటులో ఉంటాయి. వీటిలో పెట్టుబడులు పెట్టినా ఎలాంటి రిస్క్ ఉండదు.

లక్ష పెట్టుబడితో 28 లక్షలు మీ సొంతం.. ఎలా అంటే…?

మనలో చాలామందికి డబ్బు సంపాదించాలంటే ఆశ ఉంటుంది. అయితే ఏ విధంగా సంపాదించాలనే విషయం తెలియక చాలామంది సంపాదించిన డబ్బుపై ఎక్కువ లాభాలకు పొందలేరు. అయితే సరైన విధంగా ఇన్వెస్ట్ చేస్తే మాత్రం తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలను చవిచూడవచ్చు. తక్కువ సమయంలో డబ్బు సంపాదించడానికి స్టాక్ మార్కెట్ కూడా ఒకటి. స్టాక్ మార్కెట్లలో రిస్క్ ఎక్కువగా ఉండటంతో లాభాలు కూడా ఎక్కువగా ఉంటాయి.

స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టడం ద్వార కేవలం సంవత్సరం కాలంలోనే కళ్లు చెదిరే లాభాలను పొందవచ్చు. అయితే స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులు పెట్టే సమయంలో స్టాక్ మార్కెట్ పై పూర్తిగా అవగాహన ఉంటే మాత్రమే ఇన్వెస్ట్ చేయడం మంచిది. మల్టీబ్యాగర్ స్టాక్ ను కనిపెట్టి పెట్టుబడి పెడితే కళ్లు చెదిరే లాభాన్ని గ్యారంటీగా సొంతం చేసుకోవచ్చు. బయోఫిల్ కెమికల్స్ అనే స్టాక్ ధర సంవత్సర కాలంలోనే 28 రెట్లకు పైగా పరుగు పెట్టింది.

గతేడాదిలో ఈ స్టాక్ లో ఎవరైనా పెట్టుబడులు పెట్టి ఉంటే వాళ్లకు ఏకంగా ఏకంగా 28 రెట్ల లాభం సొంతమవుతుంది. ఈ స్టాక్ పై గతేడాది లక్ష ఇన్వెస్ట్ చేసిన వాళ్లు ఏకంగా 28 లక్షలు, రెండు లక్షలు ఇన్వెస్ట్ చేసిన వాళ్లు 56 లక్షలు సొంతం చేసుకున్నారు. స్టాక్ మార్కెట్ పై పూర్తి అవగాహన ఉండి సరైన విధంగా పెట్టుబడులు పెడితే మీరు కూడా ఇంతే మొత్తాన్ని పొందే ఛాన్స్ ఉంటుంది.

బయోఫిల్ కెమికల్స్ గతేడాది రూ.4.42 దగ్గర ట్రేడ్ కాగా ప్రస్తుతం దాని ధర రూ.126కు పెరిగింది. సంవత్సర కాలంలో ఏకంగా 2768 శాతానికి పైకి పెరిగింది. ఈ కంపెనీకి పోటీగా ఉన్న ఇతర కంపెనీలు మాత్రం వెనకాలే ఉన్నాయి.