పిల్లలు, యువతీ యువకులు ఎంతో ఇష్టపడే కార్టూన్ ప్రోగ్రామ్స్ లో ఛోటా భీమ్ కూడా ఒకటి. ఈ యానిమేషన్ ప్రోగ్రామ్ కు లక్షల సంఖ్యలో వ్యూస్ ఉంటాయి. తొమ్మిది సంవత్సరాల ఛోటా భీమ్ అనే శక్తివంతమైన కుర్రాడు ఢోలక్ పూర్ అనే గ్రామంలో ఎవరికి ఎలాంటి కష్టం వచ్చినా రక్షిస్తూ ఉంటాడు. అయితే అతనికి ఎంతో ఇష్టమైన లడ్డూ తింటే మాత్రమే ఛోటా భీమ్ రక్షించగలడు. మనలో ఎవరైనా ఛోటా భీమ్ ను చూడకపోయినా ఆ పేరు మాత్రం వినే ఉంటారు.
పిల్లలు ఎంతో ఇష్టంగా చూసే చోటా భీమ్ డబ్బు సంపాదించే అవకాశం కల్పిస్తోంది. ఛోటా భీమ్ ను నిర్మించిన సంస్థ నజారా టెక్నాలజీస్ అనే సంగతి మనకు తెలిసిందే. ఇంటర్నెట్ గేమ్స్ వచ్చిన తొలినాళ్లలో నజారా టెక్నాలజీస్ పేరు మారుమ్రోగింది. ప్రత్యేకంగా వెబ్ కోసమే గేమ్స్ ను రూపొందించి ఈ సంస్థ పాపులారిటీని అంతకంతకూ పెంచుకుంది. ఎంతో పాపులర్ అయిన ఈ సంస్థ ప్రస్తుతం నిధుల సమీకరణ కొరకు ప్రయత్నాలు చేస్తోంది.
ఐపీఓ ఇష్యూను త్వరలో ప్రారంభించడానికి సిద్ధమవుతున్న నజారా టెక్నాలజీస్ ఆ తర్వాత స్టాక్ మార్కెట్ లో లిస్టింగ్ కావడంతో పాటు 900 కోట్ల రూపాయలను పెట్టుబడి రూపంలో సమీకరించాలని భావిస్తోంది. 2020 సంవత్సరం ఏప్రిల్ నెలలో లిస్ట్ చేయబడని నజారా టెక్నాలజీస్ షేరు ధర 550 రూపాయలుగా ఉండగా ఇప్పుడు ఆ షేరు ధర ఏకంగా 770 రూపాయలకు చేరడం గమనార్హం.
కంపెనీ షేర్ ధరలో రోజురోజుకు భారీగా పెరుగుదల నమోదు చేసుకుంటున్న నేపథ్యంలో ఇందులో పెట్టుబడులు పెట్టడం ద్వారా భారీ లాభాలను సొంతం చేసుకునే ఛాన్స్ ఉంటుంది. ఈ సంవత్సరం కొన్ని ఐపీఓలు పెట్టుబడులు పెట్టిన వారికి రెట్టింపు లాభాలు ఇచ్చిన నేపథ్యంలో ఆసక్తి ఉన్నవాళ్లు నజారా టెక్నాలజీస్ ఐపీఓలో పెట్టుబడులు పెట్టి అదిరిపోయే లాభాలను పొందవచ్చు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…